History of Mandapeta Sivalayam

మన పెద్దాపురం మహారాజు నిర్మించిన మండపేట శివాలయం చరిత్ర

క్రీస్తుపూర్వం 17 వ శతాబ్దంలో పెద్దాపురం మహారాజు శ్రీ శ్రీ శ్రీ వత్సవాయ సూర్యనారాయణ తిమ్మ జగపతి మహారాజు గారు మండపేట గ్రామంలో శివాలయం నిర్మించే నిమిత్తం ఒక శివలింగాన్ని తెప్పించారు ఆలయం నిర్మాణానికి పూనుకుని జరిపిస్తున్న త్రవ్వకాలలో భాగంగా వాతాపి అనే రాక్షసుడిని సంహరించి నందుకుగానూ పాప పరిహారార్ధం అగస్త్య మహర్షి ప్రతిష్టించిన పరమ పవిత్ర పంచ శివలింగాలలో ఒకటైన పురాతన కాలం నాటి శివలింగం మరియు మహిషాసుర మర్దిని విగ్రహం బయట పడ్డాయి… దాంతో మహారాజు గారు ఎంతో ఆనందించి ఆలయ నిర్మాణం పూర్తి చేసి త్రవ్వకాలలో లభించిన పురాతన శివలింగాన్ని ముందు ప్రతిష్టించి… దాని వెనుకనే తాను తెప్పించిన శివలింగాన్ని ప్రతిష్ట చేయించారు… పురాతన శివలింగానికి అగస్తేశ్వర స్వామి అని రాజావారు తెప్పించిన శివ లింగానికి కైలాసేశ్వర స్వామి అని పిలవడం పరిపాటి….. రెండు శివలింగాలు ఒకే గర్భగుడిలో ప్రతిష్టించబడిన ఆ అరుదైన దేవాలయానికి శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి వారి దేవాలయం అని ప్రసిద్ధి

188total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *