Biccavolu Golingeswara Swamy Temple History

శ్రీ గోలింగేశ్వర స్వామీ ఆలయ చరిత్ర

బిరుదాంకిత పురం – బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయం

క్రీస్తుశఖం 8 వ శతాబ్దంలో తూర్పు చాళుక్య మహారాజు మృగరాజ నరేంద్రుడు 108 మహా యుద్దాల్లో గెలుపొంది అనేక మంది మృతికి కారకుడయ్యాడనే పాప భీతితో 108 శివాలయాలను ఆ ప్రాంతంలో నిర్మింప చేయడం జరిగింది. ఆ తరువాత కాలంలో తురుష్కుల దండయాత్రల ఫలితంగా దాదాపు అన్ని ఆలయాలు భూగర్భంలో కలిసి పోయాయి

తూర్పు చాళుక్యులు… తురుష్కుల అనంతరం బిక్కవోలు పెద్దాపురం మహారాజుల పాలనలోకి వచ్చింది

పెద్దాపురం మహారాజైన శ్రీ రాజా వత్సవాయి తిమ్మజగపతి పాలనాకాలంలో గోవులు వాటి పొదుగునుండి సహజసిద్ధంగా ఏర్పడిన ఒక పెద్ద పుట్టపై పాల దారలు కురిపించి పుట్టలో ఉన్న మహా శివలింగాన్ని బయట పడేలా చేశాయంట అందుకే ఆ శివలింగాన్ని గోలింగేశ్వరుడు అని పిలుస్తారు -పెద్దాపురం మహారాజా వారు శివలింగ సాక్ష్యాత్కారం జరిగిన చోటనే దేవాలయ పునరాభివృద్ది చేసి అతనికి సంతానం లేని కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ట చేసి ఆలయం కూడా కట్టించి శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వర ప్రసాదం వల్ల సంతానం పొందాడని ప్రతీతి

అందుకే సంతానం లేని వారు రాష్ట్రం నలుమూలలనుండీ సంవత్సరం పొడవునా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయాల గోపురం పై ఉన్న శిల్ప కళా సౌందర్యం సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి : @వంగలపూడి శివకృష్ణ

867total visits,4visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *