Ambadipudi Agraharam, Peddapuram History

పెద్దాపురం సంస్థానం : అంబడిపూడి అగ్రహారం

అవి వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు చారిత్రక పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలిస్తున్న రోజులు… ఆయన మహా పరాక్రమవంతులు వేట అంటే మహా ఇష్టం…

పెద్దాపురానికి సమీపంలోనే మన్యం అటవీ ప్రాంతం ఉండటంతో తరచూ మారువేషంలో అక్కడకు వేటకు వెళ్తూ వస్తూ ఉండేవారు ఒకరోజు వేటకు వెళ్లి వస్తూ మద్యదారిలో బాగా ఆకలి వేయడంతో మార్గ మద్యంలో ఉన్న ఒక పల్లెకు వెళ్లి పెండ్యాల భూలచ్చమ్మ అను పేరు గల ఒక పెద్దావిడను తనకేదైనా తినడానికి పెట్టమని అడిగెను…

ఆ పెద్దావిడ మా ఇంట మేము వండుకున్న అంబలి తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పి కావాలంటే ఆ అంబలి కొంచెము పోస్తానని చెప్పింది. రాజు గారు కూడా అందుకు అంగీకరించి ఆ అంబలి ని తీసుకుని త్రాగి పెద్దాపురం కోటకి బయలుదేరి వెళ్లిపోయారు…

ఆ తరువాత రోజు వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు ఆ పుణ్యవంతురాలయిన మహిళా మూర్తి పెండ్యాల భూలక్ష్మమ్మ ని కబురు పంపించి ఆమెకు కొంత దనమును, ఒక గ్రామమును అగ్రహారముగా రాసి ఇచ్చెను ఆ ఆగ్రహారానికే “అంబలి పూడి అగ్రహారం” మహారాజుకి అంబలి పోసింది కనుక ఆ అగ్రహారం అంబలి పూడి అగ్రహారం అయ్యిందని కాల క్రమంలో అది అంబడిపూడి అగ్రహారంగా మారిపోయిందనేది ఒక ఆసక్తికర కధనం. అంబడిపూడి అనే ఊరు గుంటూరులో ఉంది గుంటూరు మండలంలో ఎక్కువ భాగం ఒకప్పుడు పెద్దాపురం సంస్థానంలో భాగంగా ఉండేది. వంగలపూడి శివకృష్ణ

Ref: పెద్దాపురం సంస్థాన చరిత్రము Book

3167total visits,1visits today

2 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *