Category: మన పెద్దాపురం Facebook

మానవత్వపు హుండీ – HUNDI OF HUMANITY

మన పెద్దాపురం మానవత్వపు హుండీ దాతృత్వమే దైవత్వం – సహాయమే దైవం కనుక ప్రతీ ఒక్కరు తమకు ఉన్నదానితో కొంత దానం చేస్తే లేనివాళ్లు లేని లోకం చూడచ్చు అనే భావనతో మన పెద్దాపురం సహాయనిధి – పేదలపాలిట పెన్నిధి అనే నినాదంతో మన పెద్దాపురం గ్రూప్ ద్వారా మానవత్వపు హుండీని ప్రారంభించడం జరిగింది… ఈ హుండీ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనాదపిల్లలకు, జీవనోపాధి లేని కుటుంబాలకు… మరీ ముఖ్యంగా పేద విద్యార్ధుల చదువులకు ఫీజులు చెల్లించే

క్రీడాకారులకు ప్రోత్సాహం

ప్రొత్సహిస్తే ఎదుగుతారు దేశం గర్వించదగ్గ స్ధాయికి   పెద్దాపురం మహరాణీ కళాశాలలో చదువుకుంటూ అధ్లెటిక్ లాంగ్ జంప్ , ట్రిపుల్ జంప్ లో విశేష ప్రతిభను కనబరుస్తున్న కుంచే ఆనంద్ కుమార్  పెదకామరాజు కి గ్రూప్ సభ్యులు క్రీడా సామాగ్రిని ఇవ్వడం జరిగింది.    

నిరు పేదకు శాశ్వత గూడు

నువ్వు చెప్పే నీతులు నీడని ఇవ్వవు నీకు తెలిసిన సామెతలు సంపదలను ఇవ్వవు నువ్వు మాట్లాడే ఆణిముత్యాలు ఆకలి తీర్చవు “ప్రార్దించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న !!!”

Share Your Knowledge

నీ ప్రతిభ నీకు , నీ కుటుంబానికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడాలి – Share Your Knowledge   మన పెద్దాపురం గ్రూప్ ఎడ్యుకేషన్ వింగ్ వినూత్న ప్రయత్నం – షేర్ యుర్ నాలెడ్జ్ మీరు పాఠాలు నేర్చుకున్న బ్లాక్ బోర్డ్ వద్దే మీరు పాఠాలు చెప్పాలి మీ ప్రతిభ మీరు చదువుకున్న స్కూల్ విద్యార్ధులకు ఉపయోగపడాలి మీ ఉద్యోగ అనుభవం మీకు జన్మనిచ్చిన ఊరు నిరుద్యోగ యువతికి ఉపయోగపడాలి మీ కమ్యునికేషన్ స్కిల్స్ ఇతరలకు

పచ్చదనం కోసం పది గంటలు

Sunday, November 19, 2017 : ఊరు పచ్చగా ఉండాలని మన పెద్దాపురం గ్రూప్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సినిమా సెంటర్ నుండి తిమ్మాపురం రోడ్డు వరకు మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా 20 జంటలు( భార్యాభర్తలు) హాజరు అయ్యారు https://www.facebook.com/events/255009108361643/

సమానవత్వపు గోడ

HUMANITY + EQUALITY WALL పేద ధనిక పెద్ద చిన్న అంతరాలు పోయేలా అసమానత తొలగేలా ఉన్నదాంట్లో కొంచెం పంచుదాం లేనివాళ్లే లేని ప్రపంచం చూద్దాం “అవసరం లేనివి వదిలి అవసరమైనవి తీసుకుని వెళ్ళండి” అనే నినాదంతో నిరుపయోగమైనవి ఏమైనా ఈ గోడకి తరలించండి ఉపయోగమైనవి ఈ గోడ నుండి తీసుకువెళ్ళండి అంటూ మహారాణీ బుచ్చి సీతాయమ్మ సమానవత్వపు గోడ పేరుతో ఒక వినూత్నమైన కార్యక్రమానికి ది 02.జూలై.2017 న ప్రారంభించడం జరిగింది

తెలుగు భాషాదినోత్సవం ౫౬ అక్షరాలకి ౫౬ మొక్కలు

యాబది ఆరక్షరాల రత్నమాల తెలుగు!! యాబది ఆరు మొక్కలు నాటే కార్యక్రమం!! ౨౯ / ౦౮ / ౨౦౧౬ న తెలుగు బాషా దినోత్సవం సందర్భంగా మన పెద్దాపురం ముఖచిత్ర సమూహం సభ్యులందరూ సమిష్టిగా తెలుగు అక్షరమాలలోని ౫౬ అక్షరాలకు గుర్తుగా ౫౬ మొక్కలు నాటే వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగుతల్లికి జేజేలు పలికి తెలుగుబాష యొక్క గొప్పతనం అందరికీ తెలియజేయడం జరిగింది ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మపాట పాడినట్టి భాష తేనె వంటి మందు

మన పెద్దాపురం గ్రూప్ సేవా కార్యక్రమాలు

 మన పెద్దాపురం గ్రూప్ ద్వారా చేసిన మంచి కార్యక్రమాలు 29-03-2015 మన పెద్దాపురం గ్రూపు ప్రారంభం (పెద్దాపురం చరిత్ర ప్రపంచానికి పరిచయం చేయడానికి నాంది) 13-12-2015 మహా రక్తదాన శిబిరం (రక్తదాతలు 175 MEMBERS) 29-03-2016 చారిత్రిక నడక (వెంకటేశ్వర స్వామి గుడి నుండి మునిసిపల్ ఆఫీస్ వరకూ – పెద్దాపురం చరిత్ర పాట విడుదల) 05-06-2016 పర్యావరణ పరిరక్షణ దినోత్సవం (మెయిన్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వద్ద 1000 మొక్కలు పంపిణీ ) 13-08-2016

ప్రాణదాన ఉద్యమం- 2017

Friday, August 11, 2017 : పెద్దాపురం నియోజక వర్గంలో ఇప్పటి వరకు అవయవదానం చేసిన ప్రతీ ఒక్కరికి నివాళులు అర్పిస్తూ , మనస్పూర్తిగా  మేమంతా కలిసి గళమెత్తాం ..మీరే మాకు స్పూర్తి మీ అడుగు జాడల్లోనే నడుస్తాం అని వాగ్దానం చేస్తూ అవయవదాన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది https://www.facebook.com/events/1518534241536739/

M.R College Golden Jubilee Song

Sunday,February 4,2018 Mana Peddapuram Group Presents  చారిత్రక పట్టణం పెద్దాపురంలో ఉన్న శ్రీ రాజా వత్సవాయ బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహరాణీ కళాశాల స్ధాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకలలో కళాశాల పూర్వ విద్యార్ధి నూజిళ్ళ శ్రీనివాసు గారు పాడిన పాట