KOLLURI SATYANARAYANA SASTRY, PEDDAPURAM

పెద్దాపురం పౌరుడు స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ కొల్లూరి సత్యనారాయణ శాస్త్రి గారు


విశాఖ గాంధీగా వెలుగొందిన శ్రీ కొల్లూరి సత్యనారాయణ శాస్త్రి గారు కొల్లూరి కామేశ్వరమ్మ, బ్రహ్మాజీ రామశర్మ దంపతులకు 16 నవంబరు 1922 న పెద్దాపురంలో జన్మించారు వీరిది ఆదినుండీ దేశభక్తుల కుటుంబం… శాస్త్రి గారి అక్క బావ మద్దూరి వేంకటరమణమ్మ, మద్దూరి అన్నపూర్ణయ్యలు స్వాతంత్య్రం కోసం జైలు శిక్షను అనుభవించారు… వీరి స్పూర్తితో సత్యనారాయణ శాస్త్రి గారు చిన్నతనం నుండే స్వాతంత్ర్య ఉద్యమాలలో చురుకుగా పాల్గొనే వారు… క్విట్ ఇండియా ఉద్యమంలో చేసిన పోరాటానికి గానూ ఆలీపూర్ కాంప్ వద్ద నాలుగు మాసాలు జైలు శిక్ష అనుభవించారు. తరువాత జైలు నుండి విడుదలై జనవరి 1944లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ను స్థాపించారు. బొబ్బిలి సీతా నగరం సుగర్ ఫాక్టరీ (నిజాం సుగర్స్) లను ప్రయివేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 14 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసారు, 1985 లో పేదరిక నిర్మూలన, గ్రామ స్వరాజ్యం మరియు మతసామరస్యం లక్ష్యంగా గాంధీ సెంటర్ స్థాపించడంతో విశాఖగాంధీగా గుర్తింపు పొందారు

గాంధీ, నెహ్రూ, సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ లాంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. వారితో కలిసి పనిచేశారు. ముఖ్యంగా సత్యనారాయణ శాస్త్రి గారిపై గాంధీ ప్రభావం ఎక్కువగా ఉంది. ఏం సాధించాలన్నా గాంధేయ మార్గమే శరణ్యమని ఆయన గట్టిగా నమ్మేవారు.

ఆయన 13 డిశంబరు 2016 న స్వర్గస్తులయ్యారు

683total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *