Lakshmi Sodemma History, Peddapuram

 

కొంపెల్ల లక్ష్మీశోధెమ్మ సాహస చరిత్ర, పెద్దాపురం

ఇది లక్ష్మీశోధెమ్మ అనే తెలుగు మహిళ సాహస చరిత్ర కథ

కొంపెల్ల లక్ష్మీశోధెమ్మ అనే బ్రాహ్మణ మహిళ పెద్దాపురం సంస్థానాధీశులైన వత్సవాయ క్షత్రియ వంశస్థులకు తరతరాలనుండి నమ్మకస్తులయిన రాజపురోహితుల కుటింబీకురాలు, క్రీ.శ 1555 నుండి వత్సవాయ వారు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించారు. 1688 నుండి 1714 వరకూ రాజా వత్సవాయ ఉద్దండ రాయపరాజు గారు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించి అకాలమరణం చెందడంతో రాగమ్మదేవిగారు 1714 నుండి రాజ్యపాలన భారం వహించి తన కుమారుడైన వత్సవాయ కళాతిమ్మ జగపతి సహాయంతో పరిపాలించారు, కళాతిమ్మ జగపతి అన్ని కళలలో ఆరితేరినవారు యుక్తవయసులోనే వివాహము చేసికొని పెద్దాపురం సంస్థాన రాజ్యపాలన భారం వహించి 1734 వరకూ సమర్థతతో పరిపాలనచేశారు హైదరాబాద్ నవాబు గారి సేనాపతి అయిన రుస్తుంఖాన్ పెద్దాపురం సంస్థానం పై కన్నేశాడు దండయాత్రచేసి పెద్దాపురం కోట పడగొట్టలేక కపట నాటకముతో కళాతిమ్మరాజుగారిని ఆయన ఇద్దరు సోదరులని విందుకని ఆహ్వానించి హత్య చేయించి రాజ్యాన్ని అంతఃపుర స్త్రీలను చెరపట్టేందుకు పెద్దాపురం బయలుదేరాడన్న వార్త తెలుసుకున్న రాగమ్మదేవి గారు అంతఃపుర స్త్రీలు అందరితో సహా అగ్నిప్రవేశంచేయబోయే ముందు తన మనుమడు (కళాతిమ్మ జగపతి కుమారుడు) పసిబాలుడు అయిన జగపతిరాజును ను ఎలాగైన రక్షించి విజయనగర రాజ్యమునకు చేర్చి రాజవంశమును కాపాడ వలసినదిగా కొంపెల్ల లక్ష్మీశోధెమ్మ అనే బ్రాహ్మణ మహిళను అభ్యర్ధించారు.

కొంపెల్ల లక్ష్మీశోధెమ్మ వత్సవాయ వారికి నమ్మకస్తులయిన రాజపురోహితుల కుటింబీకురాలు రాజ పురోహితులలో ఒకడైన తన భర్త మరణించడంతో వితంతువురాలైన సోదెమ్మ అంతఃపురంలో మహారాణీ లకు సేవకురాలిగా ఉంటున్నారు .. రాగమ్మ గారి ఆదేశానుసారం రాజకుమారుడిని కాపాడడానికి రాజకోటను దాటి రహస్యమార్గం గుండా పెద్దాపురం పొలిమేరలు దాటి విజయనగరం గజపతులకు రాజకుమారుడిని అందించాలనే సంకల్పంతో కొంపెల్ల లక్ష్మీశోధెమ్మ బయలుదేరింది దురదృష్టవ శాత్తూ లక్ష్మీశోధెమ్మ రుస్తుంఖాన్ సేనలకు కనపడిపోయింది వారు సోదెమ్మను ఆపి ఎవరు ఈబాలుడు అని ప్రశ్నించారు కొంపెల్ల లక్ష్మీశోధెమ్మ ఏమాత్రం తడబడకుండా నా బాలుడే అని సమాధానం చెప్పింది. వారు బాలుడిని సోదెమ్మను పరీక్షించ దలచి ఒక జామపండును ఆమెకి ఇచ్చి కొరకమన్నారు ఆ ఎంగిలి పండును పిల్లవాడికి తినిపించమన్నారు… (ఆ కాలంలో రాజ కుమారుడికి దాస్యుల/అన్యుల ఎంగిలి నిషిద్ధం) అయినా బాలుడిని కాపాడుకొనే నిమిత్తం అలానే చేసింది ఆమె తత్తర పాటుని గమనించిన సైనికులు బాలుడికి పాలు ఇవ్వమని ఆదేశించారు సోదెమ్మ భయంతో వణికిపోయింది లో లోపల భాద ఉన్నా పైకి ఏమాత్రం కనపడనీయకుండా వారు చెప్పినట్టే చేసింది వారు సోదెమ్మ ను వదిలేశారు ఆమె విజయనగరం బాలుడితో సహా ప్రయాణమైయ్యింది కొంతదూరం పోనిచ్చి రుస్తుంఖాన్ సేనలు ఆవిడను వెంబడించి బాలుడిని సోదెమ్మను బందించి రుస్తుంఖాన్ వద్దకు తీసుకుని పోయారు రుస్తుంఖాన్ బాలుడిని రాజకుమారుడిగా అనుమానించి బందించమని ఆజ్ఞాపించగా ఆ బాలుడు నా బిడ్డడే అని వాదించి ఆ బాలుడి తో పాటూ తానూ జైల్లో జీవితం గడిపింది రహస్యంగా ఈ సమాచారం విజయనగర గజపతులకు చేరవేసి బాలుడిని విడిపించడంలో కీలక పాత్ర పోషించి వత్సవాయ వంశం నిలబడడంలో ప్రాణాలకు తెగించి మరీ సహాయం చేసింది.

Ref: పెద్దాపురం సంస్థాన చరిత్రము & కధలు గాధలు,  వంగలపూడి శివకృష్ణ

751total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *