MANA PEDDAPURAM GROUP – “EDUCATION WING”

మన పెద్దాపురం గ్రూప్ ఎడ్యుకేషన్ వింగ్

మన పెద్దాపురం పరిధిలో ఏ ఒక్క విద్యార్థి ఆర్ధిక కారణాల వలన విద్యకి దూరం అవ్వకూడదనే ఉద్దేశంతో మన పెద్దాపురం గ్రూప్ ద్వారా ఈ “ఎడ్యుకేషన్ వింగ్” ని ప్రారంభించడం జరిగింది… దాతల సహాయంతో కొందరి విద్యార్థులకు ఫీజులు చెల్లించడం జరిగింది… అలాగే ఎవరైనా విద్యార్థులు ఆర్ధిక కారణాలవల్ల చదువుకోవడం మధ్యలో ఆపేసినట్లయితే మన పెద్దాపురం గ్రూప్ కి తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది… నిరుపేద కుటుంబాలకు ఆర్ధిక సహాయ అందించడం తో పాటూ వారి పిల్లలను చదివించే బాధ్యత మనపెద్దాపురం గ్రూప్ ద్వారా తీసుకోవడం జరిగింది… పాఠశాలలకు నోటుపుస్తకాలు పంపిణీచేయడం… పరీక్షలు వ్రాసే విద్యార్థులను మానసికంగా సన్నధం చేయడం… పరీక్షల తర్వాత వారి పై చదువులకు సంబందించిన కోర్సుల వివరాలు తెలియజేయడం… షేర్ యువర్ నాలెడ్జ్ ( జ్ఞానం పంచు – జ్ఞానం పెంచు ) అనే నినాదం తో స్కూల్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస క్లాసులు చెప్పించడం జరిగింది

948total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *