Chairmens vs Commissioners @Peddapuram 1954

Rare Collection Of మన పెద్దాపురం


ఎవరు గొప్ప చైర్మనా…? కమీషనరా …?

13 జూన్ 1954 నెల్లూరు లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ ఛైర్మన్స్ మరియు కమీషనర్ల సమావేశానికి హాజరయిన అప్పటి మున్సిపల్ చైర్మన్ చల్లా వెంకట్రావు గారు… పెద్దాపురం మున్సిపల్ కమీషనర్ బి. వి. నాయుడు గారు

1954 సంవత్సర కాలం ముందు వరకూ ఆంధ్ర దేశంలోని అన్ని మున్సిపాలిటీలో ద్వంద్వ పరిపాలన పద్దతి కొనసాగేది నిర్ణయాధికారాల విషయంలో చైర్మన్ – కమీషనర్ ల మధ్య సయోధ్య కుదిరేది కాదు… మునిసిపల్ కమీషనర్ దే అన్ని విషయాలలో పై చేయిగా ఉండేది…

ప్రజాహిత కార్యక్రమాలకు సంబంధించి తుది నిర్ణయాధికారం కమీషనర్ కే ఉండేది… అందుచేత అనేక మున్సిపాలిటీ లలో కమీషనర్ లు మరియు చైర్మన్ల మధ్య తరచూ వాగ్వాదాలయ్యేవి… వారిరువురి మధ్య సయోధ్య కుదిర్చి ప్రజలకు మంచి పాలన అందించాలనే సదుద్దేశంతో అప్పటి ప్రభుత్వం 13- జూన్ 1954 న నెల్లూరులో మున్సిపల్ ఛైర్మన్స్ మరియు కమీషనర్ల సమావేశం ఏర్పాటు చేసింది…

ముందుగా 13 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కమీషనర్ లకు చైర్మన్ లకు వేరు వేరు గా సమావేశం ఏర్పాటు చేశారు – చైర్మన్ల సమావేశానికి అప్పటి బాపట్ల ఛైర్మెన్ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించగా కమీషనర్ల సమావేశానికి అప్పటి విశాఖపట్నం కమీషనర్ సూర్యనారాయణ గారు అధ్యక్షత వహించారు మరుసటి రోజు అనగా 14 జూన్ 1954 న అందరికీ కలిపి ఒకేసారి చర్చా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి అప్పటి మంత్రి తిమ్మారెడ్డి అధ్యక్షత వహించారు…

అంతిమంగా ఈ సమావేశంలో కమీషనర్ల మున్సిపల్ దృక్పధం మారాలని వారు సర్వాధికారులే అయినప్పటికీ ఛైర్మెన్ మరియు కౌన్సిల్ కి విలువీయాలని వారి వారి ప్రాంతాలలో ఒక కుళాయి కూడా నిర్మించలేని ఛైర్మెన్ మరియు కౌన్సిల్ ఉండి లాభమేమిటని ఛైర్మెన్ మరియు కమీషనర్లు ఐకమత్యంగా మెలగాలని కావున మున్సిపాలిటీ లో ద్వంద్వ పద్దతికి స్వస్తి పలుకుతూ ప్రజాహితం కార్యక్రమాల సత్వర అమలుకోసం కౌన్సిల్ కి పూర్తి అధికారం ఇస్తూ నిర్ణయం చేయడమైనది

@వంగలపూడి శివకృష్ణ

1035total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *