Madduri Venkata Ramanamma, Peddapuram

భారత స్వాతంత్ర్య సమర యోధురాలు : మద్దూరి వెంకట రమణమ్మ

జననం : 2 మార్చి 1906 తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం
తల్లి తండ్రులు : కొల్లూరి కామేశ్వరమ్మ, బ్రహ్మాజీ రామశర్మ

మద్దూరి వెంకట రమణమ్మ గారు సంసారమే సర్వస్వము అంటూ ఆనాటి అందరి స్త్రీలలానే వంటగదికి పరిమితం కాలేదు దీర్ఘకాల దాస్య శృంఖలాల వల్ల దీనురాలై దుఃఖిస్తున్న భారతమాత కన్నీరు తుడవడానికి భర్త మద్దూరి అన్నపూర్ణయ్య గారితో కలిసి స్వాతంత్ర్యోద్యమ బాట పట్టారు.

విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా 1932లో రాజమండ్రి లో బట్టల దుకాణాల ముందు ఉద్యమం చేపట్టారు. బ్రిటీషు ప్రభుత్వంచే బాధింపబడ్డారు. వెల్లూరు మరియు కనమర్రు జైళ్ళలో 6 నెలల పాటూ జైలుశిక్ష అనుభవించారు. రాత్రి సమయాలలో రహస్య సమావేశాలను నిర్వహించి, సాటి మహిళల్లో దేశభక్తిని నింపేవారు. మన భారత దేశ చరిత్రలో ఇలాంటి మహిళామూర్తులెందరో వారందరికీ మన పెద్దాపురం గ్రూపు తరపున పాదాభివందనం

1546total visits,4visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *