PALANADU YUDDHAM – PEDDAPURAM

పల్నాటి యుద్ధంలో పెద్దాపురం మూల పురుషులు

పల్నాటి యుద్ధం పేరు చెబితే పిట్టలు కూడా నీళ్లు త్రాగవు అనేది నానుడి… పలనాడు వీరుల చరిత్ర విన్నా చదివిన రోమాలు నిక్కబొడుచుకుంటాయి అనేక మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది ఈ చరిత్ర అందుకే పలనాటి చరిత్రను ఆంధ్ర భారతము అనికూడా అంటారు… చరిత్రలో ఇద్దరు రాజులమధ్య పోరాటం సర్వసాధారణం కానీ ఇద్దరు మంత్రులు బ్రహనాయుడు నాయకురాలు నాగమ్మ మధ్య పోరాటం పలనాటి యుద్ధం ప్రత్యేకత… ఒక వితంతువు అపూర్వ యుద్ధవిద్యలు నేర్చుకుని మహిళా మంత్రి గా నియమింపబడి తన తెలివితేటలతో రాజనీతితో బలవంతమైన సామ్రాజ్యాన్ని ఢీకొనడం… బ్రహ్మ నాయుడి పౌరుష పరాక్రమం … కోడిపందాలు యుద్ధ విద్యలు అన్నీ దేనికవే సాటిగా ఉంటూ మహా భారత యుద్దాన్ని తలపింప చేస్తాయి

పల్నాటి యుద్ధం కాలం విషయం లో భిన్నాభిప్రాయాలు ఉన్నపటికీ చారిత్రిక ఆధారాల అనుగుణంగా పరిశీలనా చేసినపుడు ఇది 12వ శతాబ్దపు చివరిలో అనగా 1178 నుండి 1182 సంవత్సరం మధ్యకాలంలో ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘిక, మతమార్పులకు దోహదం చేసిన కీలక యుద్ధంగా అభివర్ణించవచ్చు. అంతే కాకుండా ఈ యుద్ధం 4 సంవత్సరాల పాటూ కొనసాగడం వాళ్ళ ఆంధ్రదేశంలోని కొన్ని రాజ వంశాలు ఈ యుద్ధంలో పాల్గొన్నట్లుగా పల్నాటి యుద్ధంలో నలగామరాజు తనకు సహాయంగా రమ్మని కొంతమంది రాజులకు లేఖలు వ్రాసినట్లుగా చరిత్ర పుస్తకాల ద్వారా తెలుస్తుంది… అందులో భాగంగానే పెద్దాపురం సంస్థానానికి మూల పురుషుడైన సాగి పోతరాజుకి కూడా లేక వ్రాసినట్టు క్రీస్తుశకం 1178 నుండి 1182 వరకూ జరిగిన అరివీర భయంకర పలనాటి యుద్దంలో నలగామ రాజునకు సహాయం గా తన సైన్యంతో వచ్చి అద్భుత మైన పోరాట పటిమ కనబరిచినట్ట్లుగా చెన్నై లోని లిఖిత పుస్తక భాండాగారం లోని పలనాటి వీర చరిత్రము అను గ్రంధం లోని 168 వ పేజీ ద్వారా తెలుస్తుంది

“సాగి పోతమరాజు సత్యాఖ్యప్రెగ్గడ
గుండమదేవుడు గొబ్బూరి రాజు
మొదలయిన వారల ముఖ్యులౌ బంట్లు
————– నెనుబది మీద
నెనిమిది వేలతో నే తెంచి రపుడు “

అలాగే గుడిమెట్ల సాగి పోతరాజు గారు గురించి వీరి వంశము గురించి శ్రీ చిలుకూరి వీరబద్ర రావు పంతులు గారు తను రచించిన ఆంధ్రుల చరిత్ర ద్వితీయ బాగంలో 253, 254, 255 పేజీ లలో వివరించడం… ఇదే విషయాన్ని వత్సవాయి రాయజగపతి వర్మ గారు రచించిన పెద్దాపుర సంస్థాన చరిత్రము లో ప్రస్తావించడం జరిగింది

పలనాటి యుద్ధంలో పెద్దాపురం మూల పురుషుల పాత్ర స్వల్పమే అయినప్పటికీ… చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన యుద్ధంలో వారి పాత్ర ఉండటం వాళ్ళ పెద్దాపురం మూల పురుషుల చారిత్రిక ప్రాశస్త్యాన్ని అర్ధం చేసుకోవడానికి దోహదపడుతుంది

1161total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *