పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి కథ పౌరాణిక గాథల ప్రకారం క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతలింగాన్ని రాక్షసులు ఒక ‘పల్వలము’ (గొయ్యి) లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమృతలింగాన్ని వెలికి తీసి పరమేశ్వరితో సహా ఈ ప్రాంతంలో ప్రతిష్టించడం తటస్థించింది . కాలక్రమేణా ఆ పల్వలమే పలివెలగా మారింది. చారిత్రక గాథల ప్రకారం ఈ ప్రాంతాన్ని పూర్వకాలములో పల్లవులు పాలించుట వలన “పల్లవ” నుండి “పలివెల” అయిందని అంటారు. శ్రీ కొప్పు లింగేశ్వర స్వామీ :