Science Experiments Competitions

హైస్కూల్ విద్యార్థులకు సైన్సు ప్రయోగాల పోటీలు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జనవిజ్ఞాన వేదిక పెద్దాపురం వారి సహకారంతో తేదీ 27.02.2018 న పెద్దాపురం మరియు సామర్లకోట జంటపట్టణాలలోని ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు సైన్సు ప్రయోగాల పోటీలు మహారాణీ కళాశాలలో జరగనున్నాయి

విద్యార్థులలో దాగి ఉన్న వైజ్ఞానిక మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీయడమే లక్ష్యంగా 27 ఫిబ్రవరి 2018 న సైన్స్ ఎక్స్పరిమెంట్ కాంపిటీషన్ లను మహారాణీ కళాశాలలో నిర్వహించనున్నట్టు రోటరీ క్లబ్ సభ్యులు తెలిపారు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకూ చదివే ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు మూడు విభాగాల వారీగా జరగనున్నాయని 5 వతరగతి విద్యార్థులు సబ్ జూనియర్ విభాగంలోనూ 6, 7, తరగతి విద్యార్థులు జూనియర్ విభాగంలోనూ 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులు సీనియర్ విభాగాలకు అర్హులని, ఈ పోటీలలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ప్రశంసా పత్రం (పార్టిసిపేషన్ సర్టిఫికెట్) మరియు మూడు విభాగాలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రం తో పాటుగా రోటరీ వారి అభినందన షీల్డ్ మరియు ప్రోత్సాహక నగదు బహుమతి ఉంటుందని ఆసక్తి కల అర్హులైన విద్యార్థుల పేర్లను ఈ నెల 25.02.2018 లోపుగా జనవిజ్ఞాన వేదిక పట్టణ కార్యదర్శి మరియు ప్రముఖ ఇంద్రజాలికులు శ్రీ బుద్దా శ్రీనివాసరావు గారికి 9441709187 కి ఫోన్ చేసి తెలియజేయ వలసినదిగా విద్యార్థుల తల్లి తండ్రులను పాఠశాలల ఉపాధ్యాయులను మరియు యాజమాన్యాలను రోటరీ కార్య నిర్వాహక సభ్యులు ధరణాలకోట గంగాధరుడు గారు, శేషుబాబ్జీ గారు, రావులపర్తి విజయ్ ప్రకాష్ గారు తదితరులు కోరారు

849total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *