Author: NARESH PEDIREDDI

Share Your Knowledge

నీ ప్రతిభ నీకు , నీ కుటుంబానికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడాలి – Share Your Knowledge   మన పెద్దాపురం గ్రూప్ ఎడ్యుకేషన్ వింగ్ వినూత్న ప్రయత్నం – షేర్ యుర్ నాలెడ్జ్ మీరు పాఠాలు నేర్చుకున్న బ్లాక్ బోర్డ్ వద్దే మీరు పాఠాలు చెప్పాలి మీ ప్రతిభ మీరు చదువుకున్న స్కూల్ విద్యార్ధులకు ఉపయోగపడాలి మీ ఉద్యోగ అనుభవం మీకు జన్మనిచ్చిన ఊరు నిరుద్యోగ యువతికి ఉపయోగపడాలి మీ కమ్యునికేషన్ స్కిల్స్ ఇతరలకు

పచ్చదనం కోసం పది గంటలు

Sunday, November 19, 2017 : ఊరు పచ్చగా ఉండాలని మన పెద్దాపురం గ్రూప్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సినిమా సెంటర్ నుండి తిమ్మాపురం రోడ్డు వరకు మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా 20 జంటలు( భార్యాభర్తలు) హాజరు అయ్యారు https://www.facebook.com/events/255009108361643/

ప్రాణదాన ఉద్యమం- 2017

Friday, August 11, 2017 : పెద్దాపురం నియోజక వర్గంలో ఇప్పటి వరకు అవయవదానం చేసిన ప్రతీ ఒక్కరికి నివాళులు అర్పిస్తూ , మనస్పూర్తిగా  మేమంతా కలిసి గళమెత్తాం ..మీరే మాకు స్పూర్తి మీ అడుగు జాడల్లోనే నడుస్తాం అని వాగ్దానం చేస్తూ అవయవదాన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది https://www.facebook.com/events/1518534241536739/

M.R College Golden Jubilee Song

Sunday,February 4,2018 Mana Peddapuram Group Presents  చారిత్రక పట్టణం పెద్దాపురంలో ఉన్న శ్రీ రాజా వత్సవాయ బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహరాణీ కళాశాల స్ధాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకలలో కళాశాల పూర్వ విద్యార్ధి నూజిళ్ళ శ్రీనివాసు గారు పాడిన పాట  

Blood Donation Camp And Blood Test Camp

Tuesday, March 28, 2017 ముందు చూపుతో మహ సంకల్పం  మన పెద్దాపురం గ్రూప్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా పెద్దాపురంలో ఉన్న అన్ని సేవా సంస్ధలు కలిసి ఒక మెగా రక్తదాన శిభిరాన్ని  ఏర్పాటు చేసాం.అలాగే గ్రూప్ నిర్దారణకు రక్త పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది . పెద్దాపురంలో ఉన్న అన్ని సేవా సంస్ధలు ఒకే వేదిక పైకి రావడం శుభపరిణామం   

Green Blood Donation Camp

Sunday, December 18, 2016: రక్తదానం సేవ మాత్రమే కాదు ప్రతీ పౌరుడి బాధ్యత వేరొకరికి ప్రాణం పోసే అదృష్టం మనకి లేదు ..కాని పోయే ప్రాణాన్ని కాపాడే అవకాశం, అదృష్టం మనకి ఉన్నాయి – రక్తదానం చేద్దాం. ప్రాణాలను నిలుపుటకు తోడ్పదాం. చెట్టు నాటిన వారు చిరంజీవులు . ఒక్క చెట్టు సంవత్సరానికి మూడు వేల కిలోల ప్రాణవాయువునిస్తుంది – ఒక మొక్కని నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం   స్ధానిక ట్రినిటి పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు

ప్రతీ ఇంట మట్టిగణపతి

Sunday, September 4, 2016 :   మట్టి గణపతి పూజ శాస్త్ర సమ్మతం, శుభప్రదం, ఐశ్వర్యదాయకం ప్రతీ ఇంటా మట్టిగణపతినే పూజించేలా చేసి పర్యావరణాన్ని కాపాడలనే ముఖ్య ఉద్దేశంతో  మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో సుమారు 2000 మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంచడం జరిగింది

ప్రాణదాన ఉద్యమం – 2016

Saturday, August 13, 2016: మనం భూమి మీద లేకపోయిన మన కళ్ళు ప్రకృతి అందాలను చూస్తాయి మనం శ్వాసించకపోయిననా మన గుండె లబ్ డబ్ అంటూనే ఉంటుంది  మృత్యువును జయించినవారంతా దేవతలే అయితే ఆ జాబితాలో మనం కూడా చేరుదాం !! రండి మానవత్వంతో ఒక్క అడుగు వెయ్యండి – అవయవదానం చెయ్యండి !! మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో అవయవదానం పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే దాదాపు 2000

ఇంటింటా చెట్టు – ఊరంతా పచ్చదనం

Sunday, June 5, 2016 : పర్యావరణం అంటే మనం. పర్యావరణ పరిరక్షణ అంటే మనం మనల్నీ, మన పరిసరాలని మన నీటిని , ముఖ్యంగా మన రేపుని కాపాడుకోవడం ఇంటింటా చెట్టు – ఊరంతా పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు మన పెద్దాపురం గ్రూప్ స్ధానిక ఎన్.టి.ఆర్ కాలనీలో దాదాపు 100 మొక్కలు నాటడం జరిగింది ..అనంతరం మెయిన్ రొడ్డు లో 500 మొక్కలు పంచడం జరిగింది .ఈ కార్యక్రమంలో

ఇంటింటా పెద్దాపుర చరితం

Tuesday, March 29, 2016 మన పెద్దాపురం Facebook గ్రూప్ మెదటి వార్షికోత్సవం సందర్బంగా మన ఊరు చరిత్ర గొప్పతనాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో “ఇంటింటా పెద్దాపుర చరితం” అనే కార్యక్రమం చేయండం జరిగింది Mar 29, 2016 ఉదయం 10:28 కి స్దానిక వెంకటేశ్వరస్వామి గుడి నుండి మున్సిపల్ సెంటర్ వరకు “The Historic Walk”  పేరుతో  సుమారు 500 మంది గ్రూప్ మెంబర్స్ ర్యాలీ చేయండం జరిగింది.  ఈ ర్యాలిలో పెద్దాపురం మార్కెట్ లో