Peddapuram Peerla Panduga

పెద్దాపురం : పీర్ల పండుగ (మొహర్రం)

 

 

 

 

 

 

 

హాసేను… హుస్సేను … అన్నదమ్ముళ్లు
హిందూ.. ముస్లింలంతా.. అన్నదమ్ముళ్లు

హజరత్ ఇమామ్ హుస్సేన్ వీరోచిత పోరాటానికి గుర్తుగా పది రోజులపాటు మన పెద్దాపురం లో హిందూ ముస్లీములు పీర్ల పండుగను ఎంతో ఘనంగా జరుపుకునే వారు

పెద్దపులి / నిప్పుల గుండం
పీర్ల పండుగకు పెద్దపులి వేశాలు ప్రధాన ఆకర్షణ గా నిలిచేవి – దాదాపు 21 వీధుల్లో ఈ పీర్లు నిలిపేవారు – ప్రధాన వీధుల గుండా ముస్లీమ్ సోదరులు కొరడాలతో తమ శరీరాల పై కొట్టుకొంటూ ఈ పీర్లను ఊరేగింపుగా మర్లావ వరకూ తీసుకెళ్లేవారు, పాత సంత మార్కెట్, కవాడీ వీధి, రామారావు పేట, హాస్పటల్ వీధి దర్గా సెంటర్ మొదలైన చోట్ల పీర్లు భద్రపరిచే స్థలాలుండేవి. ప్రధానంగా పాత సంతమార్కెట్ లో నిప్పుల గుండం ఏర్పాటు చేసే వారు హిందూ ముస్లీమ్ చిన్నా పెద్ద తేడాలేకుండా ఆ నిప్పుల గుండాన్ని తొక్కేవారు.

దాదాపు కనుమరుగైన పీర్ల పండుగ :
రాను రాను ఆదరణ కరువవడం వల్ల చాలా చోట్ల ఈ పీర్ల పండుగ దాదాపు కనుమరుగై పోయిందనే చెప్పాలి, అయితే ఇంకా కొంత మంది ఈ ఆచారాన్ని వంశపారపర్యంగా కొనసాగిస్తూనే ఉన్నారు. @వంగలపూడి శివకృష్ణ

1277total visits,5visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *