“ఇవ్వడు ఇవ్వడంచు జను లెప్పుడు తప్పక చెప్పుచుందు రే ………… డివ్వడు! తిమ్మజగత్పతీంద్రుడే.”   పెద్దాపురం సంస్థానాధీశులు చేతికి వెన్నుముక లేనివారుగా చుట్టుపక్కల అన్ని రాజ్యాలకూ సుపరిచితులయ్యారు వారి కీర్తి విశ్వవ్యాప్తమయ్యింది దేశ దేశాలనుండి కవులు, కళాకారులు, పండితులు, బ్రాహ్మణోత్తములే కాదు, ఇరుగు పొరుగు సంస్థానాల రాజులు, సామంత మండలాధీశులు సైతం పెద్దాపురాధీశుల వద్ద దానం పొందుతుండేవారు… పిఠాపురాధీశులు పసుపుకుంకుమ మాన్యంగా సామర్లకోట వద్ద గల కుమారారామ భీమవరం… యుద్ధ వేళలలో అవసరమైనపుడు సైన్యం పొందినట్టు చారిత్రకాధారాలున్నాయి