About FB Group

MANA PEDDAPURAM FACEBOOK GROUP LOGO

పెద్దాపురం చరిత్ర వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా 29 మార్చి 2015 న “దేశం మా దేహం అయితే ఊరు మా ఊపిరి” అనే నినాదంతో కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మన పెద్దాపురం పేస్ బుక్ గ్రూపు ఆవిర్భవించబడింది. ఊరు ఊరు అభివృద్ది చెందితే దేశం మొత్తం అభివృద్ది చెందుతుంది దానికోసం ప్రతీ యువకుడు పాటుపడాలి… అందుకోసం ముందుగా వారు పుట్టిన ఊరి యొక్క ఘనతను తెలుసుకోవాలి అందరికీ తెలియజేయాలి… సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి… సేవాకార్యక్రమాలు చేసేవారిని అభినందించాలి… మహనీయుల జీవిత విశేషాలను అందరికీ తెలియజేసి ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తి నింపాలి… ఒకరికోసం అందరు – అందరికోసం ఒక్కరు అంటూ… రక్తం అవసరమైన వారికి రక్తం అందించడం… విద్యార్ధులకి పుస్తకాల పంపిణీ… పేద విద్యార్థులను చదివించడం… ఆర్ధికంగా చితికిపోయిన వారికి చేయూతను అందించడం… ఎవరికీ ఏ అవసరం వచ్చినా చేతనైన సహాయ సహకారాలను సకాలంలో అందించే ప్రయత్నం చేయడమే కాకుండా మొక్కలు నాటడం ద్వారా మన ప్రకృతిని, పర్యావరణాన్ని, జీవరాసులని సంరక్షించాలి అనే ఉద్దేశ్యంతో అనేకమైన సేవాకార్యక్రమాలు చేసి పెద్దాపురం పరిసర ప్రాంతాల ప్రజలందరి మన్ననలు పొందింది మన పెద్దాపురం పేస్ బుక్ గ్రూప్

500total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *