Famous Paintings From Peddapuram

పెద్దాపురం వాసి ప్రసిద్ధ చిత్ర కళావధాని శ్రీ సింగంపల్లి సత్యనారాయణ గారు

అతనొక చిత్రకళా మాంత్రికుడు
చిత్రలేఖనంలో అతనిది అసామాన్యమైన ప్రతిభ

మాట్లాడుతూ ఉంటే… మీ మాటల సారాన్ని ఆయన చిత్రీకరించగలడు
మీరు పాట పాడుతున్నా … కవిత చదువుతున్నా… ఏదైనా సంగీత వాయిద్యం వాయిస్తున్నా…. ఆ అంశం ఎంత గొప్పగా ప్రదర్శిస్తే అంతకు పదింతలు గొప్పగా ఆయన గీసిన చిత్రం ఉంటుంది

2005 లో తిరుపతి త్యాగరాజ కళా మండపంలో ప్రసిద్ధ వాయిద్య కారుల సంగీతానికి ఆపకుండా 24 గంటలు బొమ్మలు గీసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు…. దేశంలో ఉన్న అందరు మహనీయుల… అన్ని అంశాలకు సంబందించిన బొమ్మలూ ఆయన కుంచె ఆవిష్కరించింది… ప్రపంచంలో ప్రసిద్ధమైన ప్రతి విషయాన్ని ఆయన వర్ణ చిత్రంగా మలిచారు… ప్రపంచ తెలుగు మహా సభలలో ఆయన గీసిన చిత్రాలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

#చిత్రకళే_ఆయన_వృత్తి_ప్రవృత్తి

తిరుపతి అగ్రికల్చర్ కాలేజీలో ఆర్టిస్ట్ కమ్ ఫోటో గ్రాఫర్ గా ఉద్యోగ జీవితం ఆరంభించిన సత్యనారాయణ గారు… ఉద్యోగానికి సంబందించిన చిత్రాలు వేస్తూ… సమాజంలో ఉన్న అన్ని పరిస్థితులకు అనుగుణంగా… జీవం ఉట్టిపడే వర్ణచిత్రాలు వేయడమే కాకుండా… చిత్రకళను భవిష్యత్ తరాలకు అందించే చిత్రావధానాల యజ్ఞం చేస్తున్నారు… చిత్ర లేఖనం మీద ఆయనకున్న మక్కువ ఎలాంటిదంటే ఇప్పటి వరకూ దాదాపు 10 వేలమంది పైచిలుకు చిన్నారులకు ఉచితంగా చిత్రకళా విద్య ను నేర్పించారు… చిత్రలేఖనోపాసకుడిగా… చిత్రకళా మాంత్రికుడిగా… చిత్రకళే ఊపిరిగా జీవిస్తూ… చిత్రకళా గురు వర్యులుగా దేశం మొత్తం సుపరిచుతులై ఎందరికో ఆదర్శనీయులు ఆరాధ్యనీయులయ్యారు

#సింగంపల్లి_వారి_జన్మస్థలం_కుటుంబం
శ్రీ సింగంపల్లి సత్యనారాయణ గారు 02 జూన్ 1944 న మన పెద్దాపురంలో జన్మించారు, వీరి కుటుంబం పెద్దాపురం పాసీల వారి వీధిలో నివసించేవారు, బాల్యం, విద్యాబ్యాసం అంతా పెద్దాపురం లోనే గడిచింది వీర్రాజు హై స్కూల్ లో పదవ తరగతి వరకూ చదువుకున్నారు వీరి తండ్రి సింగంపల్లి అప్పల స్వామి గారు సుదీర్ఘ కాలం పెద్దాపురం మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు… వీరి అన్నగారైన సింగంపల్లి చంద్రరావు గారి తనయులు సింగంపల్లి రవికుమార్ గారు కూడా ప్రస్తుత పెద్దాపురం పురపాలక సంఘ కౌన్సిలర్ గా ఉన్నారు…. సింగంపల్లి చంద్రరావు గారు కూడా చిత్రకళలో నిపుణులు సత్యనారాయణ గారు చిత్రకళలో ఓనమాలు దిద్దింది చంద్రరావు గారి వద్దే… తరువాత క్రమ క్రమంగా స్కూల్ స్థాయినుండి, కళాశాల స్థాయికి, రాష్ట్ర స్థాయిని నుండీ దేశ వ్యాప్తంగా ఎదిగి రోజు రోజుకీ తన నైపుణ్యానికి పదును పెట్టుకుంటూ ఉద్దండులందరి చేతా ప్రశంస లందుకుంటూ దేశం గుర్తించదగ్గ చిత్రలేఖన కళాకారుడయ్యారు

దేశ వ్యాప్తంగా పలు యూనివర్సిటీ లలో జరిగే చిత్రలేఖన పోటీలకు శ్రీ సింగంపల్లి సత్యనారాయణ గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారు

#సినిమాల్లో_సింగంపల్లి
అంతే కాదు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా కూడా ఏకవీర, సంపూర్ణ రామాయణం, భక్త తుకారాం వంటి పలు సినిమాల్లో పనిచేశారు సినిమాల్లో పని చేసే సమయంలో అంజలీ దేవి గారు ఎంతో ఆప్యాయంగా చూసుకునే వారని అన్ని విషయాలలో ప్రోత్సహించేవారని పెద్దాపురం మద్రాసు వరకూ నువ్వూ వచ్చావా అంటూ నవ్వుతూ అనేవారని గుర్తు చేసుకున్నారు…

మన పెద్దాపురం గ్రూప్ గురించి దాని కార్య క్రమాల గురించి నేను వివరించినప్పుడు ఆయన ఎంతో సంతోషించి గ్రూపు సభ్యులనూ పెద్దాపురం యువకులను అందరినీ ప్రత్యేకంగా అభినందించారు… పెద్దాపురం తో ఆయనకు గల జ్ఞాపకాలు అనుబందాన్ని నెమరు వేసుకున్నారు… పెద్దాపురంలో కూడా మీ యొక్క చిత్రకళా అవధానం ఏర్పాటు చేయాలని కోరగా తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు….

ఇదిలా ఉండగా ఆయన శ్రేయోభిలాషులు మరియు శిష్య బృందం చిత్ర లేఖన కళకి ఆయన చేసిన చేస్తున్న అవిశ్రాంత సేవలను గుర్తించి ప్రభుత్వం సింగంపల్లి సత్యనారాయణ గారికి పద్మశ్రీ ఇచ్చి గౌరవిస్తే బావుంటుందని అభ్యర్థిస్తున్నారు… ఆయన త్వరలోనే పద్మశ్రీ సింగంపల్లి సత్యనారాయణ గా స్వగ్రామం పెద్దాపురానికి విచ్చేసి చిత్రకళావదానాన్ని చేయాలని ఆకాంక్షిస్తూ… మీ వంగలపూడి శివకృష్ణ

560total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *