మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం

మార్చి 29 , 10:28 ని:లకు మన పెద్దాపురం గ్రూప్ మూడు వసంతాలు పూర్తి చేసుకోనుంది ..మీ అందరి సహకారంతో గ్రూప్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం .ఇప్పటి వరకు గ్రూప్ ద్వారా చేసిన కార్యక్రమాలను ఈ క్రింద లింక్ లో చూడవచ్చు

http://www.manapeddapuram.info/category/fb-group/

ముఖ్యంగా అవయవదానం పై అవగాహన కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నపుడు చాలా మంది వద్దని చెప్పారు ..ఇప్పటివరకు మీరు సంపాదించుకున్న పేరు మొత్తం పోతాదని వాదించిన వారున్నారు .టెక్నాలిజి ఇంత అభివృద్ది చెందుతున్న తరుణంలో కూడా సెంటి మెంట్స్ కూడా ఉన్నాయా? అనిపించింది.అయినా ధైర్యంతో ముందడుగు వేసాం ..కేవలం పెద్దాపురం పట్టణంలోనే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలలో కూడా అవయవదానం పై విస్తృతంగా అవగాహన కల్పించాం .ఆ అవగాహన ఫలితం పెద్దాపురం పట్టణంలోముగ్గురు చేత గ్రూప్ ద్వారా కళ్ళదానం  చేయుంచాం

 

ఇపుడు కూడా ఎంతో సాహసంతో ధైర్యంగా “జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు” అంటూ శానిటరీ ప్యాడ్స్ పై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం .బహిష్టుల కారణంగానే భారత దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 23 శాతం మంది అమ్మాయిలు చదువుమానేస్తున్నారు. దీంతో వారి భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటోంది. ఈ చేదు నిజాన్ని అందరికి తెలియచేసి శానిటరీ ప్యాడ్స్ పై ప్రతీ ఒక్కరు పబ్లిక్ లో విస్తృత ప్రచారం చేసేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం .మన మహరాణీ కళాశాల ప్రిన్సిపల్ డా :ఇందిరా ఆశాలత గారితో వీటి గురించి మాట్లాడడం జరిగింది..ఈ కళాశాల విద్యార్ధునలకు ఈ అవగాహన కార్యక్రమం చాలా అవసరం ..స్వయంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులను నేను చూస్తున్నాను ..ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని మాతో చెప్పడం జరిగింది .మన ప్రాంతంలోనే ఇలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలలో పరిస్ధితి ఎలా ఉంటాదో ఒక్కసారి ఆలోచించండి .

శానిటరీ ప్యాడ్స్ పై పని చేస్తున్న అనేక N.G.O స్ తో మాట్లాడడం జరిగింది..BIO sanitary Pads (Re – Usable ) గురించి మరియు వెండింగ్ మెషీన్స్ గురించి చర్చించడం జరిగింది భవిష్యత్ లో వీటి పై అందరిని కలుపుకుని మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మన పెద్దాపురం గ్రూప్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతుంది

మా గ్రూప్ లో ఏక్టివ్ మెంబర్స్ గా మహిళలు ఎవరు లేక పోయినప్పటికి ఎంతో ధైర్యంతో మొదటి అడుగు వేసింది .గ్రూప్ సభ్యులలో ఎవరైన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవల్సిందిగా కోరుచున్నాం @ 9849911489

మీ అందరి సహకారం ఉంటుంది అని ఆశిస్తూ… మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తో

మీ …

మన పెద్దాపురం TeaM-

531total visits,5visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *