వీరాంగన వీరరాఘవమ్మ చరితం ఇది అలనాటి కధ ఆడదాని ఆత్మాభిమానం కాపాడుకోవడానికి ఆత్మాహుతే శరణ్యం అయ్యే రోజులనాడు పెద్దాపురం సంస్థానంలో మహారాణులు తురుష్కుల బారినుండి తమ మానాలు కాపాడుకోవడానికి కోటకి నిప్పు అంటించుకుని అగ్నికి ఆహుతి ఐన విషాద గాధ అది 17వ శతాబ్దం పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ ఉద్దండ రాయజగపతి మహారాజు గారు (1688 – 1714 వరకూ పరిపాలించి ఆకస్మిక మరణం పాలయ్యారు మహారాజుకి ముగ్గురు రాజ కుమారులు ముగ్గురు కూడా చిన్న