MR. College History, Peddapuram

శ్రీ రాజా వత్సవాయి జగపతి బహద్దరు మహారాణీ కాలేజీ

తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, కపిలేశ్వర పురం జమిందారుగా సుపరిచితులైన శ్రీ S.B.P.B.K. సత్యనారాయణ గారి విశేష కృషి, పెద్దాపురం ప్రజల బలమైన ఆకాంక్ష, మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారు ఏనాడో మంచి మనసుతో ప్రారంభించిన మహారాణీ సత్రం. వెరసి మహారాణీ కాలేజీ ఆగష్టు 1967 వ సంవత్సరంలో ప్రారంభం కావటానికి కారణభూతమైంది

కళాశాల ప్రారంభానికి S.B.P.B.K. సత్యనారాయణ గారు చేసిన కృషి అనన్య సామాన్యం,

1967 ఆరోజుల్లో పెద్దాపురం పేరుకి డివిజన్ ముఖ్య కేంద్రం అయినప్పటికీ అక్షరాస్యతా శాతం లో అట్టడుగు స్థానం లో వుండేది. యస్ యస్ యల్ సి చదివిన వారి సంఖ్య వేళ్ళ మీద లెక్కించవచ్చు అంత తక్కువగా ఉండేది. జిల్లాల్లో రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం లాంటి ప్రాంతాలలో మాత్రమే హైస్కూళ్ళు ఉండటంతో సుదూర ప్రాంతాలనుడి విద్యార్ధులు ఉన్నత విద్య కోసం పెద్దాపురం వచ్చేవారు.

పెద్దాపురం ప్రజలలో ఎక్కువ శాతం మంది వ్యవసాయ, చేనేత, చేతి వృత్తులవారు కావడంతో చాలా మంది పేద విద్యార్ధులు యస్ యస్ యల్ సి అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులైనప్పటికీ కళాశాల చదువుల కోసం చెన్నపట్టణం పోలేక కన్నీళ్లు దిగమింగుకొని కార్మికులుగానే స్థిరపడి పోయేవారు.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రతీ విద్యార్ధికి ఉన్నత చదువులు చేరువకావాలనే సత్ సంకల్పం తో మహారాణీ సత్రం యొక్క మిగులు నిధులు నుంచి రూ. 90,000/-,  కళాశాలకు అవసరమైన స్థలం కొనుగోలు నిమిత్తం సర్వారాయ ఎడ్యుకేషన్ ట్రస్టు నిధులనుంచి 50,000/- రూపాయలు  మరియు ఇంకా ఇతర అవసారాల నిమిత్తం అయిన ఖర్చులను శ్రీ ముప్పన అంకయ్య సోదరులు పెద్ద మనసుతో స్వచ్చందంగా ఇవ్వగా పెద్దాపురం పరిసర ప్రాంత విద్యార్ధుల ఆశాదీపం మహారాణీ కళాశాల స్థాపన ఇప్పటి మహారాణీ సత్రం ప్రాంగణంలో ఘనంగా జరిగింది.

కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్ గా వి. హబీబుల్లా గారు నియమితులయ్యారు, ఆ తరువాత నిముషకవి వెంకటేశ్వరరావు గారు, ధన్యంరాజు శేషగిరిరావు గారు, జమ్మి కోనేటి రావు గారు, జి. చిరంజీవులు గారు, కె. వెంకట నరసయ్య గారు, ఎన్. వెంకటరావు గారు, ఆర్. రామాంజనేయులు గారు, టీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, గంటి శ్రీరామ చంద్రమూర్తి గారు, ఏ. ఎస్. వి. సుబ్రహ్మణ్యం గారు, ఏ.జి.కె మూర్తి గారు, శ్రీ జె. రమేష్ గారు, శ్రీ ఎన్. రమణ మూర్తి గారు, శ్రీ కే. ఎస్ .ఆర్ మూర్తి గారు, వెలగపూడి నరసింహారావు గారు, యు, మధుర మోహన రావు గారు, ఎన్. మధు సూధనరావు గారు, రావు ప్రభాకర రావు గారు, కళాశాల ప్రిన్సిపాల్స్ గా భాద్యతలు స్వీకరించిన వారిలో వున్నారు ఇప్పుడు డా. ఇందిరా ఆశాలత పీటర్ గారు ప్రిన్సిపాల్స్ గా మరియు టి వీరయ్య చౌదరి గారు వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు

1967 లో పి. యు. సి (P.U.C), బి. ఎ (B.A) మరియు బి.కామ్ (B.Com) లలో 200 మంది విద్యార్ధులు-15 మంది స్టాఫ్ తో ప్రారంభమై, తరువాత సంవత్సరమైన 1968 విద్యా సంవత్సరంలో బి. ఎస్. సి(B.S.C) లో కొన్ని కాంబినేషన్లు ప్రారంభమై 22 మంది స్టాఫ్ కు చేరుకున్నారు 1969 లో పి. యు. సి ని సైన్స్, ఆర్ట్స్, కామర్స్, విభాగాలు లో రెండు సంవత్సరాల ఇంటర్ మీడియట్ గా మార్చడం జరిగింది. అందుచేత, BSC, B. COM జూనియర్ ఇంటర్ విధ్యార్ధులకు బోధించడానికి 10 మంది లెక్చరర్స్, 2 జూనియర్ లెక్చరర్స్,1 ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అదనంగా నియమితులైనారు వీరితో కలిపుకుని మొత్తం 35 టీచింగ్ అండ్ ఆపీస్ స్టాప్ విద్యార్థులకు ఉత్తమ సేవలందించారు.

1979 – 80 ప్రాంతంలో పెద్దాపురం పెద్దలు, కళాశాల పూర్వవిద్యార్థి, ఒకప్పటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు, కళాశాల లలితకళా విభాగానికి కార్యదర్శి అయిన ఆర్. నారాయణమూర్తి చొరవతో సినిమా నటి మంజులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ సేకరించగా ఇప్పటి కళాశాల పెద్దాపురం సామర్లకోట జంట నగరాల నడిబొడ్డున శ్రీ రాజా వత్సవాయ జగపతి బహద్దరు మహారాణీ కళాశాల ఆవిర్భవించినది

 

జూలై 1987 లో అటానమస్ గా గుర్తిపు పొంది బి. ఎ మరియు బి యెస్. సి కోర్సులలో గల అన్ని కాంబినేషన్ లు ( B.S.C. Mpac, Mpe – B.A. Epp, Ecf) లు జత చేయడం జరిగింది.

ఆ తరువాత 1993 – 94 నుంచి అటానమస్ వద్దు అని కళాశాల విద్యార్థులు పట్టుబట్టగా కళాశాల యాజమాన్యం మరియు శ్రీ రాజా సూరిబాబు రాజు గారు, పెద్దాపురం పెద్దలు, ఢిల్లీ వరకూ వెళ్లి అప్పటి రాజకీయ పెద్దలతో మాట్లాడి ఆంధ్రా యూనివర్సిటీ రెగ్యులేషన్ కోసం కృషి చేసి సఫలీకృతులయ్యారు

2007 సంవత్సరం నుండి పి. జి కోర్సులు కూడా ప్రారంభిం చడంజరిగింది ఇప్పుడు ఆదికవి నన్నయ యూనివర్సిటీ అనుబంధంగా కొనసాగుతూ విజయపధంలో దూసుకుపోతూ స్వరోత్సవం జరుపుకుంటుంది మహారాణీ కళాశాల

18 ఎకరాల సువిశాల స్థలం, విశాలమైన క్రీడా ప్రాంగణం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, క్రమశిక్షణతో కూడిన విద్య – అంకిత బావాన్ని అలవరిచే ఎన్ సి సి (N.C.C) – సామాజిక బాద్యతను పెంపొందిచే ఎన్. యెస్. ఎస్. (N.S.S), రెడ్ క్రాస్ –
పూర్తి స్థాయి సాంకేతిక పరికరాలతో కూడిన లాబరేటరీ – ఇ క్లాస్ రూమ్స్ – విద్యార్ధులకు ఇంటర్నెట్ సౌకర్యం, అధునాతన లైబ్రరీ, తో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ దిన దిన ప్రవర్ధమాన మవుతూ నేటికి 2000 విద్యార్ధులు, 60 టీచింగ్ స్టాఫ్ మరియు 50 నాన్ టీచింగ్ స్టాఫ్ తో సరస్వతీ నిలయంగా శోభిల్లుతుంది.

అంతే కాదు విద్యార్థులలో నిగూఢమై ఉన్న ప్రతిభా పాటవాలు రచనా నైపుణ్యం వెలికి తీసేందుకు మహారాణీ కళాశాల మాగజైన్ కమిటీ 1967 నుండీ కూడా విశేష కృషి చేస్తుంది తొలుత తెలుగుఆచార్య : డా. పోచిరాజు శేషగిరి రావు గారు గారు ఇంగ్లీష్ఆచార్య : వర్మ గారు హిందీఆచార్య : కె. వీరభద్రరావు గారు స్టూడెంట్ యూనియన్ మెంబర్స్, కల్చలర్ యూనియన్ మెంబర్స్ మ్యాగజైన్ భాద్యతలు నిర్వహించగా తరువాత కాలంలో ఇప్పటి సాహితీ స్రవంతి అధ్యక్షులు మహారాణీ కళాశాల రిటైర్డు తెలుగు విభాగాధిపతి డాక్టర్. జోశ్యుల కృష్ణబాబు గారు మాగజైన్ ఎడిటోరియల్ కమిటీ అధ్యక్షుడు విశిష్టమైన సేవలు అందించారు, ఇప్పుడు గురులింకా ధర్మరాజు గారు తెలుగు విభాగాధిపతిగా మ్యాగజైన్ ఎడిటోరియల్ కమిటీ అధ్యక్షుడు గా సేవలందిస్తున్నారు

ఈ కళాశాలలో చదివి పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఎందరో
నీతి నిజాయితీ కి మారు పేరుగా పిలువబడే రౌతులపూడి రైతుబిడ్డ చదివింది అర్ నారాయణమూర్తి, ఇప్పటి పెద్దాపురం ప్రధమ పౌరులు శ్రీ రాజా సూరిబాబు రాజు గారు డి రామచంద్రరాజు గారు ఐ.పి.ఎస్, గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత తాళాబత్తుల సాయి గారు, ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు గారు, ఎంతో మంది డాక్టర్లు, ఇంంజనీర్లు, పేరుపొందిన అనేక మంది ప్రముఖులు ఈ కళాశాలలో చదివిన వారే ఇక్కడ చదివిన వారు కవులుగా – కళా కారులుగా, క్రీడాకారులుగా, రచయితలుగా, రాజకీయనాయకులుగా సమాజంలోని అన్ని శాఖలోనూ ఉద్యోగాలను అధిరోహించిన వారిలో వున్నారు. పెద్దాపురం లో ఉన్న ఇతర కళాశాలల యాజమాన్యం మరియు అధ్యాపకులు మరియు సిబ్బంది కూడా ఈ కళాశాలలో చదివిన వారే కావడం విశేషం.

జ్ఞానం – విజ్ఞానం, వినోద – విలువలు, నీతి – నిజాయితీ, నిర్భీతి, లాంటి అనేక లక్షణాల సమ్మేళనం ఇక్కడ చదివిన విద్యార్ధుల సొంతం.లక్షల జీతాలకు ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నా మా తల్లి మహారాణి కాలేజీ పై మమకారం చావక తనువు చాలించే వరకూ ఇక్కడే సేవలందించిన మహానుభావులైన మాస్టార్లకు … పి. హెచ్. డి లు (P.H.D) ఎమ్. ఫిల్ M. Fill లు చేసి విద్యార్ధుల అభివృద్దే ధ్యేయంగా నిరంతరం తపిస్తున్న శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దరు మహారాణీ కళాశాల ఆచార్య దేవులకు పాదాభి వందనం తెలియ జేసుకుంటూ మీ వంగలపూడి శివకృష్ణ

 

 

1765total visits,5visits today

4 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *