Maharani Choultry, Peddapuram

 

మహారాణీ సత్రం – మహోన్నత సత్రం

పెద్దపాత్రుడు అనే మహారాజు ఈ నగరాన్ని నిర్మించాడు అతని పేరుమీదనే ఈ నగరం పెద్దాపురం గా పిలువబడినది.

ఆ తరువాత కాలంలో వత్సవాయి వంశానికి చెందిన శ్రీ రాజా వత్సవాయ చతుర్భుజ తిమ్మ జగపతి బహద్దరు మహారాజు 1555 వ సంవత్సరంలో పెద్దాపురం కోటను సంపాదించి వీరోచితంగా శత్రురాజులతో పోరాడి సంస్థానాన్ని నలుదిశలా పెంపొందింప చేయడం చేశారు వారి తదనంతరం వారి వంశంలోని వారే 300 సంవత్సరాలు పెద్దాపురం సంస్థానాన్ని సుభిక్షంగా పరిపాలించారు కళలను కళాకారులను పోషించారు, చెరువులు త్రవ్వించారు, దేవాలయాలకు విరివిగా భూములు దానం చేశారు వీరి వంశంలోని 7 వ తరం వారసులైన వత్సవాయ రాయ జగపతి బహద్దరు మహారాజు గారు 1797 లో అధికారంలోకి వచ్చి రాజ్యాన్ని మరింత పెంపు గావించారు ఈయన కాలంలోనే పెద్దాపురం సంస్థానం 585 గ్రామాలు పట్టణాలతో విరాజిల్లింది. ఈయనకు ముగ్గురు భార్యలు రాయ జగపతి మహారాజు ఆకస్మికంగా మరణించడంతో వరుసగా ముగ్గురు భార్యలు రాజ్యపాలన చేశారు… వరుసగా ముగ్గురు భార్యలు రాజ్యపాలన చేసిన చేసిన ఏకైక సంస్థానం పెద్దాపురం సస్థానమే కావడం విశేషం

ముగ్గురు మహారాణులలో మహారాణీ సత్రం నిర్మించడం ద్వారా అందరి మన్ననలు పొందిన మానవతా మూర్తి మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారే

మహారాణీ సత్రం గురించి ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడాలన్నా ముందుగా మహా రాణీ బుచ్చి సీతాయమ్మ అమ్మ గారి గురించి మరీ ముఖ్యంగా ఆమె యొక్క గొప్ప వ్యక్తిత్వం గురించి మాట్లాడి తీరాల్సిందే మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారిది  మహోన్నత ఔన్నత్యం,      మహోత్తమ ఔదాత్యం,      మహత్తరమైన ఔదార్యం

మన ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే…

ఎంతో చరిత్ర కలిగినటువంటి పెద్దాపురం సంస్థానాన్ని 1555 చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు గారు మొదలుకొని 1847 సూర్యనారాయణ జగపతి మహారాజు గారి వరకు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్దాపురం సంస్థానాన్ని స్వాధీన పరుచుకునే వరకూ మధ్యలో సార్వభౌమ తిమ్మ జగపతి, ఉద్దండరాయ జగపతి, కళా తిమ్మ జగపతి, విద్వతిమ్మ జగపతి, రాజా రాయ జగపతి… ఎలాంటి ఎందరో మహారాజులు సైతం చెయ్యలేనటువంటి మానవీయమైన కార్యం నిత్యా అన్నదాన సత్రం మహారాణీ గారే నిర్మించారు…

మహారాణీ సత్రం నిర్మించే నాటికి పెద్దాపురం సంస్థానం పరిస్థితులే వేరు… ఒకవైపు రాజ్యాధికారం కోసం భీమవరపు కోట వాస్తవ్యుల తో తగాదాలు మరోవైపు బ్రిటీషువారితో ఎస్టేటు వ్యవహారాల సెటిల్మెంటు వివాదాలు… అలాంటి గడ్డు పరిస్థితులలో కూడా

అన్నార్థులే ఆప్తులుగా…    బాటసారులే బంధువులుగా…   దీనజనోద్ధరణే దైవారాధన గా భావించి… 500 ఎకరాల పైచిలుకు భూమిని పెద్దాపురం సత్రానికి అలానే 500 ఎకరాల పైచిలుకు భూమిని కత్తిపూడి సత్రానికి  మొత్తం 1000 ఎకరాల భూమిని దానం చేసి శాశ్వత అన్నదాన పథకం ఏర్పాటు చేయడంటే సామాన్య విషయం కాదు… అందుకే ఆమె చరిత్రను సత్రం నిర్మాణాన్ని అనేక గ్రంధాలు వేనోళ్ళ కొనియాడాయి అందులో ముఖ్యంగా

కందుకూరి వీరేశలింగం గారు రచించిన తెలుగు మొట్ట మొదటి నవల రాజశేఖర చరిత్రము 8,9,10 ప్రకరణాలు

డా . తూమాటి దొప్పన్న గారు రచించిన ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణము లో  పేజి 277

యేనుగుల వీరాస్వామయ్య గారు రచించిన మొట్టమొదటి తెలుగు యాత్రా నవల కాశీయాత్ర చరిత్ర, పేజీ 341

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు రచించిన కథలు గాథలు

శ్రీ రామ వీరబ్రహ్మం గారు రచించిన నానా రాజ్య చరిత్రము 271 పేజీ

ప్రముఖ చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాలరాజు రచించిన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము

వత్సవాయ రాయజగపతి వర్మ గారు రచించిన పెద్దాపుర సంస్థాన చరిత్రము, లో పేజి నం 89…

ఇంకా ఎందరో కవులు రచయితలు వారి వారి రచనల్లో మహారాణీ గురించి ఆమె ఏర్పాటు చేసిన సత్రం గురించి గొప్పగా రచించడం జరిగిందండి… ఆ మహాతల్లి నిర్మింప చేసిన సత్రం మిగులు నిధులు మహారాణీ కళాశాల స్థాపనకు కూడా కొంత సహకరించాయి అప్పటినుండీ పెద్దాపురంలో మహారాణీ సత్రంలో అన్నదానంతో పాటూ మహారాణీ కళాశాలలో విద్యాదానం కూడా జరిగి ఎందరో విద్యార్థులకు ఆనాటినుండి ఈనాటికీ కూడా నిర్విరామంగా.. నిరాటంకంగా… నిరంతరాయంగా నిత్యాన్నదానం జరగడం చాలా గొప్పవిషయం…

అందుకే పెద్దాపురానికి మరిడమ్మ తల్లి దేవతా మూర్తి అయితే మహారాణీ బుచ్చి సీతాయమ్మ తల్లి మానవతా మూర్తి మా లాంటి వారందరకీ ఆ సీతయ్యమ్మే స్ఫూర్తి : వంగలపూడి శివకృష్ణ

2072total visits,2visits today

6 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *