PEDDAPURAM GREATNESS

పాండవులు నడయాడిన పుణ్యక్షేత్రం
బౌద్ధం విలసిల్లిన ధర్మ క్షేత్రం

వేల సంవత్సరాల పురాతన చరిత్ర
వందల సంవత్సరాల రాజరిక చరిత్ర

రాష్ట్రంలోనే రెండవ మున్సిపాలిటీ
మొట్టమొదటి మునసీబు కోర్టు
సైనిక శిక్షణా స్థావరం

భర్తృ హరి సుభాషితాలు తెలుగులో అనువదించి భారత దేశంలో పేరు గాంచిన మహాకవి ఏనుగు లక్ష్మణకవి పుట్టిన భూమి

ఆరుగజాల చీరను అగ్గిపెట్టిలో అమర్చి పెట్టి విదేశీయులను సైతం అబ్బురపరిచి 1924 లండన్ లో జరిగిన వెంబ్లీ చేనేత ఎక్షిబిషన్ లో మరియు 1937 లక్నో లో జరిగిన చేనేత ప్రదర్శన లో బంగారు పథకాలు సాధించి మహాత్మా గాంధీ గారిచే స్వదేశీ సిల్కు అని నామకరణం చేయించు కున్నా సువర్ణ చరిత్ర గల నైపుణ్యాల నేల

పెన్సిల్ ముల్లుపై ప్రపంచాన్ని ఆవిష్కరించి సూక్ష్మ కళాఖండాల సృజనద్వారా జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధించిన తాళాబత్తుల సాయి గారి వంటి స్వర్ణకళాకారుల నిలయం

బుర్రకథ, హరికథ, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట, గొల్లసుద్దులు, పల్లె సుద్దులు, పులివేశం వంటి అనేక కళారూపాలకు కళాకారులకు నెలవు

మహానటులు సినిమా సీతమ్మ తల్లి అంజలీదేవి, డబ్బింగ్ జానకి, మరియు తెలుగు కనకం, ఈశ్వరీ రావు, గోకిన రామారావు, మేడిశెట్టి అప్పారావుల స్వస్థలం ఆర్. నారాయణ మూర్తి విద్యాస్థలం విశాఖ పూర్ణా థియేటర్ అధినేత సినీ నిర్మాత గ్రంథి మంగరాజు గారి స్వస్థలం

9 సార్లు టెన్నిస్ ప్రపంచ ( గ్రాండ్ స్లాం ) విజేతగా నిలిచిన మహేష్ భూపతి ఊరు

విప్లవవీరులు అల్లూరి_సీతారామరాజు నడయాడిన నేల

స్వాతంత్ర సమరయోధులు : మద్దూరి అన్న పూర్ణయ్య, చిలుకూరి అప్పారావు, వెంపటి బ్రహ్మయ్య, కేశవరపు కామరాజు, దూర్వాసుల వెంకట సుబ్బారావు, స్వామినేని ముద్దు నరసింహం, శంకర భయంకరాచారి, బారు రాజారావు, బొమ్మన బసవరాజు, విశాఖ గాంధీగా పేరుగాంచిన కొల్లూరి సత్యనారాయణ వంటి వారితో పాటూ వీర వనితలు పెద్దాడ కామేశ్వరమ్మ, మద్దూరి వెంకట రమణమ్మ లు మెట్టిన పోరాటాల గడ్డ ఇలాంటి 12 మంది స్వాతంత్ర సమరయోధు రాళ్ళ విగ్రహాలను రాజమహేంద్ర వరం లో వారి జీవిత చరిత్ర లతో కూడిన విగ్రహాలు ఏర్పాటు చేసిన యాతగిరి శ్రీరామ నర్సింహారావు గారు పుట్టిన ఊరు

జాతీయ అవార్దు గ్రహీతలు : విస్సా అప్పారావు , రాజకీయ ఆర్ధిక వేత్త బావరాజు సర్వేశ్వరరావు, సామాజిక వేత్త టేకు రాజగోపాలరావు, ప్రముఖ చరిత్ర పరిశోధకులు రాజమహేంద్రవరం లో చారిత్రిక మ్యూజియం వ్యవస్థాపకులు శ్రీ రాళ్లబండి సూర్యారావు గారి జన్మస్ధలం

ప్రసిద్ధ కథారచయితలు : బుధవరపు పట్టాభిరామయ్య, చిన కామరాజు, పింగళి వెంకట రమణ రావు, దార్ల తిరుపతిరావు, సి. రామచంద్రరావు లు ఈ ఊరి వారు

ప్రసిద్ధ మృదంగం విద్వాంసులు ముళ్లపూడి శ్రీరామమూర్తి గారు చిత్రలేఖనం కళాకారులు సింగంపల్లి సత్యనారాయణ గార్లు ఈ ఊరి వారే

అలాగే ఎందరో కవులు, కళాకారులు, క్రీడాకారులు, మేధావులు, స్వాతంత్ర సమరయోధులు, జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీతలు పుట్టిన ప్రదేశంలో జన్మించడం మన అదృష్టం

601total visits,2visits today

2 Comments

Leave a Reply to Vissa Appa Rao (Junior) Cancel reply

Your email address will not be published. Required fields are marked *