Kandregula Jogi Panthulu Vs Peddapuram King

కాండ్రేగుల జోగిపంతులు Vs వత్సవాయ విద్వత్ తిమ్మజగపతి

కాండ్రేగుల ఒకప్పటి పెద్దాపురం సంస్థానంలో అంతర్భాగమైన గ్రామం, కాండ్రేగుల జోగి జగన్నాధరావు గారు 1760 వ దశకంలో పలు భాషలు మాట్లాడగల ప్రముఖుడుగా పేరుపొందిన పండితుడు, ఈయన అనేక సంస్థానాలకు, ఆంగ్లేయ వర్తకులకు, జాన్ ఫయి బస్ దొరకి ద్విబాషీగా వ్యవరించి వారి నుండి అనేక హవేలీ భూములు సంపాదించిన ఘనుడు, స్వతహాగా దాన ధర్మాలు చేసిన దానశీలి కూడా జోగిపంతులుగారికి దుభాషీగా చాలా పలుకుబడి ఉండేది, మచిలీ పట్టణం కేంద్రంగా ద్విబాషీ కార్యకలాపాలు(కచ్చేరీ) సాగించినప్పటికీ ఆయన మాట అన్నీచోట్లా చెల్లుబాటు అయ్యేది ఆ పలుకుబడివల్ల కొంచెం అహంకారం కూడా ఉండేది

అహం బుద్ధ్యేవ మోహిన్యా యోజయిత్వా వృతేర్బలాత్
విక్షేపశక్తిః పురుషం విక్షేపయతి తద్గుణైః ॥

అహంకారం అన్నిచోట్లా రాణించదు కదా మనిషి పతనానికి అదే కదా అసలు కారణం, మనిషి అజ్ఞానానికి ముఖ్యంగా రెండు శక్తులు మూలకారణం. ఆవరణం – విక్షేపం అవి సమూలంగా నశించకపోతే మన అహంకారం మనల్నే సమూలంగా నాశనం చేస్తుంది. అదే ఈ కదా సారాంశం

“పెద్దాపురం సంస్థానాధీసుడైన శ్రీ రాజా వత్సవాయ విద్వత్ తిమ్మ జగపతి బహద్దరు మహారాజు” మన జోగిపంతులు గారి సమకాలీకులు. విద్యాపోషకులైన విద్వత్ తిమ్మజగపతి రాజుగారు కృష్ణా జిల్లాలోని మచిలీ పట్టణానికి అప్పుడప్పుడు ఆంగ్లేయుల తో వ్యవహారాలూ మాట్లాడించే నిమిత్తం జోగి పంతులు వద్దకి వచ్చేవారు,

ఒకసారి విద్వత్ తిమ్మజగపతి రాజుగారు జోగిపంతులు గారిని కలుసుకోటానికి వారింటికి వెళ్ళినప్పుడు జోగిపంతులు గారు లోపల ఉన్నందున విద్వత్ తిమ్మజగపతి రాజుగారు జోగి పంతులు గారు కూర్చునే కచ్చేరీ స్థానంలో కూర్చోవడం జరిగింది, లోపలినుండి కచ్చేరి కి వచ్చిన జోగి పంతులు మహారాజు తన స్థానంలో కూర్చుని ఉండటం చూసి కోపంతో నోటికి వచ్చినట్టు మాట్లాడి అవమానించడం జరిగింది,

ఆత్మాభిమానం కలవాడైన మహారాజు మారు మాట్లాడకుండా వచ్చిన వ్యవహారం విషయం ఏమీ తెలుపకుండా అవమానభారంతో అక్కడినుండి వెనుదిరిగారు పెద్దాపురం క్షత్రియవంశ రాజు కి జరిగిన అవమానానికి ప్రతీకారంగా వత్సవాయ వంశస్థులకు మద్దత్తునిచ్చే రాజవంశాలు అప్పటి వెలమ రాజులు మరియు ఇతర క్షత్రియ వంశస్థులు అందరూ కలసి అప్పటి ఆంగ్ల వర్తక కంపెనీ ముఖ్య సభ్యుడైన జాన్ పైబస్ గారి అనుమతితో ఆంగ్లము, హిందుస్తానీ చదువుకున్నవారైన విద్వత్ తిమ్మజగపతి రాజు గారినే దుభాషిీగా చేశారు.

జమీందారీ వ్యవహారాలన్నీ విద్వత్ తిమ్మజగపతి రాజు గారే చేస్తూ మచిలీపట్టణం వస్తూ ఉండేవారు. మచిలీ పట్టణంలో ఆయన వచ్చివెళ్లే పేటకు రాజుపేట అని ఇప్పటికీ పేరు. దాంతో జోగిపంతులు గారి దుభాషీ ఏకఛత్రాధిపత్యం అంతరించి పోయింది, ఆయనకి తీవ్ర అవమానం జరిగింది, దాదాపు అన్ని సంస్థానాల జమీందార్ల వ్యవహారలేమీ ఆయనదగ్గరకు వచ్చేవిగావు. కాండ్రేగుల వారి కచేరి వ్యవహారం కుంటుబడిందే అని ఎగతాళి మాటలు అన్ని చోట్లా వినపడేవి, ఆవిధంగా జోగిపంతులుగారి అహంకార పతనం జరిగింది.

అక్కడితో పోక, జగపతిరాజు గారికీ వీరికీ తీరని వైషమ్యం ఏర్పడి ఒకరినొకరు హతమార్చే మంత్ర తాంత్రిక చర్యలు కూడా జరిగినవి అని కధనం : వంగలపూడి శివకృష్ణ

1925total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *