Rallabandi Subbarao Archaeological Museum

మన పెద్దాపురం వాసి – చారిత్రక పరిశోధనా పిపాసి శ్రీ రాళ్లబండి సుబ్బారావు గారు

పెద్దాపురం లో 1891 వ సంవత్సరంలో పుట్టి పెద్దాపురం లో పెరిగి రాజమహేంద్రవరం లో స్థిరపడిన #శ్రీ_రాళ్లబండి_సుబ్బారావు గారు చారిత్రిక పరిశోధన చేసి అనేక విషయాలు తెలుసుకొని ఆంధ్రదేశ చరిత్రను రాయాలనే ఆలోచనతో ఆంధ్ర ఇతిహాస పరిశోధక మండలి స్థాపించారు ఆంధ్రదేశ చరిత్రకి శాసనాలకు సంబందించిన వ్యాసాలను ఈ సంస్థ ద్వారా పత్రికలలో వ్యాసాలు రాసి ప్రకటించేవారు, కళింగ దేశ చరిత్ర పరిశోధన చేసి ది హిస్టరీ అఫ్ కళింగ అనే గ్రంధాన్ని రచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిఘంటువు కమిటీ సభ్యులుగా ఎదిగి తన పేరుమీద రాజమహేంద్రవరంలో 1967 వ సంవత్సరంలో రాళ్ళబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటు అయ్యేంత స్థాయికి ఎదిగారు ఆయన 1969 వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు.

#రాళ్ళబండి_సుబ్బారావు_పురావస్తు_ప్రదర్శనశాల_విశేషాలు
ప్రముఖ చారిత్రిక పరిశోధకులు రచయితలు అయిన, శ్రీ చిలుకూరి నారాయణ రావు, కొమర్రాజు లక్ష్మణ రావు, శ్రీ మల్లంపల్లి సోమశేఖర్ శర్మ, శ్రీ చిలుకూరి వీరభద్రరావు గార్లు 1922 నుండీ శ్రీ రాళ్లబండి సుబ్బారావు గారికి సాహితీ మిత్రులు 1956 ప్రాంతంలో వీరందరి ప్రోత్సాహంతో శ్రీ రాళ్లబండి సుబ్బారావు గారు శతాబ్దాల కాలంనాటి చరిత్రకు సంబందించిన పురాతన వస్తు ప్రదర్శనశాలని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనశాలకి కార్యసాధకుడైన రాళ్లబండి సుబ్బారావు గారు కార్యదర్శి గా వ్యవహరించారు… చారిత్రక పరిశోధనా పిపాసి అయిన శ్రీ రాళ్లబండి సుబ్బారావు గారు విశేషముగా కృషి చేసి అనేకమైనటువంటి శాసనాలు, నాణేలు, శిలలు, శిల్పాలు, కంచు విగ్రహాలు, తాళపత్ర గ్రంధాలు, రాజులు ఉపయోగించిన ఖడ్గాలు, బ్రిటీషువారు ఉపయోగించిన ఆయుధాలు, యుద్ధ సామాగ్రి లాంటి ప్రాచీన సంపదను సేకరించి అలా సేకరించినటువంటి పురాతన వస్తువులను అన్నింటినీ ఆ ప్రదర్శనశాలలో భద్రపరుస్తూ ఉండేవారు

అలనాటి ఆంధ్రుల చరిత్ర, రాజమహేంద్రవరం చరిత్ర. సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవాలని తపించే ఏ పరిశోధకుడికైనా ఆ ప్రదర్శన శాల వేదికగా నిలుస్తుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు

#రాళ్లబండి_సుబ్బారావు_మ్యూజియంలో_పురాతనవస్తు_సామాగ్రి_వివరాలు
చరిత్ర పూర్వయుగం నుంచి మధ్య యుగం వరకూ వాడిన వివిధ పనిముట్లు రాతియుగాల కాలం నాటి గొడ్డళ్లు, చారిత్రిక యుగం నాటి రాతి పాత్రలు, మట్టి పాత్రలు, ఇటుకలు, ఇనుపయుగం నాటి పురాతన వస్తువులు కత్తులు, కటారులు, రాజులకాలం నాటి నాణాలు , ఇక్ష్వాకు, తూర్పు, చాళుక్య రాజులు వ్రాయించిన రాగిరేకు శాసనాలు, కొయ్యబొమ్మలు, రాతి శిల్పాలు, కంచు విగ్రహాలు, బీదరీ పాత్రలు, 11వ శతాబ్దంలో రాజోలు మండలంలోని తాటిపాకలో లభ్యమైన వర్దమాన మహావీరుడి విగ్రహం, ధవళేశ్వరం, వేమగిరి మధ్య త్రవ్వకాలలో లభ్యమైన శైవ పానవట్టం ఒక అద్భుతం అని చెప్పాలి, పాన పట్టం పై ఉన్న శివుడికి అభిషేకం చేస్తే, అభిషేకం చేరిన నీరు లేదా పాలు నందినోట్లో నుంచి బయటకు వస్తాయి. అలాగే వరంగల్‌ జిల్లా రామప్ప దేవాలయం నుంచి సేకరించిన నీటిపై తేలియాడే కాకతీయుల కాలంనాటి ఇటుక, సందర్శకులకు ఆశ్చర్యం కలుగచేస్తాయి, ఇక తూర్పు చాళుక్య రాజైన శ్రీ రాజరాజ నరేంద్రుని పేరుతో శ్రీరాజరాజ అని ముద్రించిన బంగారు నాణెం, 1975లో గోదావరి వరదలలో కొట్టుకుని వచ్చిన గిరిజన దేవత కొయ్య బొమ్మ, అలాగే మధ్యయుగానికి చెందిన స్కంధ మూర్తి, విష్ణు, శ్రీదేవి, భూదేవి, హనుమాన్‌, తార, విగ్రహాలు, గోల్కొండ నవాబులు కుతుబ్‌ షాహీల ఆయుధాలు, 3వశతాబ్దం నాటి సున్నపురాతితో చేసిన బుద్ధుని విగ్రహం, రాజమండ్రి చంద్రిక థియేటర్‌ తవ్వకాలలో లభ్యమైన పెద్ద నంది బొమ్మ తాటిపాకలో లభ్యమైన జైన తీర్ధంకరుడైన వర్ధమానమహావీరుడు, వేణుగోపాల .కుమార స్వామి, సూర్య, భైరవ, గణేశ, నంది.మకర తోరణం, ద్వారపాలక, ఆంజనేయ, శ్రీదేవి, పార్వతి శిల్పాలు గోదావరి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి

ఈ ప్రదర్శన శాలలో ఉన్న పురాతన వస్తువులను చుస్తే వాటిని సేకరించడానికి రాళ్ళబండి సుబ్బారావు గారు పడిన శ్రమ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం శ్రీ రాళ్లబండి సుబ్బారావు గారి పేరుమీదనే 1967 వ సంవత్సరంలో శ్రీ రాళ్లబండి సుబ్బారావు ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాల, రాజమండ్రిగా ఆ మ్యూజియం కి నామకరణం చేయడం జరిగింది. వంగలపూడి_శివకృష్ణ

846total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *