Amaragiri Sattemma History – Peddapuram

శ్రీ శ్రీ శ్రీ అమరగిరి సత్తెమ్మ అమ్మవారి చరిత్ర

 

“ఓం ఐం హ్రిం శ్రీం శ్రీ సత్యాంబికాయైనమః”

“అమ్మదయ అపారం – అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే”

నవదుర్గా స్తోత్రం = “ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా”

కోటసత్తెమ్మ అమ్మవారి పూర్వచరిత్ర

పూర్వకాలంలో గ్రామ ప్రజలందరినీ ప్రమాదాల నుండి కాపాడుతూ, అన్నదాతలైన రైతుల పంటలను కాపాడుతూ, సకాలంలో వర్షాలు కురిసేలా చేస్తూ, అకాల మృత్యు భయాన్ని పారద్రోలే గ్రామ దేవతగా పాత పెద్దాపురం మహారాజా వారి కోటలో #కోటసత్తెమ్మ అమ్మవారు వెలిసారు..

కోట సత్తెమ్మ  అమరగిరిసత్తెమ్మ గా ఆవిర్భవించిన విధానం

ఆలయ వ్యవస్థాపకులలో ఒకరైనటువంటి కీ.శే.  శ్రీ గజ్జెల చలపతి రావు గారికి అమ్మవారు కలలో కనిపించి తాను రాజుగారి కోటలో కొలువై ఉన్న విషయం తెలుపగా చలపతి రావు గారు ఆ విషయాన్ని ప్రధాన ఆలయము, ఉపఆలయ వ్యవస్థాపకులు శ్రీ పప్పల నాగరాజు గారికి తెలియజేయడం జరిగింది వెనువెంటనే ఇద్దరూ రాజు గారి కోట సమీపించి అమ్మవారి మూల విగ్రహాన్ని గుర్తించి జగ్గంపేట రోడ్డు సమీపంలో ప్రతిష్టించడం జరిగింది (ఇప్పటికీ ఆ మూల విగ్రహం ఆలయం లోనే ఉంది)

ఆనాటి నుండీ పెద్దాపురం అమరగిరి – పాండవుల మెట్ట సమీపంలో కొలువైన శ్రీ సత్తెమ్మ అమ్మవారు – కోట సత్తెమ్మ అమ్మవారి నుండి అమరగిరి అమ్మగా వెలుగొందుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై … అష్ట ఐశ్వర్య సుఖసంతోషాలు సిరి సంపదలిచ్చే అమ్మగా … గజ్జిల, పేద గoదo, పప్పల వారికి కుటుంబ దేవత గా వేలుగోoదినది మరియు అనేకులు అమ్మను కుటుంబ దేవతగా ఆరాధన చేస్తున్నారు…

అమరగిరి సత్తెమ్మ అమ్మవారు అష్టాదశ హస్తాలతో దుష్ట శక్తులను రూపుమాపే అభయ స్వరూపిణిగా ఓం ఐం హ్రిం శ్రీం శ్రీ సత్యాంబికాయైనమః‘ అన్న మంత్రోచ్చరణతో విరాజిల్లే అమరగిరి సత్తెమ్మ అమ్మవారిగా… భక్తుల పూజలందుకొంటున్నారు,

ప్రస్తుతం శ్రీ శక్తిపీఠంగా అలరారుతున్న ఈ ఆలయానికి 1973 ప్రాంతం నుండీ పప్పల నాగరాజు దంపతులు ప్రధాన అర్చకులుగా వ్యవరిస్తూ అనేక యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ అమ్మవారి సేవచేసారు, అనంతరం వారి కుమారుడు శ్రీ పెదబాబు గారు (గురువర్యులు) అమ్మవారి అర్చకులుగా కొనసాగుతున్నారు.

ఉయ్యాల_తాళ్లఉత్సవంఅమ్మవారి_గరగలు : ఏటా ధనుర్మాసం లో వచ్చే పౌర్ణమి రోజున పెదగంధం వారు పాన్పు వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు… తదనంతరం అమ్మవారి గరగలు తీస్తారు తల్లి గరగను ఆలయంలోనే ఉంచి మిగిలిన గరగలను పట్టణంలో అన్ని వీధులలో ఊరేగిస్తారు అనంతరం ఆసాది కుటుంబీకులు అమ్మవారికి కుంభం వేస్తారు

సత్తెమ్మ_సంబరం : భోగినుండి కనుమ వరకూ అత్యంతవైభవంగా జరిగే ఈ జాతర మహోత్సవంలో భాగంగా మొదటి రోజైన భోగి నాడు కట్టమూరుకు చెందిన పంబలవారు మేలుకొలుపు పాటతో సంబరం ప్రారంభిస్తారు#పంబలవారు_వస్తేకానీ_అంబపలకదు అని సామేత రెండవ రోజైన పెద్ద పండుగ నాడు ప్రత్యేక పూజాధి కార్యక్రమాలు నిర్వహిస్తారు మూడవ రోజైన కనుమ నాడు పెద్ద ఎత్తున మేళతాళాలతో, గరగ నృత్యాలు, పెద్దపులాట, కోయడాన్సు, కాళికా నృత్యం, బ్యాండు మేళం, బాణా సంచాలతో రంగు రంగుల విధ్యుత్ ధీపాలంకరణలతో అంగరంగ వైభవంగా సంబరాలు చేస్తారు… తదనంతరం#పొలిమేరు_కట్టి అమ్మవారిని అత్తింటికి సాగనంపి సంబరం ముగిస్తారు.

ఈ కార్యక్రమానికి అమ్మవారి భక్తులు, పెద్దాపురం ప్రజలు, పోలీసు, అగ్నిమాపక, వైద్య శాఖ మరియు పురపాలక సంఘం వారి సహాయ సహకారాలతో, ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అమ్మవారి ఆలయ సంరక్షణాభివృద్ది చేస్తూండటం గమనార్హం

ఆలయవిశేషాలు_పూజాకార్యక్రమాలు

1. ఆలయం ఎదురుగా ఉన్న కోట సత్తెమ్మ పంచ మహా వృక్షం – మర్రి, వేప, జువ్వి, నేరేడు, రావి వృక్షాల మిళితమై పరమ పవిత్రతను సంతరించుకుంది.

2. ఈ ఆలయం చుట్టూ నాగుల విగ్రహాలతో అష్ట నాగదిగ్బంధనం ఉంటుంది.

3. ఆలయ ప్రాంగణంలో అమ్మవారు అష్టోత్తర- శత నామావళిలతో కీర్తించబడతారు.

4. ఆలయంలో త్రిభైరవమూర్తులు (కాలభైరవ.. వటుక భైరవ.. స్వర్ణాకర్షణ భైరవ) కొలువై వుండడం కూడా చెప్పుకోదగ్గ విషయం.

5. స్ఫటిక విఘ్నేశ్వరుడు యిక్కడ చాలా ప్రసిద్ధి ..

6. నవ దుర్గా స్తోత్ర పారాయణం తో కూడిన చిత్రాలు నవ దుర్గలు (శైలపుత్రి దుర్గ, బ్రహ్మచారిణి దుర్గ, చంద్రఘంట దుర్గ, కూష్మాండ దుర్గ, స్కందమాత దుర్గ, కాత్యాయని దుర్గ, కాళరాత్రి దుర్గ, మహాగౌరి దుర్గ, సిద్ధిధాత్రి దుర్గ )

7. ఈ ఆలయం నందు ఉండు ఉప ఆలయం నందు శ్రీ వరాహి అమ్మవారు నిజరూపంలో ప్రతిరోజు తెల్లవారుఝామున గం.4 నుండి గం.5వరకు భక్తులకు దర్శనం లభిస్తుంది.

8. .శ్రీ శక్తిపీఠంనందు శ్రీ చక్రయంత్ర సహిత వనదుర్గాదేవికి ఘనంగా యజ్ఞయాగాదులను నిర్వహించడం జరుగుతుంది.

9. దూప.. దీప.. నైవేద్య ప్రసాదాలతో నిత్యం అలరారే శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు జాతర సమయంలో గరగ ప్రభలతో భక్తులకు దర్శనమిస్తారు. వంగలపూడి శివకృష్ణ

Ref: Pedababu Guruji, Temple Trusty

744total visits,4visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *