Peddapuram Muttadi

పెద్దాపురం ముట్టడి

పెద్దాపురం ముట్టడి అనే కధని బుదరాజు పట్టాభిరామయ్య గారు రచించారు

పెద్దాపురం సంస్థానంలో దాదాపు 300 ఏళ్ళు వత్సవాయ క్షత్రియ వంశస్థుల పాలన నడిచింది ఈ వంశానికి చెందిన శ్రీ రాజా వత్సవాయ ఉద్దండ రాయ జగపతి మహారాజు గారు 1688 నుండి 1714 వ సంవత్సరం వరకూ పాలించి మరణించిన తరువాత రాజుగారి భార్య రాగమ్మ గారు వారివురి ప్రధమకుమారుడైన  కళాతిమ్మ జగపతిపేర 1734 వరకూ పరిపాలన చేసారు. ఆతరువాత రుస్తుంఖాన్  పెద్దాపురం సంస్థానాన్ని ఆక్రమించి దాదాపు 20 సంవత్సరాల పైన పాలిచడం జరిగింది. రుస్తుంఖాన్ పెద్దాపురం సంస్థానాన్ని సంపాదించడానికి పన్నిన పన్నాగం, చేసిన నమ్మక ద్రోహం, దుస్తంత్రం, కుట్ర కుతంత్రాలతో పెద్దాపురం యువరాజులను చంపించిన రుస్తుంఖాన్ క్రౌరం. రాజాంతఃపుర స్త్రీలు తమ ప్రాణాలు తామే తీసుకోవాల్సీ వచ్చిన వైనం. ఇంతటి సంక్షోభం విశాదం నుండి సంస్థాన వారసుణ్ణి తెలివిగా తప్పించి పెద్దాపురం సంస్థానానికి రాజబంధువులైన, విజయనగర పరిపాలకులు పూసపాటి వారింటికి తరలించిన విధానం. తెలుసుకోవాలంటే ఈ పూర్తి కధ చదవాల్సిందే … !

రుస్తుం ఖాన్ అలియాస్ హాజీ హుస్సేన్  మరియు ఇతను కుమారుడు నూరుద్దీన్ హుస్సేన్ ఇది వరకూ పెద్దాపురం రాజా వారి కొలువులో కొంత కాలం పనిచేసారు.
ఆ తరువాత మొగలులు పరిపాలించిన కాలంలో దక్కను సుభాలు (దక్షిణ సంస్థానాలు) లోని ఇరవై రెండు పరగణాలలో రాజమండ్రి ఒకటి.

ఔరంగజేబు మరణించిన తరువాత మొగలు పాదుషా లకు సుబేదారుగా ఉన్న కమురుద్ధీన్ ఆసఫ్ జా స్వతంత్రుడయ్యేను. ” రాజమండ్రికి రుస్తుంఖాన్ అని పిలువబడే హాజీ హుస్సేన్ క్రీశ 1734 లో సుబేదారు  ఫౌజుదారు ప్రతినిది గా ఉండెను జమిందారులనుండి శిస్తు వసూలు చేయడం రుస్తుం ఖాన్ పని.

రుస్తుం ఖాన్ చాలా క్రూరుడు, ఇతని క్రూరత్వం జమిందారులందరికీ ఆటంకముగా భరించలేని విదంగా వుండేది.

మొగల్తూరుకి చెందిన కలిదిండి రామరాజు, నూజివీడు కి చెందిన సుబ్బన్న మొదలగు జమిందారులు రుస్తుం ఖాన్ పై తిరగబడి రెండు సార్లు యుద్దము చేసి ఓడి పోయారు. ఇక రుస్తుం ఖాన్ పోరు పడలేక వీరిద్దరూ వారి వారి సంస్థానాలను వదిలి పెట్టి పెద్దాపురం వారి సంస్థానమును ఆశ్రయించారట.

(పెద్దాపురము సంస్థానము వారు వీరిద్దరికీ సైన్య సహకారం చేసిరి) పెద్దాపురం వారి  సేనల సహకారంతో వీరు రుస్తుం ఖాన్ ను ఎదిరించి ఓడిపొయారు. ఆ తరువాత పిఠాపురం వేంకట కృష్ణారావు గారి సహాయము కోరి రుస్తుంఖాన్ ను ఎదురించుటకు వ్యూహాలు పన్ను తుండగా ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న రుస్తుం ఖాన్ వీరిపై అకస్మాత్తుగా దండెత్తి వీరి ముగ్గురు నీ ఓడించి తోటపల్లి మన్యాలు (అడవులు) పట్టించెను.

అదే సమయంలో  1688 నుండి 1714 వరకూ పెద్దాపురం సంస్థానాన్ని ఉద్దండ రాయ జగపతి గారు విజయవంతం గా పరిపాలించి 1714 లో మరణించడం తో వీరి యొక్క ముగ్గురు కుమారులు తిమ్మజగపతి, బలభద్రక్షితిపతి, సూరనృపతి, మైనరులే అయినందువల్ల అతని భార్య రాగమ్మ గారు  పెద్దకుమారుడి పేర తనే రాజ్య పాలన తీసుకుంది రాగమ్మ గారు గొట్టుముక్కల వారి ఆడపడుచు ఈమె పాలన ఇంచుమించు ఇరవై సంవత్సరాలు సాగింది.

తరచూ రుస్తుం ఖాన్ కుమారుడు నూరుద్ధీన్ ఖాన్ – రాఘవమ్మ గారి యొక్క ముగ్గురు కుమారులని కలిసే వారు .. అతను వీరికి మొగలులు వారి పాలనా విధానాలు వారు అనుభవించే భోగ భాగ్యాల గురించి వివరిస్తూ ఉండేవాడు. కళాతిమ్మ జగపతి, బలభద్రక్షితిపతి, సూరనృపతి… అతని మాటలకు ఆకర్షితులయ్యేవారు ….

ఒక రోజు రుస్తుం ఖాన్ పెద్దాపురం వచ్చి పాండవుల మెట్ట దగ్గర వేచి వున్నాడు.   పెద్దాపురం  ప్రభువులతో సంస్థానానికి సంబందించిన విషయాలు మాట్లాడాలని పెద్దాపురం ప్రభువులను వచ్చి కలవాల్సింది గా విన్నవించు కొంటూ తిమ్మజగపతి రాజు పేర రాజ్య పరిపాలన చేస్తున్న రాఘవమ్మ గారికి కబురు పంపించాడు. అప్పటికే ఆ ప్రాంతం లో రుస్తుం ఖాన్ బలగాలు మొహరించి ఉన్నాయి… రుస్తుంఖాన్ గురించి తెలిసిన రాగమ్మ గారు రాజకుమారులను పంపించడానికి ఒప్పుకోలేదు…

రుస్తుంఖాన్ తన కుమారుడు నూరుద్ధీన్ ఖాన్ ని పంపి రాగమ్మ గారిని ఒప్పించి రాజకుమారులను తనవద్దకి తీసుకురమ్మంటాడు రుస్తుంఖాన్ కపటోపాయం తెలియని నూరుద్ధీన్ ఖాన్ తంండ్రి చెప్పిన విధంగానేే రాగమ్మ గారిని , బలభద్రక్షితిపతి, సూరనృపతి లు మామూలుగానే ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అదే సమయం లో రుస్తుం ఖాన్ సేనలు వీరిని చుట్టుముట్టి దాడి చేయగా పెద్ద కుమారుడు శ్రీ తిమ్మజగపతి రాజు గారు ఎంత ఒంటరి పోరాటం చేసినా రుస్తుం ఖాన్ చేతిలో మరణించక తప్పలేదు.

తిమ్మజగపతి భార్య విజయనగర మహారాజు విజయరామరాజు పట్టపహిషి అయిన చంద్రయ్యమ్మకు మేనకోడలు. వేగులు (గూఢచారుల) ద్వారా తిమ్మజగపతి మరణించిన సమాచారం తెలుసుకున్న రాఘవమ్మ గారు అప్పటికి ఏడాది వయస్సున్న తిమ్మజగపతి కుమారుడు  గజపతిని విజయనగరానికి పంపించే ఏర్పాట్లు చేసి  కోట ద్వారాలను మూయించారు. అంతఃపుర స్త్రీలందరూ  ఒకే గదిలో ఉండగా పెద్దాపురం సంస్థాన అంతఃపురానికి  నమ్మకమైన సేవకుడైన చల్లా పెద్ద చేత కోటకి నిప్పు అంటించమని అజ్ఞాపించారు. ఆ మంటలలో అంతపుర స్త్రీలతో పాటూ రాఘవమ్మ గారు తిమ్మజగపతి రాజు గారి భార్య అగ్నిప్రవేశం చేసారు.

తిమ్మజగపతి రాజు గారి కుమారుడు ఏడాది బాలుడైన గజపతిని విజయనగరానికి పంపించే మార్గమధ్యలో చేబ్రోలు వద్ద బాలుడు గజపతిని రుస్తుంఖాన్ పట్టుకొని కారాగారంలో బంధించాడు.

ఆ విధంగా రుస్తుంఖాన్ పెద్దాపురం సంస్థానాన్ని ఆక్రమించుకొని పెద్దాపురం ప్రజలపట్ల, జమిందారుల పట్ల కఠినంగా ప్రవర్తిచే వాడు …  పెద్దాపురం వారి పట్ల రుస్తుం ఖాన్ ప్రదర్శించిన ద్రోహ బుద్ధి అతని కొడుకు నూరుద్దీన్  కి నచ్చక పోవడంతో అదే ఏడాది  పిఠాపురం వద్ద తండ్రిని చంపి అప్పటి సర్లష్కర్ అయిన అన్వరుద్ధీన్ అనుమతితో రాజమండ్రి కి రుస్తుం ఖాన్ కి బదులుగా జిల్లా దారుడయ్యేను.

ఆ తరువాత నూరుద్దీన్ హుస్సేన్ తో రాజ్యం విషయంగా రాజీ కోసం విజయనగర మహారాజు విజయరామరాజు మాట్లాడినా ఫలితం లేకపోయింది. పైగా అధికార దాహంతో పూసపాటివారి కళింగ రాజ్యాన్ని (విజయనగర సామ్రాజ్యం)  వశపరచుకోవడానికి సైన్యంతో బయలుదేరాడు. చెరలో ఉన్న బాలుడు గజపతిని రక్షించేందుకు విజయరామరాజు 40 వేల మంది సైనికులతో పయనమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తాలూకాలో ఉన్న చేబ్రోలు వద్ద 1734 లో మహా సంగ్రామం జరిగింది. అనకాపల్లి జమీందారు గోపాలరాజు పాయకరావు బోయల సైన్యంతో తోడ్పడ్డారు. ఏనుగుపై ఉన్న నూరుద్దీన్ హుస్సేన్ను బోయలు చుట్టుముట్టి శిరచ్ఛేదం చేశారు. చేబ్రోలు యుద్ధంలో విజయం సాధించిన విజయరామరాజు పెద్దాపురం సంస్థానానికి ఆశాజ్యోతి అయిన గజపతిని చెర నుంచి విడిపించి విజయనగరానికి తీసుకెళ్లారు. ఆనందగజపతితో పాటు బాలుడు గజపతిని చంద్రయ్యమ్మ పెంచారు.పెద్దాపురం సంస్థానం పదిహేనేళ్లపాటు పెద్దాపురం సంస్థానం పదిహేనేళ్లపాటు మహమ్మదీయుల పరిపాలనలో ఉంది. ఆ తర్వాత ఆమీన్గా ఉన్న నీమత్ ఆలీతో విజయరామగజపతి ఒప్పందం కుదుర్చుకొని ఆ సంస్థానాన్ని రాబట్టుకున్నారు. పదహారేళ్ల ప్రాయంలో వత్సవాయ జగపతిరాజు పెద్దాపురం పీఠాన్ని అధిరోహించారు. @వంగలపూడి శివకృష్ణ

4697total visits,1visits today

9 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *