Peddapuram King Gift to Victoria Maha rani

పెద్దాపురం మహారాజు లోహపు సైన్యం – విక్టోరియా మహారాణికి కానుక

పెద్దాపురం సంస్థానం 1760 నుండి 1797 వరకూ పరిపాలించిన రాజా వత్సవాయ విద్వత్ తిమ్మ జగపతి గారికి శత్రువుల ముట్టడి ఎక్కువగా ఉండేది ఒకవైపు బ్రిటీషు వారు, ఇంకో వైపు మన్నెం బందిపోట్లు, మరో వైపు తురుష్కులు, వీటితో పాటూ రాజ్యంలో అంతర్గత కలహాలు, ఇరుగు పొరుగు సంస్థానాలతో ఇక్కట్లు… అధికంగా ఉండేవి సంస్థానంలో రక్తపాతం లేని రోజు ఉండేది కాదు…. ఇవన్నీ తట్టుకుని నిలబడి సమస్యలన్నిటినీ అధిగమించే మానసిక సామర్ద్యంకోసం రాజా వారి ఆస్థాన పురోహితులు ఒక సూచన చేశారు… పెద్దాపురం రాజ్యంలో ఉన్న సైనిక సంపత్తిని, రాజ్యంతో కలిసి రాగల విదేశీ మరియు స్వదేశీ మిత్ర సైనిక సంపత్తి తో కూడిన నమూనా సైన్యాన్ని తయారు చేసి ప్రతీ రోజూ దాన్ని ఉదయాన్నే చూడమని సలహా ఇచ్చారు –

విద్వత్ తిమ్మ జగపతి గారి కాలానికి పెద్దాపురం సంస్థానంలో ఇత్తడి, కాంస్య, పంచ లోహ విగ్రహాలు తయారీ పరిశ్రమ ఒక వెలుగు వెలుగుతుంది దేశం నలుమూలకు పెద్దాపురం నుండి కాంస్య విగ్రహాలు తరలి వెళ్ళేవి…. రాజు గారికి ఆస్థాన పండితుల మరియు వాస్తునిపుణుల సూచనల మేరకు మహా రాజు గారు అప్పటి ఆస్థాన స్వర్ణకారులైన ఆదిమూర్తి సోదరులు మరియు విరాచంద్రాచార్యుల వారిని పిలిపించి అశ్వ, గజ, రథ, ఖురిత, కాల్బల సైనిక దళం యొక్క లోహపు నమూనాలను తయారుచేయించి వారి మందిరంలో ఉంచారు… తదుపరి విద్వత్ తిమ్మ జగపతి గారి పాలన వీరోచితంగా సాగింది…. వారి అనంతరం పెద్దాపురం సంస్థానంను వత్సవాయ రాయ జగపతి మహారాజ బహద్దరు గారు 1797 వ సంవత్సరం నుండీ 1804 వరకూ పరిపాలన చేశారు అనంతరం పెద్దాపురం సంస్థానంలో వరుసగా ముగ్గురు మహారాణుల పాలన 1839 వరకూ జరిగింది… అనంతరం వత్సవాయి సూర్యనారాయణ జగపతి గారి పాలన 1839 నుండీ 1847 వరకూ జరిగింది… సంస్థానం ను తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్వాధీన పరుచుకున్నారు తరువాత కొంత కాలానికి పెద్దాపురం కోట వేలాం పాటకు పోయింది @వంగలపూడి శివకృష్ణ

ఆ తరువాత కాలంలో భారతదేశపు వివిధ సంస్థానాల మహారాజులతో క్వీన్ విక్టోరియా మహారాణి సంబంధాలను మెరుగుపరిచేందుకు మహారాణి గారి కుమారుడు ( కింగ్ ఎడ్వర్డ్ \/// ) ప్రిన్స్ అఫ్ వేల్స్ భారతదేశం సందర్శించారు

అక్టోబరు 1875 లో ప్రిన్స్ అఫ్ వేల్స్ నాలుగు నెలలు పాటూ సాగించిన భారతదేశ పర్యటనలో భాగంగా 21 ప్రాంతాలు సందర్శించారు, భారతదేశంతో పాటూ, శ్రీలంక, పాకిస్తాన్ మరియు నేపాల్లను కూడా పర్యటించి దాదాపు 90 కన్నా ఎక్కువ మంది పాలకులను ఆయన సందర్శించి తన తల్లి క్వీన్ విక్టోరియా భారతదేశం యొక్క రాణిగా ప్రకటించబడనున్నందున తన ముందస్తు పర్యటన స్థానిక పాలకులతో వ్యక్తిగత సంబంధాలను స్థాపించటానికి అలాగే ఉపఖండపు రాజులతో బ్రిటీషు వారి మధ్య సత్సంబంధాలు బలోపేతం చేయడానికి కృషిచేశారు

ఆ సందర్భంలో కింగ్ ఎడ్వర్డ్ \/// మద్రాస్ కి వచ్చినపుడు భారత సంస్థానాల మహారాజులు అపురూప కానుకలు సమర్పించి క్వీన్ విక్టోరియా మహారాణికి తమ తరపున అందజేయమన్నారు, అందులో పెద్దాపురం మహారాజ కుటుంబీకుల “సైనిక వ్యక్తుల సమితి” ప్రధాన ఆకర్షణ దీనిని పెద్దాపురం ఇనాం దారుడు అయిన జి ఎల్ నరసింగ రావు ఎడ్వర్డ్ \/// కి స్వయంగా అందజేశారు –

భారతదేశం నుండి సేకరించిన ఇలాంటి అపురూప కళాఖండాలను చాలా కాలం తరువాత రాయల్ కలెక్షన్ ట్రస్ట్ వారు 2017 వ సంవత్సరం నుండీ దేశ విదేశాలలో ప్రదర్శనకు ఉంచుతున్నారు 1 మార్చి 2017 – 18 జూన్ 2017 న కార్ట్ రైట్ హాల్, బ్రాడ్ ఫోర్డ్ లో ప్రదర్శనకి మంచి స్పందన రావడంతో 8 జులై 2017 – 29 అక్టోబర్, 2017న న్యూ వాక్ మ్యూజియం & ఆర్ట్ గ్యాలరీ, లీసెస్టర్, లో వాటిని ప్రదర్శించారు, ఇప్పుడు క్వీన్స్ గ్యాలరీ ఈడెన్ బర్గ్ లండన్ లో 15 డిసెంబరు 2017 – 22 ఏప్రియల్ 2018 వరకూ ప్రదర్శన జరిగింది… @వంగలపూడి శివకృష్ణ

590total visits,2visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *