About SMS

సోషల్ మీడియా ఫర్ సొసైటీ అంటే సమాజం కోసం సామాజిక మాధ్యమం – సామాన్యుడి చేతిలో స్వేచ్చా ఆయుధం : సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వార్తా చానెళ్లు మాత్రమే బలమైన సామాజిక మాద్యమాలుగా చెలామణీ అవుతున్న సమయంలో వాటన్నింటిని త్రోసిరాజని పేస్ బుక్, వాట్స్ అప్, గూగుల్ ప్లస్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చి ప్రతీ ఒక్కరూ వారి వారి భావాలను అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే చక్కటి అవకాశం ఇవ్వడం ద్వారా విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వారి యొక్క ప్రతిభను బయట పెట్టుకోవడానికి, వారి వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడానికి, క్షణాల వ్యవధిలో సమాచారం పొందడానికి అలాగే ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి, నిజాలు నిర్భయంగా వెల్లడి చేయగలుగుతున్నాయి. అంతేకాకుండా యువత గ్రూపులుగా ఏర్పడి సమాజానికి సేవచేయడానికి వేదికలుగా నిలుస్తున్నాయి… సమస్యలపై తమ స్వరం వినిపిస్తున్నాయి వాటి సాధనకోసం నిరంతరం పోరాడుతున్నాయి… అందుకే సమాజానికి సేవచేసే వారందరినీ ఏకతాటిపైకి తేవాలనే సంకల్పంతో సోషల్ మీడియా ఫర్ సొసైటీ, 2016 లో ఆవిర్భవించింది. రాష్ట్రం నలుమూలల నుండి వందలాది సోషల్ మీడియా కార్యకర్తలు తరలి రాగా మొట్టమొదటి రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడలో విజయవంతంగా నిర్వహించి ముందుకు దూసుకుపోతుంది

సోషల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావాల‌ని తూర్పు గోదావ‌రి జిల్లా పోలీసులు భావిస్తున్నారు. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా పోలీసుల దృష్టికి తీసుకురావ‌చ్చ‌ని ఎస్పీ విశాల్ గున్నీ ప్ర‌క‌టించారు. ఎఫ్ బీలో పోలీస్ పేజ్, వాట్సాప్ నెంబ‌ర్ కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. జిల్లా ప్ర‌జానీకం వీటిని ఉప‌యోగించుకుని పోలీస్ వ్య‌వ‌హారాల్లో పార‌ద‌ర్శ‌క‌త‌కు ప్ర‌య‌త్నించాల‌ని సోష‌ల్ మీడియా ఫ‌ర్ సొసైటీ (SMS) విజ్ఞ‌ప్తి చేస్తోంది.
అంద‌రం వినియోగిద్దాం..పోలీస్ ప్ర‌య‌త్నాల‌కు చేదోడుగా నిలుద్దాం…సామాన్యుడికి పోలిస్ యంత్రాంగం అందుబాటులో ఉండేలా ప్ర‌య‌త్నిద్దాం..

1034total visits,2visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *