పెద్దాపురం సంస్థానం – గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు… ఒకప్పటి పెద్దాపురం సంస్థానంలో భాగమైన ఏలేశ్వరం ప్రాంతంలో తిమ్మ జగపతి మహారాజు ప్రజల కోసం పెద్ద చెరువు త్రవ్వించాడట ఐతే విచిత్రంగా లింగంపర్తి వైపు గట్టు ఎప్పుడూ తెగిపోతుండెదట. బండ్లకొద్దీ మట్టివేసి ఏనుగులచేత త్రొక్కించి గట్టు బిగించినా కూడా కొట్టుకుపోయేదట. అప్పుడు వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారికి కలలో ఒక దేవత