Chellapilla Seetha Rama Murty, Peddapuram

చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి @మన పెద్దాపురం

చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి గారు తూర్పు గోదావరి జిల్లా, #పెద్దాపురంలో 13 నవంబరు 1908 న జన్మించారు 1924 వరకూ ఆయన ప్రాథమిక విద్యాబ్యాసం అంతా #పెద్దాపురం లో గడచింది 1924 – 1926 లలో ఇంటర్మీడియేట్ #పిఠాపురం రాజావారి కళాశాలలోనూ 1926 – 1928 BA ఆంధ్రా యూనివర్సిటీ లోనూ తరువాత ప్రయివేటుగా MA ఇంగ్లీష్ ను నాగపూర్ యూనివర్సిటీ లోనూ పూర్తి చేశారు

కడప గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో సుదీర్ఘకాలం ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేసి 1963 లో రిటైర్ అయ్యారు, విద్యా వ్యాపారం ఎప్పుడు అయ్యిందో అప్పుడు ఉపాధ్యాయుల విలువ పడిపోతుంది అని అంటారాయన ఎందరో విద్యార్థులకు ఉచితంగా ఆయన ఇంగ్లీష్ క్లాసులు నేర్పారు ఆయన దగ్గర విద్య నేర్చుకున్నవారు కలక్టర్లుగా, కళాశాల ప్రిన్సిపాల్స్ గా, ప్రభుత్వ ఉన్నతోద్యోగులుగా ఉంటూ తన వద్దకు వచ్చి గౌరవంగా నమస్కరిస్తున్నప్పుడు ఎంతో ఆనందపడుతుంటారు… ఒక ఉత్తమ ఉపాధ్యాయుడికి ఇంతకంటే కావాల్సింది ఏముంది అంటారు 1963 లో రిటైర్ అయ్యిన తరువాత కాకినాడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలో లెక్చరర్ గా ఒక సంవత్సర కాలం పనిచేశారు 1964 లో ఒంగోలు సి అయ్ ఆర్ కళాశాలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ గా 1970 వరకూ పనిచేశారు ఆ తరువాత 1970 లో కాకినాడ ఐడియల్ కాలేజీలో ఫౌండేషన్ ప్రిన్సిపాల్ గా పనిచేశారు ఇలా సుదీర్ఘ కాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉంది విద్యా సేవలో తరించారు

చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి గారికి చిన్నతనం నుండీ ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండేది… కళాశాల రోజులనుండీ ఆయన వ్యాసాలూ వ్రాయడంలో నైపుణ్యం కలవాడు 1928 లో రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించిన బ్రహ్మ సమాజం శతవసంతాల వేడుకలకు దేశవ్యాప్తంగా వ్యాసాలను ఆహ్వానించారు దానికి సీతా రామ మూర్తిగారు కూడా ఒక వ్యాసం పంపగా అది ప్రచురింపబడింది

1945 లో పిఠాపురం మహారాజా వారి షష్టిపూర్తి వేడుకలకు సీతారామ మూర్తి గారు పంపిన మహారాజా ఒక ప్రదర్శన అనే వ్యాసం ఆ సంవత్సరం సావనీర్ లో ప్రచురింపబడింది అలాగే ఈయన సంఘ సంస్కర్త వీరేశలింగం గారిమీద వ్రాసిన వ్యాసం మరియు 1906 నుండీ 1917 వరకూ పి ఆర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన రఘపతి వెంకటరత్నం నాయుడుగారి మీద ఈయన వ్యాసం అందరి అభినందనలు అందుకుంది

1919 మరియు 1932 మధ్య కాలంలో పి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన రావు సాహెబ్ డాక్టర్ రామ కృష్ణా రావు మాస్టారు గారిని తన తొలిగురువుగా ఆయన ప్రకటించుకున్నారు తొలుత అతనికి విద్యార్థిగా తరువాత కాలాల్లో ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి గారు వ్యవహరించారు

రిటైర్మెంట్ అనంతరం ప్రముఖ వైదిక పండితులు శ్రీభాష్యం అప్పలాచార్యులు గారి సన్నిహిత సాహచర్యం ఆయన చూపిన మార్గనిర్దేశం చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి గారిని ఆధ్యాత్మిక రచనల వైపు దారి మళ్లించింది

1975 – 76 సంవత్సరాల నడుమ శ్రీ భాష్యం తెలుగు ఉపన్యాసాలు తిరుప్పావై ను ఇంగ్లీషులో అనువదించారు తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని ప్రచురించింది తదనంతరం శ్రీ భాష్యం ఉపన్యాసాలైనా “వాల్మీకి రామాయణంలో మహిళ” ను ఆంగ్లంలో 22 ఆర్టికల్స్ వ్రాసారు అవి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సప్తగిరి సంచిక లో ప్రచురితమయ్యాయి 1980 లో వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఆంగ్లంలో అనువదించారు తరువాత

రామాయణపై, ‘విభీషణ సారంగతి’, ‘ఆదిత్య హృదయం’, ‘రామ – ఒక మానవ వ్యక్తిత్వం’, ‘హనుమాన్ – ఒక అధ్యయనం’, శ్రీమద్ భాగవతం , తిరుమల ఏడు కొండలు – రామాయణ యొక్క ఏడు కధలు. వీటన్నింటిపై అధ్యయనం చేసి ఆంగ్లంలో వ్యాసాలూ రచించారు

1990 లో ఆయన విశాఖపట్నం వెళ్లి శేష జీవితాన్ని అక్కడే గడిపారు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి గారి జ్ఞాపకార్థం M.A ఇంగ్లీష్ లో షేక్స్పియర్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి శ్రీ చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి గారి పేరుతో గోల్డ్ మెడల్ ఇచ్చి సత్కరిస్తారు

By @వంగలపూడి శివకృష్ణ

762total visits,2visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *