పెద్దాపురంలో అతిరాత్రం ఎందుకు…?

        అతిశయితా రాతిః ఇతి అతిరాత్రః

చారిత్రక పెద్దాపురం పట్టణంలో పాండవుల మెట్ట వద్ద 14 ఏప్రియల్ 2018 నుండి 25 ఏప్రియల్ 2018 వరకూ అతిరాత్రం మహాయాగం జరుగుతుంది… ఈ   యాగానికి దేేశం నలుమూలల నుండి వేద పండితులు పెద్దాపురం రానున్నారు…. రాష్ట నలుమూలల పెద్దాపురం లో జరగబోయే అతిరాత్రం చర్చనీయాంశం అవుతున్న నేేపద్యంలో అసలు అతిరాత్రం అంటే ఏమిటి   దీనిని పెద్దాపురం లోనే   ఎందుకు చేస్తున్నారు అనే విషయం తెలుసుకొందాం

సర్వప్రాణి కోటి సంరక్షణ కోసం మరీ ముఖ్యంగా మానవుడికి పంచభూతాలనుండీ ప్రకృతి వైపరీత్యాలనుండీ ఈతి భాధలనుండీ రక్షింపబడడానికి  కొన్ని సంస్కారాలు చేయాలని సనాతన దర్మం చెెపుతుంది అలాంటి  సంస్కారాలలో సప్త సోమయాగాలైైన అగ్నిస్టోమం, అత్యగ్నిస్టోమం, ఉక్ధ్యం, షోడసి, వాజపేయం, ఆప్తోర్యామం, అతిరాత్రం ఉన్నాయి. ఈ సప్త సోమయాగాలలో అతి పవిత్రమైంది ‘అతిరాత్రం

చరిత్రలో అతిరాత్రం

త్రేతాయుగంలో ఈ యాగాన్ని దశరథ మహారాజు నిర్వహించినట్టు రామాయణం బాలకాండలోని 14వ సర్గ 39వ శ్లోకం రెండో పాదం, 40వ శ్లోకం మొదటిపాదంలో పేర్కొన్నారు. దశరథ మహారాజు   అతిరాత్రం యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా నిర్వహించినట్లు ఆ శ్లోకాల ద్వారా తెలుస్తుంది

మన దేశంలో గుప్తరాజులు, చోళరాజులు తదితర రాజులు కూడా అతిరాత్రం యాగాన్ని నిర్వహించినట్టు దాఖలాలు ఉన్నాయి.

ఇటీవల అతిరాత్రం జరిగిన ప్రదేశాలు

‘అతిరాత్రం’ ఉత్కృష్ట సోమయాగం కేరళలో బాగా ప్రసిద్ధమైంది.

2011 ఏప్రిల్ 4 నుండి 15 వరకు కేరళలోని త్రిశూర్ జిల్లా పంజాల్ గ్రామంలో అతిరాత్రం నిర్వహించారు.

2012 లో ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు భద్రాచలానికి దగ్గర ఎటపాకలో జరిగింది.

2013 లో ఏప్రిల్ నెలలో కీసరగుట్ట గ్రామంలో జరిగింది.

పెద్దాపురం లోనే ఎందుకు నిర్వహిస్తున్నారు
అతిరాత్రం జరిగే ప్రదేశం సూర్యశక్తిని కేంద్రీకరించేందుకు అనువైన స్థలం అయి ఉండాలి

ఈ స్థలం పవిత్రమైన క్షేత్రం అయి ఉండి, నదీ తీరం సముద్ర తీరం మద్యస్తమై, చుట్టుపక్కల అటవీ ప్రాంతం అయి ఉండాలి పైవన్నీ లక్షణాలు గల పవిత్ర స్థలం పెద్దాపురం కావడం విశేషం

యాగం ఎలా చేస్తారు

ఈ యాగంలో లోహపాత్రలను ఉపయోగించరు. అన్ని వస్తువులను కర్రతో తయారు చేస్తారు.

యాగం కోసం వెదురు, తాటి ఆకులతో ప్రత్యేకంగా పర్ణశాలను నిర్మిస్తారు.

యాగం నిర్వహించే రోజుల సంఖ్యను అనుసరించి వీటిని మూడు రకాలుగా విభజించారు.

ఒకరోజు చేసే యాగాన్ని ‘ఏకాహం’ అని,

రెండు రోజుల నుండి 12 రోజుల పాటు నిర్వహించే యాగాన్ని ‘ఆహీనం’ అని,

పన్నెండు రోజులు మించి చేసే యాగాన్ని ‘సత్ర’ యాగమని అంటారు.

మన పెద్దాపురం లో 12 రోజులపాటు నిర్వహించబోయే అతిరాత్రం ఆహీనం యాగంలో మొదటి మూడు రోజులు దీక్షాసమయంగానూ,

తర్వాతి ఆరు రోజులు ఉపాసనా దినములుగాను,

చివరి మూడు రోజులు సూత్యంగానూ వ్యవహరిస్తారు.

యాగం సందర్భంగా పండిత ప్రముఖుల వేద పఠనం ఉంటుంది.

పూజ్యులు బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరానంద స్వాములవారి ఆధ్వర్యంలో జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి శ్రీ విదుశేఖర భారతీ స్వామి, బ్రహ్మశ్రీ శ్రీ సామవేదం స్వామి, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, వెదురుపాక గాడ్ గారి శుభాశిస్సులతో మహాగ్నిచయన మహోత్కృష్ట సోమయాగం పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద గల సూర్యనారాయణ స్వామి దేవాలయం దిగువన జరుగుతుంది

1831total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *