Chebrolu Yuddham – Peddapuram History

పెద్దాపురం సంస్థానం కోసం చేబ్రోలు యుద్ధం

పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ జగపతి మహారాజుకి అందించేందుకు నూరుద్దీన్ ఖాన్ కీ మరియు విజయరామ గజపతి మహారాజు కీ చేబ్రోలులో జరిగిన యుద్ధం చరిత్రలో చేబ్రోలు యుద్ధంగా పేరుగాంచింది… అది పెద్దాపురం సంస్థానాన్ని శ్రీ రాజా వత్సవాయ కళాతిమ్మ జగపతి బహద్దరు మహారాజు గారు పరిపాలిస్తున్న రోజులు హైదరాబాద్‌ నిజాం ల పాలనలో ఉండేది శ్రీకాకుళం నవాబు అయిన అన్వరుద్ధీన్ ఖాన్ రాజమహేంద్రవరం పరిసర సంస్థానములకు హాజీ హుస్సేన్ అనే పేరుగల రుస్తుంఖాన్ ను కప్పములు వసూలు చేయడానికి నియమించెను కొలువులో రాజమహేంద్రవరానికి ఫౌజుదారు అయిన రుస్తుంఖాన్‌ కపటోపాయంతో పెద్దాపురం మహారాజు కళాతిమ్మ జగపతిని అతని సోదరులను అన్యాయంగా హత్య చేయించాడు తిమ్మ జగపతి భార్య పూసపాటి విజయ రామ గజపతి మహారాజు గారి భార్య చంద్రయ్యమ్మకు మేనకోడలు.

అప్పటికి ఏడాది వయస్సున్న కుమారుడు వత్సవాయ జగపతిని విజయనగరానికి పంపించే ఏర్పాట్లు చేసి అత్త రాగమ్మతో కళా తిమ్మజగపతి మహారాజు గారి భార్య కూడా అగ్నిప్రవేశం చేసింది. మార్గమధ్యలో రుస్తుం ఖాన్ సేనలు బాలుడుని పట్టుకుని కారాగారంలో బంధించాడు. కొన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తరువాత రుస్తుంఖాన్‌ కుమారుడు నూరుద్దీన్‌ హుస్సేన్‌ పెద్దాపురం వత్సవాయ సంస్థానాధీశులకు తండ్రి చేసిన మోసం నచ్చక రుస్తుంఖాన్ ని చంపించి అధికారం చేజిక్కించు కుంటాడు, తదనంతరం పూసపాటివారి కళింగ రాజ్యాన్ని వశపరచుకోవడానికి సైన్యంతో బయలుదేరాడు. విజయరామరాజు 40వేల మంది సైనికులతో పయనమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తాలూకాలో ఉన్న చేబ్రోలు వద్ద 1734 వ సంవత్సరంలో మహా సంగ్రామం జరిగింది.

నూరుద్దీన్ ఖాన్ సైన్యం క్రూరంగా పోరాడుతూ విజయనగరం సైన్యానికి దీటుగా జవాబిస్తూ ఉంది, అప్పుడు అనకాపల్లి జమీందారు గోపాలరాజు గారు 2000 మంది పాయకరావు పేట బోయల సైన్యంతో తోడ్పడ్డారు. బోయీ సైన్యం రంగంలోకి దిగి ప్రాణాలను లెక్కచేయకుండా నూరుద్దీన్ ఖాన్ ను సంహరించడమే లక్ష్యంగా ముందుకు సాగింది… వారికి ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేదు ఒక వైపు విజయనగర సైన్యం తురుస్కుల సైన్యంతో పోరాడుతుంటే… బోయలు తురుక్షుల సైన్యాన్ని ఛేదించుకుని ఏనుగుపై ఉన్న నూరుద్దీన్‌ హుస్సేన్‌ను చుట్టుముట్టి తల నరికేశారు చేశారు. చేబ్రోలు యుద్ధంలో విజయం సాధించిన విజయరామరాజు పెద్దాపురం సంస్థానానికి ఆశాజ్యోతి అయిన జగపతి చెర నుంచి విడిపించి విజయనగరానికి తీసుకెళ్లారు. ఆనంద గజపతితో పాటు బాలుడు జగపతిని చంద్రయ్యమ్మ పెంచారు. పెద్దాపురం సంస్థానం పదిహేనేళ్లపాటు మహమ్మదీయుల పరిపాలనలో ఉంది. ఆ తర్వాత ఆమీన్‌గా ఉన్న నీమత్‌ ఆలీకి విజయరామగజపతి లంచమిచ్చి ఆ సంస్థానాన్ని రాబట్టుకున్నారు. పదహారేళ్ల ప్రాయంలో వత్సవాయ జగపతిరాజు పెద్దాపురం పీఠాన్ని అధిరోహించారు.

733total visits,5visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *