MAHATMA GANDHI PEDDAPURAM VISIT

Demo vedio

మహాత్మాగాంధీజీ పెద్దాపుర సందర్శనం

1933, డిసెంబర్ 24 ఆదివారం ఉదయం 10 గంటల 40 నిముషాలకు సామర్లకోట రైల్వేస్టేషన్ లో రైలుదిగి అక్కడ నుండి కారుపై నేరుగా పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాల పుట్ బాల్ స్టేడియం వద్దకు వీచ్చేసారు అప్పటికే తెల్లవారుజామునుండీ మహాత్మున్ని చూడటానికి ఆయన సందేశం వినడానికి పెద్దాపురం జిల్లా నలుమూలల నుండీ వేలాది మంది సభా ప్రాంగణంలో వేచిఉన్నారు… దారి పొడవునా జన సందోహం.. మేడలమీద గోడలమీద… చెట్లమీద పుట్లమీద ఎక్కడపడితే అక్కడ ఇసుకవేసినా రాలనంత జనం

ఆ అఖండ జనసమూహాన్ని చేదించుకుని దేశాభిమానుల జయ జయద్వానాల మద్య వేధిక చేరుకున్న మహాత్ముడు ఆ బహిరంగ సమావేశంలో స్వదేశీ దేశభక్తిలో ప్రజలు వ్యాపార వర్గాల భాగస్వామ్యం ఆవశ్యకత పై మాట్లాడడం జరిగింది ఆ బహిరంగ సభకు ఆ కాలంలోనే సుమారు 2O,OOO మంది హాజరయ్యార్రారని కధనం…

ఆ సందర్భంలోనే గాంధీజీ పెద్దాపురం పట్టువస్త్రాలు తయారీని ప్రశంసించడం చేనేత కళాకారుల ప్రతిభను కొనియాడుతూ పెద్దాపురం సిల్క్ ను స్వదేశీ సిల్క్ అన్నారట,

అనంతరం సుమారు వెయ్యి రూపాయల విలువచేసే విదేశీ వస్త్రాలను పెద్దాపురం మెయిన్ రోడ్డులో స్వయానా వస్త్ర వ్యాపారులచే తగులబెట్టించి స్వదేశీ ఉద్యమానికి ఊపిరులూదినట్టు కధనం

ఆ చారిత్రక సంఘటన తాలూకు వీడియో క్లిప్పింగ్స్ అప్పటి లూథరన్ పాఠశాల కరస్పాండెంట్ అయిన రెవ. అగస్ట్ స్కిమ్టెన్నర్ (Rev. August Schmitthenner) రెండవతరం వారసుడైన ఫీటర్ స్కిమ్టెన్నర్ (Rev. Peter Schmitthenner) వద్ద ఇప్పటికీ బద్రంగా ఉండటం విశేషం.

మహాత్ముడి రాకకు గుర్తుగా పెద్దాపురం లో మహాత్మాగాంధీ గారి విగ్రహం ఏర్పాటు అలాగే అనంతరం మహాత్మాగాంధీ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల ఏర్పాటు అనతికాలంలోనే జరిగాయి

*పెద్దాపురం సభతర్వాత* అదేరోజు కాకినాడ బహిరంగ సమావేశంలో మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడినుండి గొల్లపాలెం మీదుగా రామచంద్రపురం వెళ్లి వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు ఆ తరువాత రాజమండ్రి 7గంటల 30 నిముషాలకు చేరుకుని ప్రజా సమావేశంలో ప్రసంగించి హరిజన నాయకులతో చర్చించారు ఆ రాత్రి రాజమహేంద్రవరం లోనే బసచేసారు మరుసటిరోజు అనగా 1933 డిశంబరు 25 సోమవారం క్రిష్టమస్ నాడు సీతానగరం చేరుకుని మౌనపోరాటం చేసారు

డిసెంబర్ 26 మంగళవారం వంగలపూడి లో సీతారామస్వామి ఆలయం సందర్శించారు సీతానగరంలో హరిజన ఆశ్రమం మరియు రామలింగేశ్వర ఆలయం ప్రారంభించారు…

*మీకు తెలిసిన మరింత సమాచారం తెలియజేయండి * ఒక ఆర్టికల్ గా అందిద్దాం… వంగలపూడి శివకృష్ణ

1830total visits,5visits today

3 Comments

Leave a Reply to Naveen Nani Cancel reply

Your email address will not be published. Required fields are marked *