Buvaneswari Sakthi peetam, Peddapuram

భువనేశ్వరి శక్తీ పీఠం :

   భువనేశ్వరి దేవి శ్లోకం :

అష్ట సిద్ధిధరం లక్ష్మీ అరూపా బాహు రూపిణి
త్రిశూల భుక్కరా దేవి పాసాంకుశ విధారిణి

ఖడ్గ ఖేద ధారా దేవి గంటా ని చక్ర ధారిణి
షోడశి త్రిపురాదేవి త్రిరేఖా పరమేశ్వరి

కౌమారీ పింగళా చైవవారిని జగన్మోహినీ,
దుర్గాదేవి చ త్రిగంగా నమస్తే శివనాయిక

హిందూ పురాణాల ప్రకారం ఈ అనంత విశ్వం అంతా శక్తి మయం కంటికి కనిపించని ఏదో ఒక శక్తి ప్రపంచాన్ని నడిపిస్తున్నదని శాస్త్రవేత్తలు సైతం తరచూ మాట్లాడుతూ వుంటారు.

 

దశ మహా విద్యలు ( మహా విద్యలు అనగా జ్ఞాన ప్రదాయినీ శక్తీ రూపాలు )
1) కాళీ 2) తారా 3) త్రిపుర సుందరి 4) భువనేశ్వరీ 5) చిన్మస్త
6) బైరవి 7) ధూమవతి 8) భగలముఖి 9) మాతంగి 10) కమల
మొదలగు జ్ఞాన ప్రదాయినీ శక్తీ రూపాలు లో శ్రీ భువనేశ్వరీ అమ్మవారు 4 నాల్గవ శక్తీ రూపం

భువనేశ్వరి అనే పదం భువన మరియు ఈశ్వరి అనే పదాల కలయిక దీని అర్ధం ప్రపంచాన్ని పాలించే శక్తి

అనంత విశ్వం అంతా ఆమె శరీరంగా అనంత కోటి జీవరాశులు, వృక్ష జంతు సముదాయాలు, నదులు, సముద్రాలు, పర్వతాలు ఆమె శరీరంలోని వివిధ ఆభరణాలుగా విశ్వమంతటికీ శక్తిని అందచేయుచున్న సూర్య భగవానునికి శక్తిని అందించే తల్లిగా శ్రీ భువనేశ్వరీ అమ్మ వారు దశ మహా విద్యాస్ లో నాలుగవ శక్తీ రూపం గా అలరారుతుంది

కాటుక చీకటి కంటే నల్లని కురులు, విశాల మైన నుదురు, మూడు పెద్ద పెద్ద నేత్రాలు, సన్నని ముక్కు, ఎర్రని పెదవులు, చక్కని చెవులు, సుందరమైన శరీరాకృతి, వంటినిండా ఆభరణాలతో శక్తి రూపకంగానే కాక ఆమె అందానికి, ప్రేమకీ, స్వేచ్చకీ, మరియు కరుణకీ ఆలవాలమై సూర్యునికంటే కూడా కోటిరెట్లు తేజస్సుకలదై పాశ అంకుశ పుష్ప భాణ హస్తములతో విరాజిల్లుతోంది సాక్షాత్తూ శ్రీ మహా శివుని ప్రియ సఖి పార్వతీ దేవి రూపంగా (అవతారంగా) కాళీ, లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ మాత లకు అమ్మగా కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా ఆదిశక్తి అంశ లోని పరాశక్తి వీరత్వం తో ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా సరే అనుకూలంగా మార్చగల అద్భుత శక్తి ఆమె సొంతం … ఆమె నిశ్చయాన్ని నవగ్రహ కూటమి కాదు కదా సాక్షాత్ శ్రీ పరమేశ్వరుడు కూడా మార్చలేడు.

అంతటి అద్భుత శక్తి పీఠ అనుసందానం మన పెద్దాపురం లో కూడా ఒకటి ఉంది అంత మహిమ గల మాత ను నిత్యం ధూప దీప నైవేద్యాలంకారలతో నియమ నిష్ఠలతో షొడోపచార మహా పూజలతో (ఉపాసించే) ఆరాదించేవారి వారి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం

 

పెద్దాపురం : భువనేశ్వరి శక్తీ పీఠం చిరునామా :

నిర్వాహకులు : శ్రీ చింతా గోపి శర్మ సిద్దాంతి గారు
భువనేశ్వరి పీఠం ,
D.No: 6-1-17, వర్జుల వారి వీధి,
ఐ సి ఐ సి ఐ బ్యాంకు (ICICI ) వెనుక ,
పెద్దాపురం – 533437,
తూర్పు గోదావరి జిల్లా .,
ఆంధ్ర ప్రదేశ్ ,

అమ్మ వారి పీఠం లో ప్రతి రోజు జరుగు కార్యక్రమములు :
ఉదయం 5 గం.30 ని. లకు సుప్రభాతం
ఉదయం 7 గం.00 అభిషేకం మరియు కుంకుమ అర్చన, నీరాజన మంత్ర పుష్పములు.
సాయంత్రం 6 గం.00 లకు. సహస్ర నామ కుంకుమ పూజ నీరాజన మంత్ర పుష్పములు దర్బారు సేవ.
ప్రతి పౌర్ణమి అమావాస్యలకు భువనేశ్వరి హొమం.
ప్రత్యక దినములలో ప్రత్యేక పూజలు జరుగును.
శ్రీ భువనేశ్వరి పీఠం వద్ద ప్రతీ మంగళ వారం పేదలకు, వికలాంగులకు ఉచిత అన్నదానం జరుగుతుంది
పూజలు చేయించుకొను భక్తులు సంప్రదించు నెంబర్లు
9866193557, 9989088557.
ల్యాండ్ లైన్ : 08852- 243557

966total visits,1visits today

2 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *