Peddapuram Incident – London Parliament
Rare Collection of పెద్దాపురం ఘటన
లండన్ న్యూస్ పేపర్ (The Guardian)
స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించాలనే విషయం చర్చించుకోవడానికి వత్సవాయి జగపతి వర్మ గారు ఆతిధేయిగా పెద్దాడ కామేశ్వరమ్మ గారు ఏర్పాటు చేసిన కూటమి 1930 డిసెంబరు 16 న సమావేశమయ్యింది…
ధనుర్మాస వనభోజనాల పేరిట పెద్దాపురం పట్టణంలో 80 మంది వరకు పెద్దలు, యువకులు, పెద్దాపురం పుర ప్రముఖులు బొక్కా నారాయణమూర్తి గారి తోటలోకి చేరుకున్నారు… క్రొవ్విడి లింగరాజు, దువ్వూరి సుబ్బమ్మ, పెద్దాడ నారాయణమ్మ అక్కడ చేరిన ప్రముఖుల్లో కొందరు. మహాత్మా గాంధీజీ గారి శాసనోల్లంఘన ఉద్యమ పిలుపు మేరకు స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించాలనేది కూడా వారు చర్చించబోతున్నారు.
ఈ సమాచారం ఎలాగో తెలిసికొన్న అప్పటి సర్కిలు ఇన్స్పెక్టరు డప్పుల సుబ్బారావు గారు తన పోలీసు బలగంతో అక్కడికి చేరుకున్నాడు. పోలీసు బలగం వనభోజనార్థుల చుట్టూ వలయంగా చేరింది, సర్కిలు ఇన్స్పెక్టరు డప్పుల సుబ్బారావు కూటమిగా ఏర్పడిన వారిని వెళ్లిపొమ్మని హెచ్చరిక చేసాడు. జారీ చేసిన వెనువెంటనే కనీసం వాళ్ళకు చెదిరిపోయే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే లాఠీచార్జి చేయించాడు. పోలీసు బలగం స్ర్తీలందరినీ ఒకవైపుకు నెట్టివేశారు. స్వాతంత్య్రో ద్యమానికి సహాయపడుతున్న యువకులుగా గుర్తింపు పొందిన వారిని పోలీసులు ఎక్కువగా కొట్టారు. కొందరు యువకులు తప్పించుకొని తోటలో జరిగిన హింసాకాండ గురించి ఊరిప్రజలకు తెలిపారు.
వెంటనే ఊరి జనం తోటవైపు పరుగులు తీశారు… డాక్టర్లు, మందుల పెట్టెలతో సహా వచ్చారు. కానీ పోలీసులు ఆ మందుల పెట్టెను నేలపాలు చేసి డాక్టర్లను సైతం లాఠీలతో కొట్టారు. పెద్దాపురం లాఠీఛార్జి వార్త దేశమంతా వ్యాప్తి చెందింది పెద్దాపురం లాఠీ ఛార్జ్ పోలీసుల దాష్టీకానికి ప్రత్యక్ష ఉదాహరణగా భావిస్తూ ఈ ప్రస్తావన లండన్ పార్లమెంట్లో వచ్చింది… భారతీయ జాతీయ కాంగ్రెస్ పిర్యాదు మేరకు బ్రిటీషు ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది… దాదాపు 3 నెలల కాలం మద్రాసు కోర్టులో సుదీర్ఘమైన విచారణ తరువాత సర్కిలు ఇన్స్పెక్టరు డప్పుల సుబ్బారావు ఉద్రేక పూరితంగా లాఠీ ఛార్జ్ చేసినందున… శాంతియుత సమావేశాలు నిర్వహించుకునే వారిపై పోలీసు చర్య చట్ట విరుద్ధం కావున సర్కిలు ఇన్స్పెక్టరు డప్పుల సుబ్బారావుని 19 మార్చ్ 1931 న విధులనుండి బహిష్కరిస్తూ తీర్పు వెలువరించింది
అయినప్పటికీ 1931 మార్చి 30 న వాడపల్లిలో పోలీసు కాల్పులు జరిగాయి. 1932 జనవరి 19న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమంలో విచ్చల విడిగా లాఠీ ఛార్జ్ చేశారు… పెద్దాపురం, వాడపల్లి, సీతానగరం దుశ్చర్యలకు కారణమైన డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ పై పగ తీర్చుకోవాలని సామర్లకోటకు చెందిన ప్రతివాది భయంకరాచారి నిశ్చయించుకున్నాడు కామేశ్వర శాస్త్రి సహాయంతో కాకినాడలో బాంబు పేలుద్దామని అనుకున్నాడు… కొన్ని కారణాల వల్ల బాంబు మిస్ ఫైర్ అయ్యి తొమ్మిది మంది గాయపడ్డారు… ఆ ఘటనకు కాకినాడ ఘటన గా పేరు కొన్నాళ్ళకి భయంకరాచారి అరెస్టయ్యాడు… ఇలా స్వాతంత్ర పోరాటంలో పెద్దాపురం ఘటన సామర్లకోట భయంకరాచారి తెగువ సుస్థిరమయ్యాయి @వంగలపూడి శివకృష్ణ
1290total visits,4visits today