Peddapuram Chanthaadu History

“పెద్దాపురం చాంతాడంత” సామెత ఎప్పుడైనా విన్నారా …?

 

మన పూర్వీకుల నోటినుండి సందర్భానుసారంగా వెలువడిన వాక్యాలే సామెతలు, మన చేనేతను అనుసరించే “తెగే వరకూ లాగొద్దు” వంటి సామెతలు వెలువడ్డాయనే నానుడి ప్రజల్లో ఉంది. ఇలా ఆలోచించి చూస్తే ప్రతీ సామెత వెనుక ఒక చిన్ని కథ ఖచ్చితంగా ఉంటుంది. “పెద్దాపురం చాంతాడంత” సామెతకి కూడా అలాంటిదే చిన్న కథ ఉంది …!

సాధారణముగా మన ఆంధ్రరాష్ట్రం లో “కొండవీటి చాంతాడంత” అనే నానుడి ఎక్కువ ప్రచారం లో ఉంది. అయితే మన ఉభయ గోదావరి జిల్లావాసుల్లో అడపాదడపా ఎక్కడైనా పెద్దక్యూ ఉన్నప్పుడు లేదా ఏదైనా విషయంపై వివరణ పెద్దయినప్పుడు ఎదుటివారిని వారించేందుకు “పెద్దాపురం చాంతాడంత” స్టోరీ చెప్పకురా బాబు అంటూ వుంటారు.

దీని వెనుక ప్రచారం లో వున్న చిన్న కధ

ఒకానొకప్పుడు పెద్దాపురం లో తాళ్ల వ్యాపారం మంచి జోరు మీద ఉండేది. రాష్ట్రం లోని మారుమూల ప్రాంతాలనుండి అనేక మంది వ్యాపారులు, పెద్దాపురం వచ్చి తాళ్లు కొనుగోలు చేసి వారి వారి ప్రాంతాలకి ఎద్దుల బండ్లపై తీసుకుని పోయేవారు, ఒకనాడు తాళ్ల తిరుపతయ్యగా పిలువబడే ఒక ఆడంబరుడైన వ్యాపారి పెద్దాపురం కాపుగంటి పరమయ్య గారి తాళ్ల కొట్టుకి వచ్చాడంట ఎప్పటిలానే అనేక ప్రాంతాలనుంచి వినియోగదారులతో ఆ తాళ్లకొట్టు కిక్కిరిసి పోయి ఉందంట, క్షణం తీరికలేకుండా ఉన్న తాళ్లకొట్టు యజమాని పరమయ్య ని ఉద్దేశించి “ఏవోయ్ మీ కొట్లో కెల్లా అతి పొడవైన తాడు ఒక పది (10) బారలుంటుందా..?” అన్నాడట వ్యగ్యంగా..

దానికి పరమయ్య గారు సమాధానమిస్తూ అయ్యా మా షాపులోకెల్లా అతిచిన్న తాడు ఇదిగో అంటూ ఒక కొస అతని చేతికిచ్చి దీని రెండవ కొస ఎక్కడుందో మీరు మీ పరివారమంతా కనిపెట్టి దీన్ని ఉచితంగా తీసుకుని పోవచ్చు అని సమాధాన మిచ్చాడంట, తిరుపతయ్య గారి ఆజ్ఞమేరకు అతని పరివారం రంగంలోకి దిగి ప్రయత్నిచారంట ఆ చాంతాడు యొక్క పొడవు చూసి ఆశ్చర్య పోయిన తిరుపతయ్య పరివారాన్ని వారించి పరమయ్య గారిని అభినందిస్తూ “ద్రౌపతి చీరెంతో … పెద్దాపురం చాంతాడంత” అంటూ పెద్దగా నవ్వేసి పలాయనం చిత్తగించాడంట అప్పటినుండీ పెద్దాపురం పరిసర ప్రాంతాలే కాక రాష్ట్రం లోని అనేక చోట్ల అప్పుడప్పుడూ పెద్దాపురం చాంతాడంత అనే జనాంతిక కూడా బాగా విన్పిస్తూ ఉంటుంది. @వంగలపూడి శివకృష్ణ

మనవి: (ఇది నిజంగా జరిగిందే అయితే పేర్ల విషయం లో స్పష్టత లేదు… ఈ కథ మా పాత పెద్దాపురంలో పూర్వీకుల ద్వారా మాకు తెలిసింది. అయితే వారిలో వారికే వ్యాపారుల పేరు విషయం లో స్పష్టత లేదు.)

832total visits,2visits today

One Comment

Leave a Reply to M V Satyanarayana Cancel reply

Your email address will not be published. Required fields are marked *