History of Haveli – Rajugari Gadi

పెద్దాపురం రాజుగారి గది

దీనిపై కధనాలెన్నో… ఆ కధనాల్లో నిజాలెన్నో తెలియదు కానీ

అది అలనాటి రాజుల ప్యాలస్ – విలాస భవనం
హవేలీ ఎదురుగా రాజరిక కాలంలో కళాకారుల కళాప్రదర్శనలు జరిగేవి కళాకారులకు ప్రోత్సాహకంగా బహుమతుల పంపిణీ జరిగేది పెద్దాపురం సంస్థానానికి వచ్చిన అతిధులకు అతిధి గృహంగా రాచమర్యాదలు హవేలీలో ఘనముగా జరిగేవిగా తెలుస్తుంది

హవేలీ ఎదురుగా ఉన్న ఆవరణలో ఒకప్పుడు 300 ఏళ్ల వయసుగల మర్రి వృక్షం ఉండేది చుట్టూ 30 అడుగుల ఎత్తున కోటగోడలు ఉండేవి.

ఆ పక్కనే ఉన్న రాజుల నివాస గృహానికి పాత పెద్దాపురం రాములవారి పల్లకీ, కోటముందు మరిడమ్మ తొలి జాతర గరగలు కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి గరగలు తీసుకొని వెళ్లి రాజకుటింభీకులు ఇచ్చిన కట్నకానుకలు, విరాళాలు తీసుకొని వచ్చేయడం ఆనవాయితీగా కొనసాగేది

ఒకప్పటి వైభవం అయితే ఇప్పుడు లేదు గానీ ఈ రాజుగారి హవేళీ మాత్రం పెద్దాపురం మహారాజుల పరిపాలనకు ఒక చారిత్రక సాక్ష్యంగా ఇప్పటికీ మిగిలే ఉంది. @వంగలపూడి శివకృష్ణ

967total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *