Paradesamma Temple History, Peddapuram

 

పెద్దాపురం పరదేశమ్మ అమ్మవారు

దండకం :
పరదేశమ్మ! తల్లి !
కరుణను బ్రసరింపజేసి , కలకె లవల్మన్
మురువుగ బ్రోవుము తప్పక
కరయుగ్మము మోడ్చి నీదుకడగల భక్తున్ ( రచన : అల్లం రాజు లక్ష్మీ పతి గారు)

పరదేశమ్మ అమ్మవారి ఆలయం చరిత్ర

1840 వ సంవత్సరంలో పెద్దాపురం వాస్తవ్యులు, అగ్నికుల క్షత్రియులు అయిన పెనుపోతుల గుర్రయ్యగారు అతని మిత్రులు సముద్రపు వేటకి వెళ్ళినపుడు తుపాను వలన వారి బోటు తిరగబడి పోయింది. సముద్రంలో చిక్కుకున్న గుర్రయ్య గారు అతని మిత్ర బృందం రెండు దుంగల సహాయంతో ఒడ్డుకు చేరడం జరిగింది. చూడడానికి ఆ దుంగలు చాలా చిన్నవి, అయినా చాలా బరువుగా ఉన్నందున ఆశ్చర్యంగా ఆ కొయ్య ప్రతిమలనే చూస్తుండగా హఠాత్తుగా సముద్రం లోపల నుండి “నేను పరదేశమ్మ అమ్మవారిని ఈ రెండు కొయ్య ప్రతిమలను తీసుకుని వెళ్ళి పూజించుకో” అనే మాటలు వినబడినవి. వారి ప్రాణాలను కాపాడిన కొయ్య ప్రతిమలను పెద్దాపురంలో ఉన్న తన నివాశానికి తీసుకుపోయి తన నివాశ స్ధలంలోనే పందిరి వేసి ప్రతిష్టించి పూజించడం మొదలు పెట్టారు. ఆ తరువాత కాలంలో శ్రీ పరదేశమ్మ అమ్మవారి నిలువెత్తు విగ్రహన్ని 1972 లో పాత పెద్దాపురం వాస్తవ్యుడు కీ. శే బుడత సూర్యారావు గారు తయారు చేసారు. చిన్న పిల్లలు ఆ అమ్మవారి ఉగ్రరూప విగ్రహాన్ని చూసి భయపడుతుండటంతో విగ్రహాన్ని కూర్చుని ఉండేటట్టు మార్చడం జరిగింది. ఈ అమ్మవారి విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తులో ఉండి సర్వాలంకార భూషితయై మెరిసిపోతూ ఉంటుంది.

పూజా కార్యక్రమాలు / జాతర
ప్రతీ సంవత్సరం శ్రావణ శుద్ధ విదియ నాడు ప్రారంభమై శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకూ 15 రోజులు పరదేశమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. శ్రావణ శుద్ధ విదియ నాడు కొయ్య ప్రతిమలను ఊరేగింపుగా శివాలయం మీదుగా మెయిన్ రోడ్ అంతా తిప్పి తిరిగి గుడి వద్దకి తీసుకువచ్చి పోతురాజు స్వామి దగ్గర ఉంచుతారు అమ్మవారికి ప్రీతి కరమైన 3 మరియు 5వ రోజులలో అమ్మ వారి ప్రతి రూపాలైన ఆ కొయ్యలకు పంచామృతాలతో అభిషేకం చేసి మళ్ళీ ఆలయంలో నిలిపేస్తారు. శ్రావణ శుక్రవారం నాడు కుంకుమ పూజ ఉంటుంది. పెద్దాపురం పరిసర ప్రాంతాల భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు రోజు లేదా నైవేద్యానికి వీలుగా ఉండే రోజు జాతర నిర్వహిస్తారు. వంగలపూడి శివకృష్ణ

 

1363total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *