పెద్దాపురం రాజుగారి కోట చరిత్ర

పెద్దాపురం సంస్థానం రాజుగారి కోటయొక్క వర్ణన

పెద్దాపురాధీశుడు పెద్దాపాత్రుడు నిర్మించగా వత్సవాయ వారు అభివృద్ధి చేసిన – 18 బురుజుల శత్రు దుర్బేధ్యమైన కోట…. పద్దెనిమిది బురుజులతో తాళ్ళబురుజు, హనుమంత బురుజు, తోక బురుజు మిక్కిలి ప్రసిద్దమయినవి… తాళ్ల బురుజు మీద నరసింహ స్వామి విగ్రహం ప్రతిష్టించబడింది… కోట చుట్టూ మూడు మెట్టలు మధ్యలో కోట ఉండేది… కోట యొక్క ప్రాకారము రాతితోనూ మట్టి తోనూ కట్టబడినది… దానికి రెండు గోడలు కలవు రెండింటి మధ్యలో రాకపోకలకు వీలుగా మార్గం భావరాజు సర్వారాయుడు అనే ప్రముఖ కవి పెద్దాపురం కోటను వర్ణిస్తూ ఒక సీసపద్యం రచించారు

సి|| దాని కందకము * దాని ప్రాకారముల్
దాని బురుజులు * నం దలి ఫిరంగు
…………………………………………
…………………………………………
జయ వత్సవాయ వం * శ జలనిధి శశాంక
జయ తిమ్మభూపాల * శత్రుకాల
జయ విజయీభవ * సప్త గోదావరీ
పరివృతాఖిల ధరా పాల చరణ

పై పద్యం వత్సవాయ తిమ్మ భూపాల చరిత్రము నుండి సేకరించబడిన నాలుగు పేజీల సీసపద్యం… ఈ పద్యాన్ని ఆధారంగా చేసికొని పెద్దాపురం కోటయొక్క వైభవం తెలుసుకొనవచ్చు…

పాత పెద్దాపురంలో తూర్పు భాగమున ఉన్న కోటకి… ఉత్తర అభిముఖంగా సుమారు ముప్పై అడుగుల ఎత్తు గల పెద్ద సింహద్వారం… దాని ద్వారబంధాలకు పెద్ద పెద్ద తలుపులు… అటూ ఇటూ ఇద్దరు ద్వారపాలకులు… ఆ తలుపులలో పడమటి తలుపుకు చిన్న తలుపు కోటలోకి వెళ్లడానికి అదేదారి…

తలుపులకు అవతలి వైపు విశాలమైన పెద్ద పెద్ద అరుగులు… దక్షిణంవైపు ఉన్న అరుగుపై భటులు ఆయుధాలు పెట్టుకోవడానికి వీలుగా పెద్దచావడి ఈ చావడికే బాలాఖానా అనిపేరు… చావడి పైన పెద్ద మిద్దె దీనికి నౌబత్ఖానా అని పేరు

చావడి దాటి కొంతదూరం ముందుకు నడిస్తే దక్షిణం వైపు ఒక పెద్ద మేడ… ఆ మేడ యొక్క గోడలు చేయివేస్తే జారిపోయేలా ఉండేవి… ఆ గోడ పాల గచ్చులు లో చూస్తే ఎదుటివారి ప్రతిభింభం కనబడేంత నున్నగా అద్దంలా ఉండేవి… మేడపైకి ఎక్కడానికి వీలుగా కొంతదూరం పడమరవైపు మరికొంతదూరం దక్షిణం వైపు మెట్లు ఉన్నాయి… మేడ పై భాగం అంతటికీ కన్నులపండుగలా మిరుమిట్లు గొలిపే లక్కపని చేయించారు అందుచేత ఈ మేడకి లక్కమేడ అనిపేరు…

ఈ లక్కమేడకి దక్షిణాన విశాలమైన నాలుగు ఇళ్ల పెద్ద భవనం మరొకటి ఉంది… దానికి దక్షిణ దిశగా విరివైన పెరడు… పెరట్లో పెద్దగచ్చు నుయ్యి… నూతి గోడ మీద విఘ్నేశ్వరుడి విగ్రహాలు… నూతికి నీరుతోడే యంత్రం… ఆ ప్రాంతంలోనే పూలతోటలు పూల తోటలకు పశ్చిమ బాగాన స్త్రీలు నివసించేందుకు సుందరమైన గదులు ఉండేవి వాటి ప్రక్క గదులు కొన్ని వంట గదులుగా ఇంకొన్ని భోజన శాలలుగా మరికొన్ని జపశాలలుగా ఉండేవి జపశాలల గోడలపై దేవుళ్ళ బొమ్మలు రంగులతో చిత్రించబడి ఉన్నాయి… దీనికి పశ్చిమ భాగాన విశాలమైన ప్రదేశం కలదు దీనిని పాణిద్వారం అని పిలిచేవారు కోటయొక్క ఆవరణలో పాణిద్వారానికి ఎదురుగా పది అడుగుల పొడవుగల మదీనా పాశ్చా గారీ ఘోరీ ఒకటి ఉంది పాణిద్వారానికి ఉత్తర దిశగా చతురగృహం ఉండేది దీనికి జినాదిహంఖానా అని పేరు… దీనియొక్క దక్షిణభాగం లో విశాలమైన సభా భవనం ఉండేది దానికి నిండోలగం అని పేరు.. సభా భవనం సుందరాకృతి చూడ దానికి రెండుకళ్ళూ సరిపోవు సభాభవన నిర్మాణం అనేక సంవత్సరాలు శ్రమతో నిర్మించినది సబ యొక్క పైకప్పు అంబరసా పని అత్యత్బుతంగా చేయబడింది… పెద్దాపురం కోటను కళ్లారా చూడాలని పెద్దాపురం మహారాజుల ఆతిధ్యం స్వీకరించాలని వివిధ దేశాల మహారాజులు ఆత్రుతపడేవారంటే అతిశయోక్తికాదు…. అలాంటి ఘన చరిత్ర గల పెద్దాపురం కోట కాల క్రమంలో పెద్దాపురం సంస్థానం కడపటి ప్రభువు రాజా సూర్యనారాయణ జగపతి నుండి కోఠాం సంస్థానాదీసులకు వారినుండి బ్రిటీషువారైన డి. పి. డబ్ల్యు వారికి చేరింది వారు కోటను వేలం వేశారు… కోటను పాడుకున్న వర్తకులు కోటలోని లక్క, కలప, రాయి వంటి వాటిని తోలుకుని పోయారు… కోట పూర్తిగా దాని స్వరూపం కోల్పోయి కొంతకాలం మొండిగోడలుగా మిగిలి తదనంతరం పూర్తిగా కాల గర్భంలో కలిసిపోయిన విధానం చాలా బాధాకరం… కాలం ఎంత విచిత్రమైందో కదా … దేన్నీ నిలవనివ్వదు @వంగలపూడి శివకృష్ణ

3484total visits,2visits today

2 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *