పెద్దాపురం మహారాజు లోహపు సైన్యం – విక్టోరియా మహారాణికి కానుక పెద్దాపురం సంస్థానం 1760 నుండి 1797 వరకూ పరిపాలించిన రాజా వత్సవాయ విద్వత్ తిమ్మ జగపతి గారికి శత్రువుల ముట్టడి ఎక్కువగా ఉండేది ఒకవైపు బ్రిటీషు వారు, ఇంకో వైపు మన్నెం బందిపోట్లు, మరో వైపు తురుష్కులు, వీటితో పాటూ రాజ్యంలో అంతర్గత కలహాలు, ఇరుగు పొరుగు సంస్థానాలతో ఇక్కట్లు… అధికంగా ఉండేవి సంస్థానంలో రక్తపాతం లేని రోజు ఉండేది కాదు…. ఇవన్నీ తట్టుకుని నిలబడి