Kandrakota Nukalamma Thalli History

 

కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి చరిత్ర

పూర్వకాలంలో క్రూర మృగాలతో నిండినటువంటి మహా అరణ్య ప్రాంతం నందు యేలా మహా ముని పరమేశ్వరుని ప్రార్థిస్తూ కఠోరమైన తపస్సు చేసాడు… యేలాముని తపస్సు కి మెచ్చి పరమ శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా… తపోఫలంగా సముద్రంలో కలవని నదిని ప్రసాదించమని కోరాడు అదే ఏలేరు నది… చాలా కాలం తరువాత ఈ నదీ పరివాహక ప్రాంతాన్నంతటినీ కిమ్మీరుడు అనే కిరాత రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.

కిమ్మీరుడు రాజ్యంలోని ప్రజలను అనేక రకాలుగా చిత్ర హింసలకు గురిచేసేవాడు అతను పెట్టే కష్టాలను తట్టుకోలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన చంద్రవంశపు రాజైన ధర్మకేతు మహారాజుని ఆశ్రయించి కిిిరాత రాజు కిమ్మీరుడు బారి నుండి తమను తమ సంతానాన్ని రక్షించమని వేడుకొన్నారట అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మీరుని పై సంవత్సర కాలంపాటు భీకరమైన యుద్ధం చేశాడట … అయినప్పటికీ కిమ్మీరుడు మహా మాయావి, అరివీర భయంకరుడు, అఖండ సైన్య సంపత్తికల బలశాలి కావడం చేత దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధంలో ధర్మకేతు మహారాజు పరాజయం పాలయ్యాడు.

యుద్ధంలో ధర్మకేతు మహారాజు ఓటమి పాలైన తరువాత ప్రజలపై కిమ్మీరుడు యొక్క పైశాచిక చర్యలు అధికమయ్యాయి ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మీరున్ని ఓడించి చంపి ప్రజలకు మోక్షం కలిగించాలనే బలమైన కోరికతో అమ్మలగన్నమ్మ ఆదిపరాశక్తిని అంకుఠిత దీక్షతో ప్రార్ధించాడట. ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అనేకమైన అంశల లోని ఒక అంశ ను ధర్మకేతు మహారాజు తో పాటూ యుద్దానికి సహాయంగా పంపిందట. ఆ ఆదిపరాశక్తి యొక్క అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు – కిరాత రాజైన కిమ్మీరున్ని ఓడించి వధించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడట ఆ ఆది పరాశక్తి అంశే “శ్రీ నూకాలమ్మ అమ్మవారు” ధర్మకేతు మహారాజు పరిపాలించిన ప్రాంతమే కాలక్రమంలో “కాండ్రకోట”గా మారింది. యుద్ధంలో తన విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించాడు అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే గ్రామ దేవతగా… కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరినారు .

కాండ్రకోట నూకాలమ్మ జాతర : ప్రతీ ఏటా పాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 45 రోజులు అంగరంగ వైభవం గా కన్నుల పండుగగా జరుగుతుంది… జాతరకి సుమారు 15 రోజులముందు గరగలు ఊరంతా ఊరేగిస్తారు. జాతరలో జరిగే బాణాసంచా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణ, మంగళ వాద్యాలు, మేళతాళాలు, పులి, గరగలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలుతో ఆకట్టుకునే కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని కన్నులారా వీక్షించడానికి, అన్నిటికంటే మించి పంచముఖ మహా సర్పం పడగనీడన సింహ వాహన ధారిణియై… ఖడ్గ, నాగ, త్రిశూల, అక్షయాలతో చతుర్భుజ దివ్యాంభరధారిణియై… సూర్య ప్రభని మించిన దివ్యతేజంతో వెలుగొందుతూ… కొలిచిన వారికి కొంగు బంగారంగా… ఆపదలు తొలగించే తల్లిగా… ఆడపడుచులకు పసుపూ కుంకుమలు నిలిపి అభయం ప్రసాదించే అమ్మ అయిన శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి అమ్మవారి ఆశీర్వాదం పొంది తరించడానికి ఆంద్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రజలు తండోప తండాలుగా తరలివస్తారు ఆధ్యాత్మిక ఆనంద తన్మయత్వం పొంది తిరిగి వెళతారు

జాతర సందర్బం గా శ్రీ నూకాలమ్మ వారికి  గ్రామస్తులు అందరు నైవేద్యం సమర్పేస్తారు ఈ నైవేద్యాన్ని ఆలయ అసాదులు ఇంటింటి కి తిరిగి  సేకరించి      ఆలయంలో అమ్మవారికి సమర్పిస్తారు

శ్రీ నూకాలమ్మ వారికి జాతర రోజు అమావాస్య గడియలు వచ్చాక మా ప్రక్క గ్రామం ఉలిమేశ్వరం నుంచి అమ్మవారి పన్నీరం చీర సారె తీసుకువస్తారు

ప్రతీ ఏటా అమావాస్య నాడు శ్రీ నూకాలమ్మ అమ్మవారి చల్లగటం గ్రామం లో ఇంటింటి కి తిప్పుతారు చల్లగటం అనగా ఆసాదులు ఒక మజ్జ్జిగ కుండను గ్రామంలో ఇంటింటికీ తిప్పుతారు. ప్రతీ ఇంటి వారు అమ్మవారి మజ్జిగ కుండ లో వారి ఇంట్లో మజ్జిగ పోసి తిరిగి అమ్మవారి మజ్జిగ వారు తీసుకుంటారు
ఇలా చేయడం గ్రామస్తుల పాడి పంటలకు శుభంగా భావిస్తారు

చుట్టు ప్రక్క గ్రామాలనుండి అనేకమంది భక్తులు ఎద్దుల బండ్లపై కుటుంబ సమేతంగా జాతరకు తరలివస్తుంటారు సుమారు కొన్ని వందల సంవత్సరాలుగా రాజమండ్రి పక్కన ఉన్న సీతానగరం మండలం రఘుదేవపురం, రాపాక, సీతానగరం, కొండేపూడి, చీపురుపల్లి, నాగంపల్లి మరియు పరిసర  గ్రామాలనుంచి సుమారు 200 ఎడ్ల బండ్లపై .భక్తులు తరలివచ్చే ఆచార విధానం ఆశ్చర్యంగా ఉంటుంది

వారు అందరూ ఒక్కసారిగా జాతర ముందు రోజు సాయంత్రం బయలుదేరి శ్రీ నూకాలమ్మ అమ్మవారి ప్రతిమను మరియు అమ్మవారు ఆవహించిన మహిళను మొదటి బండి లో కూర్చోబెట్టి జాతర రోజున కాండ్రకోట చేరుకుంటారు… అమ్మవారి దర్మనం అయిన తరువాత తెల్లవార్లు జాగారం చేసి అమావాస్య నాడు శ్రీ నూకాలమ్మ అమ్మవారి ప్రతిమకు పూజాదికార్యక్రమాలు జరిపి అమ్మవారు ఆవహించిన మహిళను శాంతింపచేసి ఏలేరు దర్మించుకొని  కాంండ్రకోట తీర్థం లో కొత్త చేతి కర్రలు ఇతరవస్తువులు కొనుగోలు చేసి సాయంత్రం బయలుదేరి ఉగాది నాడు ఉదయం వారి స్వగ్రామాలకు చేరతారు

మీరు కూడా అమ్మ వారిని కుటుంబసమేతంగా దర్శించాలని ఆశిస్తున్నాం – వంగలపూడి శివకృష్ణ

పూజా కార్యక్రమాలు : నిత్యం దూప దీప నైవేధ్యం, కుంకుమార్చన, లోక కల్యాణార్థం సహస్ర చండీ యాగం, ఏకాదశ న్యాస పూర్వక చతుస్సహస్ర చండీ పారాయణాలు, వర్షాభావ పరిస్థితులలో వరుణ హోమం

ఆలయ కార్య నిర్వాహక వర్గం : దేవాదాయ శాఖాధికారి శ్రీ పులి నారాయణ మూర్తి  గారు, ఆలయ ఛైర్మెన్ శ్రీమతి ఎలిశెట్టి నాగలక్ష్మి నాని దంపతులు

ఆలయ ప్రధాన అర్చకులు : శ్రీ యలమంచల దత్తు శర్మ

ఆలయ ధర్మకర్తలు : సవిటి నాగేశ్వర రావు, మింగి వీరబాబు, ఉద్దగిరి అర్జన్న, బొజ్జా వెంకట రాజు, ఆరట్ల బుల్లెబ్బాయి, గవరసాన వెంకట రాజు, రంగనాధం శ్రీను,   గుద్దటి ధర్మరాజు, వేమవరపు సత్యనారాయణ గార్లు…

గ్రామ అధికారులు ఎం.పి.పి గుడాల రమేష్, సర్పంచ్ కుంచె గాంధీ, వైస్ సర్పంచ్ ఎలిశెట్టి ప్రకాష్ గార్లు

యువ జాతర కమిటీ : గవరసాన రాజ శేఖర్, ఎలిశెట్టి వెంకటేశ్వర రావు (శ్రీను) రాగాల హరి, వట్టూరి అర్జున్, మరియు సహాయక యువకమిటీ కాండ్రకోట యువకులు పెద్దలు అందరూ

By. Vangalapudi Siva Krishna

3767total visits,2visits today

4 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *