Sucide History Of Peddapuram Maha Rani

 

వీరాంగన వీరరాఘవమ్మ చరితం

ఇది అలనాటి కధ ఆడదాని ఆత్మాభిమానం కాపాడుకోవడానికి ఆత్మాహుతే శరణ్యం అయ్యే రోజులనాడు పెద్దాపురం సంస్థానంలో మహారాణులు తురుష్కుల బారినుండి తమ మానాలు కాపాడుకోవడానికి కోటకి నిప్పు అంటించుకుని అగ్నికి ఆహుతి ఐన విషాద గాధ

అది 17వ శతాబ్దం పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ ఉద్దండ రాయజగపతి మహారాజు గారు (1688 – 1714 వరకూ పరిపాలించి ఆకస్మిక మరణం పాలయ్యారు మహారాజుకి ముగ్గురు రాజ కుమారులు ముగ్గురు కూడా చిన్న పిల్లలు అవడం వల్ల మహారాణి రాగమ్మ గారు పెద్ద కుమారుడైన తిమ్మ జగపతి కి పట్టాభిషేకం చేయించి తానే రాజ్య పాలనా భారం వహించేది రాజ కుమారుడిని సకల విద్యలలో ఆరితేరిన వాడిలా తీర్చిదిద్ది కళాతిమ్మ జగపతి అని బిరుదు పొందేంత గొప్పవాణ్ణి చేసి రాజ్యపాలన భారం అప్పగించింది. కళా తిమ్మ జగపతి మహారాజు మాతృవాక్య పరిపాలన చేశారు అతని సోదరులైన బలభద్ర రాజు, సూరపరాజు అతనికి లక్ష్మణులవలే రాజ్యపాలనలో సహాయం చేసేవారు రాజ్యం సర్వ సుభిక్షంగా ఉంది అనేక కళలు విలసిల్లాయి, కళాకారులు ఆదరించబడ్డారు

 

అదే సమయంలో శ్రీకాకుళం నవాబు అయిన అన్వరుద్ధీన్ ఖాన్ రాజమహేంద్రవరం పరిసర సంస్థానములకు హాజీ హుస్సేన్ అనే పేరుగల రుస్తుంఖాన్ ను కప్పములు వసూలు చేయడానికి నియమించెను,

మొగల్తూరు, నూజివీడు సంస్థానాలు కప్పం కట్టడానికి నిరాకరించి పెద్దాపురం సంస్థానం సైన్య సహాయము కోరెను రాగమ్మ గారు వారికి సైన్య సహాయం అందించినప్పటికీ రుస్తుంఖాన్ చేతిలో వారు ఓడిపోయారు… రుస్తుంఖాన్ వారి సంస్థానాలను ఆక్రమించుకున్నాడు… ఇక పెద్దాపురం సంస్థానం ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశ్యంతో పాండవుల మెట్ట వరకూ వచ్చి అక్కడ స్థావరం ఏర్పాటు చేసికొని వేచి ఉండెను…

రాగమ్మ గారు సైతం యుద్ధం అనివార్యం అని తలచి సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచెను… అయితే అనూహ్యంగా రుస్తుంఖాన్ తిమ్మరాజు గారు మరియు రాజ కుమారులను ఒకసారి స్నేహపూర్వకంగా కలవాలని రాయభారం పంపించాడు… అయితే రాగమ్మగారు దానికి ఒప్పుకోలేదు

రుస్తుంఖాన్ వెంటనే పెద్దాపురం కోటలోకి తనకుమారుడైన నూరుద్హీన్ ఖాన్ ను పంపి రాగమ్మగారిని ఒప్పించి రాజకుమారులు తీసుకు రమ్మని చెప్పను తండ్రి యొక్క కుటిల బుద్ధి తెలియని నూరుద్దీన్ ఖాన్ రాగమ్మ గారిని ఒప్పించి రాజా కుమారులను వెంట తీసుకుని రుస్తుంఖాన్ బస చేసిన డేరాలోనికి తీసుకుని వెళ్లెను రుస్తుంఖాన్ వారికి ఎదురు వచ్చి ఆప్యాయంగా వారిని పిలిచి కుశల ప్రశ్నలు వేస్తూ ఎంతో మర్యాదగా మాట్లాడం చూసి నూరుద్దీన్ ఖాన్ ఎంతో ఆనందం చెందాడు

అంతలోపే రుస్తుంఖాన్ సైన్యం రాజ కుమారులపై ఆకస్మిక దాడిచేసి మరిగే నూనెను మీద పోసి దొంగ దెబ్బ తీసెను నూరుద్దీన్ ఖాన్ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే రాజ కుమారులు ప్రాణం విడిచెను…

చల్లా పెద్ది అనే విశ్వాస పాత్రుడైన సేవక గూఢచారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాగమ్మ గారు వారి కోడళ్లతో సహా అంతఃపురం విడచి లక్క మేడ వద్దకి బయలుదేరారు… కళా తిమ్మ జగపతి కుమారుడైన బాలుడిని కొంపెల్ల లక్ష్మి సోదెమ్మకి అప్పగించి ఈ బాలుడే పెద్దాపురం సంస్థానం వారసుడు కాబట్టి ఎన్ని కస్టాలు వచ్చినా ఈ బాలుడిని విజయనగరం మహారాజుల వద్దకు తీసుకుని వెళ్లాలని అభ్యర్ధించింది… వెంటనే చల్లా పెద్దిని పిలిచి లక్క మేడలో ప్రవేశించి తురుష్కుల చేతిలో మాన ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఆత్మాహుతి చేసుకోవడమే మేలు అని తేల్చి లక్క మీదకి నిప్పు పెట్ట వలసిందిగా ఆజ్ఞాపించెను చల్లా పెద్ది ఎంత ప్రాధేయపడినా వినక నేను చెప్పినట్లు చేయవలసినది అని ఆజ్ఞాపించెను, మహారాణీ రాగమ్మ గారి ఆజ్ఞ ప్రకారం చల్లా పెద్ది లక్కమేడకు నిప్పు పెట్టెను అంతఃపురం లోని మహారాణులు చెలికత్తెలు అందరూ మంటలలో దూకి అగ్నికి ఆహుతి అయ్యారు… అఘోరం కళ్లారా చూసి తట్టుకోలేని చల్లా పెద్ది కూడా అదే మంటలలో దూకి మరణించెను

Ref : శ్రీ పాద వారి వీరంగనలు నుండి సేకరణ : వంగలపూడి శివకృష్ణ

1434total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *