Peddapuram Samsthanam – Chirathapudi Agraharam
చిరతపూడి అగ్రహారం
పెద్దాపురం మహారాజు శ్రీ రాజా వత్సవాయి తిమ్మజగపతి బహద్దరు గారు దానంగా ఇచ్చిన అగ్రహారాలలో చిరతపూడి అగ్రహారం కూడా ఒకటి… ఇక్కడ మహారాజు గారు అగ్రహారాన్ని దానంగా ఇవ్వడమే కాకుండా శ్రీ భూసమేత కేశవ స్వామి దేవాలయం మరియు పార్వతీ బ్రహ్మేశ్వర స్వామి వారి దేవాలయాలను కూడా కట్టించారు శతాబ్దాల క్రితం పెద్దాపురం ప్రభువు కట్టించిన శ్రీ భూసమేత కేశవ స్వామి దేవాలయాన్ని 17 వ శతాబ్దం చివరలో తురుష్కులు పెద్దాపురం సంస్థానంపై దండయాత్రలో భాగంగా చుట్టుముట్టి కేశవ స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వసం చేశారు తరువాత ఆ ప్రదేశంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము నిర్మించారు… అలాగే 1996 కోనసీమలో సంభవించిన తుఫాను వల్ల రెండు దేవాలయాలలోని ధ్వజ స్తంభములు పెనుగాలులకు కూలిపోగా శివాలయం లోని ధ్వజ స్తంభమును పునరుద్దరించారు… వేణుగోపాల స్వామి ఆలయ ధ్వజస్థంభం పునరుద్దరణకు గ్రామస్థులు కృషి చేస్తున్నారు ఇక్కడి వేణుగోపాల స్వామి వారిని కళ్యాణగోపాలుడని అంటారు వివాహముకానివారు ఈ స్వామికి అభిషేకము, అర్చన చేసినంతనే వారికి వివాహము జరుగుతుందని, పెళ్ళైన తరువాత భార్యా భర్తలిద్దరూ స్వామివారికి కళ్యాణము జరిపిస్తే సంతానం కలిగి వారి దాంపత్యము సుఖసౌఖ్యాలతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉంటుందని… స్వామి వారిని దర్శించుకున్నవారి కోరికలు నెరవేరుతాయి… ఆపదలు తొలగించబడతాయని భక్తుల విశ్వాసం… @వంగలపూడి శివకృష్ణ
743total visits,2visits today