Peddapuram Samsthanam – Palivela Uma Koppu Lingeswara Swamy
పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి కథ
పౌరాణిక గాథల ప్రకారం క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతలింగాన్ని రాక్షసులు ఒక ‘పల్వలము’ (గొయ్యి) లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమృతలింగాన్ని వెలికి తీసి పరమేశ్వరితో సహా ఈ ప్రాంతంలో ప్రతిష్టించడం తటస్థించింది . కాలక్రమేణా ఆ పల్వలమే పలివెలగా మారింది.
చారిత్రక గాథల ప్రకారం
ఈ ప్రాంతాన్ని పూర్వకాలములో పల్లవులు పాలించుట వలన “పల్లవ” నుండి “పలివెల” అయిందని అంటారు.
శ్రీ కొప్పు లింగేశ్వర స్వామీ :
ఈ ప్రాంతంలో శివ లింగానికి కొప్పు ఉండడం మూలాన పరమేశ్వరునికి కొప్పు లింగేశ్వర స్వామీ అని పేరు పలివెల ప్రజలు చెప్పే కథ ప్రకారం ఒకానొకప్పుడు ఈ ఆలయంలో ఒక పూజారి ఈ శివ లింగారాధన, అర్చనా పూజాది కార్యక్రమాలను శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండెవాడు. కాని అ పూజారికి ఒక దురలవాటు ఉండేది. ఆయనకు ఒక వేశ్యతో సంబంధం ఉండేది. ఆ పూజారి గురుంచి పెద్దాపురం మహారాజుకి చాలా పిర్యాదులు అందుటూ ఉండేవి. అవన్నీ విన్న మహారాజు స్వయంగా పరీక్షించాలని ఒక రోజు ఆలయ దర్శనానికి రాగా ఆ పూజారి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసి స్వామి ప్రసాదాన్ని పెద్దాపురం మహారాజుగారి ఇస్తాడు. ఆ ప్రసాదంలో ఒక పొడవాటి వెంట్రుక కనిపిస్తుంది.
వెంటనే మహారాజు పూజారిని ఏమిటీ వెంట్రుక అని ప్రశ్నించగా పూజారి భయపడిపోయి మోహంలో భయాన్ని కళ్ళలో కనపడనీయకుండా…. “ఓ మహారాజా స్వామివారికి జటాజూటం ఉన్నది” అంటాడు మహారాజుగారు పూజారిని జటాజుటం చూపించమనగా పూజారి ఆ రోజు స్వామికి ప్రత్యేక అలంకారంలో ఉన్నారు కాబట్టి మరుసటి రోజు వచ్చి చూస్తే స్వామివారి జటాజూటం కన్పిస్తుంది అని అంటాడు. అప్పుడు మహారాజు అయితే సరే ఈ రోజుకి నిష్క్రమిస్తున్నాను, రేపు ఉదయాన్నే వస్తాను ఒకవేళ శివవింగం మీద జాటాజుటం కనిపించకపోతే నీ తల తీయించి వేస్తాను అని చెప్తాడు.
పూజారి ఆ రోజు రాత్రంతా శివలింగానికి పూజలు చేసి మహాదేవుడిని తనను కాపాడమని వేడుకోంటాడు. తరువాత రోజు రాజు దర్శనానికి వచ్చి చూస్తే శివలింగాన్ని చూస్తే జటాజూటం కనిపిస్తుంది. మహా రాజుకి ఆ జటాజుటం నిజమో కాదో అని సంశయం కలిగి జటాజుటాన్ని లాగి చుస్తాడు, శివ లింగం నుంచి నెత్తురు వస్తుంది, వెంటనే రాజుకు కంటి చూపు పోతుంది. అప్పుడు ఆ రాజు శివా మహాదేవా అని వేడుకొనగా ఆరాజుకు కంటి చూపు వస్తుంది. ఆ రాజు తన సామ్రాజ్యంలో జుటుగపాడు (ఇప్పటి రావులపాలెం మండలం లోని ఒక గ్రామం) అనే గ్రామాన్ని మాన్యంగా రాజు ప్రకటిస్తాడు. ఇప్పటికి కూడా శివలింగముకు జాటాజూటం ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ పవిత్రక్షేత్రంలో కొప్పులింగేశ్వరుడుగా పరమ శివుడు భక్తుల దర్శనం ఇచ్చి దర్శనం చేసుకొన్న వారిని మహాదేవుడు తరింపజేస్తున్నాడు.
వత్సవాయ వంశస్థులు పెద్దాపురం సంస్థానం పరిపాలించే కాలంలో పలివెల కూడా పెద్దాపురం సంస్థానం లో భాగంగా ఉండేది పెద్దాపురం సంస్థాన చరిత్ర రచించిన కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు మరియు ప్రత్యక్ష బాహాట పాంకాల శయ్యల చదివింప నేర్తు నే చదువ నేర్తు అని ప్రకటించుకున్న శ్రీ బులుసు రామగోవింద శాస్త్రి గారు పెద్దాపుర సంస్థానం మహారాజగు శ్రీ రాజా వత్సవాయ తిమ్మజగపతి బహద్దరు గారి ఆస్థాన పౌరాణికులు – తిమ్మజగపతి గారి కుమారుడైన రాజా రాయ జగపతి గారికి హరిభక్తి సుధోదయం అనే కృతిని సమర్పిచండం జరిగింది.
1071total visits,2visits today