Category: పెద్దాపురం ప్రస్థానం(చరిత్ర)

BOBBILI YUDDHAM lo Peddapuram

బొబ్బిలి యుద్ధంలో పెద్దాపురం పాత్ర బొబ్బిలి యుద్ధం – భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మరపురాని చారిత్రిక ఘట్టం రాజకీయం – రాజ్య విస్తరణ కాంక్ష, కక్ష – కార్పణ్యం, శౌర్యం – క్రౌర్యం, కుట్ర – కుతంత్రం, తెగింపు – పోరాటం, అధికార దాహం – ఆత్మాభిమానం, వీరమరణం – ఆత్మత్యాగం, ఇలాంటి పదాలన్నిటికీ ఒకే ఒక నిర్వచనం బొబ్బిలి యుద్ధం బొబ్బిలి రాజు రాజా గోపాలకృష్ణ రంగారావుకూ – విజయనగరం రాజు పెద

PEDDAPURAM COURT COMPLEX HISTORY

మన పెద్దాపురం న్యాయాలయం చారిత్రిక పెద్దాపురం సంస్థానంలో ప్రజలమధ్యన తరచూ తలెత్తే వివాదాల పరిష్కరించడంలో రాజ దర్బారులు ప్రముఖ పాత్ర పోషించేవి ఆస్థానంలోని న్యాయసలహాదారులు, మంత్రులు, ఆస్థాన పురోహితులు, పెద్దలు పండితులతో చర్చించి, తీర్పు వెలువరించేవారు ఆ తరువాతి కాలంలో పెద్దాపురం సంస్థానాన్ని 1847 లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసు కోవడంతో ఆయా గ్రామాలలోని స్థానిక పెద్దలే ప్రజల మధ్య తలెత్తే వివాదాలు పరిష్కరించేందుకు తీర్పులు వెలువరించే వారు అలాగే పెద్దాపురంలో కూడా ప్రజలమధ్య

Lakshmi Silk Factory – Peddapuram History 1920

లక్ష్మి సిల్క్ ఫ్యాక్టరీ – పెద్దాపురం పెద్దాపురంలో భూస్వాములు, మంచి విద్యావంతులు మరియు వ్యాపారవేత్తలైన ముప్పన సోమరాజు, వీర్రాజు సోదరులు1900 ప్రాంతంలో వ్యాపార రంగంలో ప్రవేశించారు. పాడిపరిశ్రమ… చక్కెరపరిశ్రమ…  సినిమాహాల్లు… ఇలా అన్నింటిలో వారు పెట్టుబడులు పెట్టి నిర్మాణాలు చేపట్టి పెద్దాపురం పారిశ్రామికంగా ఎదగడానికి ముందడుగు వేశారు ఆ ప్రయత్నంలో భాగంగానే 1920 ప్రాంతంలో  శ్రీలక్ష్మీ శిల్కుప్యాక్టరీ  స్థాపించారు. ఆ కాలంలో అదొక పెద్ద సంచలనం పెద్దాపురం చేనేతకి మంచి గుర్తింపు కూడా వచ్చింది, ఆ ప్యాక్టరీలవల్ల అనేక పేద

Chebrolu Yuddham – Peddapuram History

పెద్దాపురం సంస్థానం కోసం చేబ్రోలు యుద్ధం పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ జగపతి మహారాజుకి అందించేందుకు నూరుద్దీన్ ఖాన్ కీ మరియు విజయరామ గజపతి మహారాజు కీ చేబ్రోలులో జరిగిన యుద్ధం చరిత్రలో చేబ్రోలు యుద్ధంగా పేరుగాంచింది… అది పెద్దాపురం సంస్థానాన్ని శ్రీ రాజా వత్సవాయ కళాతిమ్మ జగపతి బహద్దరు మహారాజు గారు పరిపాలిస్తున్న రోజులు హైదరాబాద్‌ నిజాం ల పాలనలో ఉండేది శ్రీకాకుళం నవాబు అయిన అన్వరుద్ధీన్ ఖాన్ రాజమహేంద్రవరం పరిసర సంస్థానములకు హాజీ హుస్సేన్ అనే

RDO OFFICE PEDDAPURAM

పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పెద్దాపురం సంస్థానాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ 1847 వ సంవత్సరంలో స్వాధీనం చేసుకుని పెద్దాపురాన్ని రెవెన్యూ డివిజన్ (రాబడి విభాగం) గా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి రంపచోడవరం డివిజన్ కూడా ఒకప్పటి పెద్దాపురం డివిజన్లో అంతర్భాగంగా ఉండేది, ఒక విధంగా చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలోని మూడింట రెండొంతుల ( 2/3 ) అనగా సగానికి పైగా పెద్దాపురం డివిజన్ పరిధిలోనే ఉండటం, తూర్పుకనుమల మధ్య కోస్తా ప్రాంతం, దట్టమైన అడవులు విసారమైన గిరిజన

Peddapuram Muttadi

పెద్దాపురం ముట్టడి పెద్దాపురం ముట్టడి అనే కధని బుదరాజు పట్టాభిరామయ్య గారు రచించారు పెద్దాపురం సంస్థానంలో దాదాపు 300 ఏళ్ళు వత్సవాయ క్షత్రియ వంశస్థుల పాలన నడిచింది ఈ వంశానికి చెందిన శ్రీ రాజా వత్సవాయ ఉద్దండ రాయ జగపతి మహారాజు గారు 1688 నుండి 1714 వ సంవత్సరం వరకూ పాలించి మరణించిన తరువాత రాజుగారి భార్య రాగమ్మ గారు వారివురి ప్రధమకుమారుడైన  కళాతిమ్మ జగపతిపేర 1734 వరకూ పరిపాలన చేసారు. ఆతరువాత రుస్తుంఖాన్  పెద్దాపురం

Turaga Ramakavi Peddapuram History

తురగా రామకవి – పెద్దాపురం సంస్థానం అవి శ్రీ శ్రీ శ్రీ వత్సవాయ విద్వత్ తిమ్మజగపతి మహారాజు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలిస్తున్న రోజులు ఆకాలంలో పెద్దాపురం సంస్థాన పరిశిష్టమైన తుని లో తురగా రామకవి అనే ఒక తిట్టుకవి ఉండేవారు. వేములవాడ భీమకవి తరువాత తిట్టు కవిత్వంలో ఇతనితో సమానమైన కవి వేరే ఎవరూ లేరు. భీమకవివలెనే తురగా రామ కవి మాట్లాడిన ప్రతీ మాట నిజం అవుతుంది అనే నానుడి దేశమంతా ఉండటం వల్ల అన్ని రాజ్యాల

Peddapuram Bothering

ఘోషించిన పెద్దాపురం నా ఊరు పెద్దాపురం వందల ఏళ్ల చరిత్ర శిధిలమైపోయింది మిగిలినవి అవమానపు అవశేషాలు ! కళలు కనుమరుగయ్యాయి చెదిరినవి కలలు ! మహానుబావులు మాదికాదన్నారు !!! మామూలు ప్రజలు మాకెందుకన్నారు !!! అభివృధ్ది ఆకు రాలింది. మహాతల్లి మోడు బారింది ! మల్లీ చిగురించాలంటే ఎన్ని దశాభ్దాలు వేచిచూడాలో…? నా పెద్దాపురం ఘోషిస్తుంది పౌరాణిక ప్రాశస్త్యం పడిపోయిందంటూ చారిత్రిక శోభంతా చెడిపోయిందంటూ కలలన్నీ కనుమరుగై కధలన్నీ తెరమరుగై గతకాలపు ఘనచరిత్ర ప్రశ్నార్థకమయిందని అవగాహన లేకుండా

Vadlaginjalu Story, Peddapuram History

వడ్లగింజలు పెద్దాపురం చతుర్భుజ తిమ్మ జగపతి v/s తంగిరాల శంకరప్ప   ”శ్రీశ్రీశ్రీ చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలిస్తున్న రోజులు, మహరాజుకి కళలంటే మక్కువ ఎక్కువ, అందునా చదరంగం అంటే ఆరో ప్రాణం. ఆడేవారు లేక, ఆడగల సత్తా ఉన్నవారు దొరకక, ప్రతివారు ఆటకి సిద్ధమైతే విసిగి, తనతో ఆడి,ఓడినవారికి శిరఛ్ఛేదం ప్రకటించేరు, మహరాజు. దానితో చదరంగం ఆడగలిగిన సత్తా ఉన్నవాడు దొరకక మహరాజు విచారంలో ఉన్న కాలం. నిర్భాగ్యుడు, పండితుడు, బ్రాహ్మణుడు,

Peddapuram Samsthanam Borders & Income

పెద్దాపుర సంస్థాన సరి హద్దులు – ఆదాయం – పరిణామక్రమం పెద్దాపురం ప్రాచీన ఆంద్ర దేశము లో పురాతన సంస్థానములలో ఒకటి. ఇంచుమించు ఐదు వందల ఏళ్ల పూర్వ చరిత్ర కలది. గోదావరి మండలము లోని చాలా భాగము, కృష్ణా – గుంటూరు మండలాలలోని కొంత భాగము, విశాఖ పట్టణం లోని కొన్ని గ్రామాలు అయిన తోటపల్లి, రంప , చోడవరం, మొదలగు మన్యం ప్రాంతాలు ఒకప్పటి పెద్దాపురం సంస్థానములోనివి. సంస్థానములోని ముఖ్య పట్టణం అయిన “పెద్దాపురం”