MANA PEDDAPURAM MAHILA SAKTHI

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


పురాణాల ప్రకారం పెద్దాపురం ఒక మహిళామూర్తి పృథా దేవి పేరుమీద నిర్మించిన నగరం పృథాపురం
పెద్దాపురం ప్రధాన గ్రామదేవత మరిడమ్మ అమ్మవారు
చరిత్రలో నలుగురు మహారాణులు పరిపాలన చేశారు వారిలో వత్సవాయ రాగమ్మ గారు ప్రదములు కాగా వరుసగా ముగ్గురు మహారాణులు వత్సవాయ లక్ష్మీనరసాయమ్మ, బుచ్చి సీతాయమ్మ, బుచ్చి బంగారయమ్మ లు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించారు అలాగే

1915 వ సంవత్సరం లో ఏర్పడిన పెద్దాపురం మునిసిపాలిటీకి వరుసగా ముగ్గురు మహిళా చైర్మన్లు సేవలందించారు శ్రీమతి తాళ్ళూరి గంగా భవాని గారు (1987-1992) శ్రీమతి బచ్చు శ్రీదేవి గారు (1995-2000) శ్రీమతి ముప్పన శ్యామలాంబ గారు (2005-2010)

స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించి లాఠీ దెబ్బలు తిని, జైలు శిక్ష అనుభవించిన మద్దూరి వెంకట రమణమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ, దువ్వూరి సుబ్బమ్మ లు మన పెద్దాపురం ఆడపడుచులు

1918 లో నే పెద్దాపురంలో పి. లీలావతి చెల్లమ్మ అధ్యక్షురాలు గా, అవసరాల శేషగిరమ్మ గారు ప్రధాన కార్యదర్శి గా శ్రీ సరస్వతీ నికేతన స్త్రీ సమాజం ఏర్పడింది. 1919 అక్టోబరు 31 ప్రథమ వార్షికోత్సవసభలో బులుసు సూరమాంబ స్త్రీల స్థితికి కారణాల గురించి ప్రసంగించారు….

వెండితెర ఇలవేల్పుగా వెలుగొంది మహానటులతో చేత కూడా అమ్మ అనిపించుకుని పాదాభివందనాలు చేయించుకున్న మహానటి అంజలీదేవి గారిది మన పెద్దాపురం… అలానే సినీనటి డబ్బింగ్ జానకి గారు కూడా

అలాగే ప్రస్తుతం అనేక రంగాలలో పెద్దాపురం మహిళలు ముందుకు దూసుకుపోతూ అందరికీ మార్గదర్శకం గా నిలుస్తున్నారు, గృహిణులుగా తమ గురుతర భాద్యత నిర్వర్తిస్తూనే సమాజానికి సేవ చేస్తున్నారు మహిళల సమస్యల పట్ల పోరాడే నాయకురాలుగా, జర్నలిస్టులుగా, మైక్రో ఆర్టిస్టులుగా కవయిత్రులుగా, రచయితలుగా, నృత్య కళాకారిణులుగా, టీచర్స్ గా, ప్రభుత్వ ప్రయివేటు ఉన్నతోద్యోగులుగా, చిరుద్యోగులుగా అనేక రంగాలలో వారు స్థిరపడి సమాజ నిర్మాణంలో తమ వంతు భాద్యత వహిస్తున్నారు…. ఇవన్నీ పెద్దాపురం నిర్మాణంలో సంస్కృతిలో సాంప్రదాయంలో మహిళా ప్రాధాన్యత గురించి తెలియజేసే అంశాలు… మీకు తెలిసిన వారి పేరులు వివరాలు తెలియజేయండి

1832total visits,1visits today

4 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *