Tag: Peddapuram History

పెద్దాపురాధీశుడు పిసినారి మహారాజా !!!

“ఇవ్వడు ఇవ్వడంచు జను లెప్పుడు తప్పక చెప్పుచుందు రే ………… డివ్వడు! తిమ్మజగత్పతీంద్రుడే.”   పెద్దాపురం సంస్థానాధీశులు చేతికి వెన్నుముక లేనివారుగా చుట్టుపక్కల అన్ని రాజ్యాలకూ సుపరిచితులయ్యారు వారి కీర్తి విశ్వవ్యాప్తమయ్యింది దేశ దేశాలనుండి కవులు, కళాకారులు, పండితులు, బ్రాహ్మణోత్తములే కాదు, ఇరుగు పొరుగు సంస్థానాల రాజులు, సామంత మండలాధీశులు సైతం పెద్దాపురాధీశుల వద్ద దానం పొందుతుండేవారు… పిఠాపురాధీశులు పసుపుకుంకుమ మాన్యంగా సామర్లకోట వద్ద గల కుమారారామ భీమవరం… యుద్ధ వేళలలో అవసరమైనపుడు సైన్యం పొందినట్టు చారిత్రకాధారాలున్నాయి

పెద్దాపురంలో తాళపత్ర నిథి

పెద్దాపురం 2007లో లభ్యమైన తాళపత్ర గ్రంథం బ్రహ్మీభూత శ్రీ శ్రీ శ్రీ మహీధర సూర్యసూరి అది 16 వ శతాబ్దం పెద్దాపురం సంస్థానాన్ని 1607 నుండి 1649 వరకూ పరిపాలించిన వత్సవాయ రాయజగపతి మహారాజు గారి పరిపాలనా కాలం…రాయ జగపతి తండ్రి గారైన చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు గారు పెద్దాపురం ఊలపల్లి, బిక్కవోలు, వాలుతిమ్మాపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో చెరువులు త్రవించి పండ్ల తోటలు వేయించి అభివృద్ధి చేశారు సీ. బిరుదాంకపురిని సుస్థిరముగా నిర్మించె బాలమున్నీటిని

Peddapuram Samsthanam – Palivela Uma Koppu Lingeswara Swamy

పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి కథ పౌరాణిక గాథల ప్రకారం క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతలింగాన్ని రాక్షసులు ఒక ‘పల్వలము’ (గొయ్యి) లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమృతలింగాన్ని వెలికి తీసి పరమేశ్వరితో సహా ఈ ప్రాంతంలో ప్రతిష్టించడం తటస్థించింది . కాలక్రమేణా ఆ పల్వలమే పలివెలగా మారింది. చారిత్రక గాథల ప్రకారం ఈ ప్రాంతాన్ని పూర్వకాలములో పల్లవులు పాలించుట వలన “పల్లవ” నుండి “పలివెల” అయిందని అంటారు. శ్రీ కొప్పు లింగేశ్వర స్వామీ :

History of Mandapeta Sivalayam

మన పెద్దాపురం మహారాజు నిర్మించిన మండపేట శివాలయం చరిత్ర క్రీస్తుపూర్వం 17 వ శతాబ్దంలో పెద్దాపురం మహారాజు శ్రీ శ్రీ శ్రీ వత్సవాయ సూర్యనారాయణ తిమ్మ జగపతి మహారాజు గారు మండపేట గ్రామంలో శివాలయం నిర్మించే నిమిత్తం ఒక శివలింగాన్ని తెప్పించారు ఆలయం నిర్మాణానికి పూనుకుని జరిపిస్తున్న త్రవ్వకాలలో భాగంగా వాతాపి అనే రాక్షసుడిని సంహరించి నందుకుగానూ పాప పరిహారార్ధం అగస్త్య మహర్షి ప్రతిష్టించిన పరమ పవిత్ర పంచ శివలింగాలలో ఒకటైన పురాతన కాలం నాటి శివలింగం

Peddapuram Incident – London Parliament

Rare Collection of పెద్దాపురం ఘటన లండన్ న్యూస్ పేపర్ (The Guardian) స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించాలనే విషయం చర్చించుకోవడానికి వత్సవాయి జగపతి వర్మ గారు ఆతిధేయిగా పెద్దాడ కామేశ్వరమ్మ గారు ఏర్పాటు చేసిన కూటమి 1930 డిసెంబరు 16 న సమావేశమయ్యింది… ధనుర్మాస వనభోజనాల పేరిట పెద్దాపురం పట్టణంలో 80 మంది వరకు పెద్దలు, యువకులు, పెద్దాపురం పుర ప్రముఖులు బొక్కా నారాయణమూర్తి గారి తోటలోకి చేరుకున్నారు… క్రొవ్విడి లింగరాజు, దువ్వూరి సుబ్బమ్మ,

Peddapuram King Gift to Victoria Maha rani

పెద్దాపురం మహారాజు లోహపు సైన్యం – విక్టోరియా మహారాణికి కానుక పెద్దాపురం సంస్థానం 1760 నుండి 1797 వరకూ పరిపాలించిన రాజా వత్సవాయ విద్వత్ తిమ్మ జగపతి గారికి శత్రువుల ముట్టడి ఎక్కువగా ఉండేది ఒకవైపు బ్రిటీషు వారు, ఇంకో వైపు మన్నెం బందిపోట్లు, మరో వైపు తురుష్కులు, వీటితో పాటూ రాజ్యంలో అంతర్గత కలహాలు, ఇరుగు పొరుగు సంస్థానాలతో ఇక్కట్లు… అధికంగా ఉండేవి సంస్థానంలో రక్తపాతం లేని రోజు ఉండేది కాదు…. ఇవన్నీ తట్టుకుని నిలబడి

PEDDAPURAM GREATNESS

పాండవులు నడయాడిన పుణ్యక్షేత్రం బౌద్ధం విలసిల్లిన ధర్మ క్షేత్రం వేల సంవత్సరాల పురాతన చరిత్ర వందల సంవత్సరాల రాజరిక చరిత్ర రాష్ట్రంలోనే రెండవ మున్సిపాలిటీ మొట్టమొదటి మునసీబు కోర్టు సైనిక శిక్షణా స్థావరం భర్తృ హరి సుభాషితాలు తెలుగులో అనువదించి భారత దేశంలో పేరు గాంచిన మహాకవి ఏనుగు లక్ష్మణకవి పుట్టిన భూమి ఆరుగజాల చీరను అగ్గిపెట్టిలో అమర్చి పెట్టి విదేశీయులను సైతం అబ్బురపరిచి 1924 లండన్ లో జరిగిన వెంబ్లీ చేనేత ఎక్షిబిషన్ లో మరియు

పెద్దాపురం రాజుగారి కోట చరిత్ర

పెద్దాపురం సంస్థానం రాజుగారి కోటయొక్క వర్ణన పెద్దాపురాధీశుడు పెద్దాపాత్రుడు నిర్మించగా వత్సవాయ వారు అభివృద్ధి చేసిన – 18 బురుజుల శత్రు దుర్బేధ్యమైన కోట…. పద్దెనిమిది బురుజులతో తాళ్ళబురుజు, హనుమంత బురుజు, తోక బురుజు మిక్కిలి ప్రసిద్దమయినవి… తాళ్ల బురుజు మీద నరసింహ స్వామి విగ్రహం ప్రతిష్టించబడింది… కోట చుట్టూ మూడు మెట్టలు మధ్యలో కోట ఉండేది… కోట యొక్క ప్రాకారము రాతితోనూ మట్టి తోనూ కట్టబడినది… దానికి రెండు గోడలు కలవు రెండింటి మధ్యలో రాకపోకలకు

Famous Paintings From Peddapuram

పెద్దాపురం వాసి ప్రసిద్ధ చిత్ర కళావధాని శ్రీ సింగంపల్లి సత్యనారాయణ గారు అతనొక చిత్రకళా మాంత్రికుడు చిత్రలేఖనంలో అతనిది అసామాన్యమైన ప్రతిభ మాట్లాడుతూ ఉంటే… మీ మాటల సారాన్ని ఆయన చిత్రీకరించగలడు మీరు పాట పాడుతున్నా … కవిత చదువుతున్నా… ఏదైనా సంగీత వాయిద్యం వాయిస్తున్నా…. ఆ అంశం ఎంత గొప్పగా ప్రదర్శిస్తే అంతకు పదింతలు గొప్పగా ఆయన గీసిన చిత్రం ఉంటుంది 2005 లో తిరుపతి త్యాగరాజ కళా మండపంలో ప్రసిద్ధ వాయిద్య కారుల సంగీతానికి

ALLURI SEETHA RAMA RAJU – PEDDAPURAM HISTORY

పెద్దాపురం తో అల్లూరి సీతారామరాజు అనుబంధం అల్లూరి సీతారామరాజు పోరాటంలో పెద్దాపురం పాత్ర అల్లూరి సీతారామ రాజు నడయాడింది ఇచ్చట మన్యానికి సింహమై తీర్చెను ఆ తెల్లదొరల తీట మన్నెం పోరాట యోధుడు… బ్రిటీషువారికి ముచ్చెమటలు పట్టించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు గారికి పెద్దాపురం డివిజన్ తో ఉన్న అనుబంధం పెద్దాపురం రెవిన్యూ డివిజన్ పరిధిలోనే ఆనాటి మన్నెం అటవీ ప్రాంతంఉండేది మన పెద్దాపురం ఆడపడుచు మద్దూరి రమణమ్మ గారి భర్త మద్దూరి అన్నపూర్ణయ్య గారూ