TEKUMALLA RAJA GOPALA RAO

భాషాతత్వ విశారద శ్రీ శ్రీ శ్రీ తేకుమళ్ళ రాజగోపాలరావు గారు

జననం 09-07-1876             మరణం 08-12-1938

             తేకుమళ్ళ రాజగోపాలరావు 1876, జూలై 9న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించాడు. విజయవాడలో స్థిరపడ్డాడు. ఇతడు విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, చారిత్రక పరిశోధకుడు, బహుభాషా కోవిదుడు మరియు రచయిత. ఈయన వ్రాసిన విహంగ యానం అనే నవల తెలుగులో వెలువడిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా గుర్తించబడింది. ఈయన అనేక పుస్తకాలు రచించించారు పశుశాస్త్రం, వ్యవసాయ శాస్త్రానికి సంబందించిన పుస్తకాలను కూడా ఆయన రచించారు, ఈయన గ్రంథాలయోద్ధరణకు చేసిన సేవలకుగాను, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఇతని పేర గ్రంథాలయం నెలకొల్పి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇతని కుమారుడు తేకుమళ్ళ రామచంద్రరావు గారు తన వద్ద వున్న అమూల్య గ్రంథాలను ఈ గ్రంథాలయానికి సమర్పించాడు.

జానపద వాజ్మయ భిక్షువు గా పేరుపొందిన నేదునూరి గంగాధరం గారు తేకుమళ్ళ రాజగోపాలరావు గారి సూచనల ప్రకారమే కట్టుకథలు, పొడుపు కథలు, యుక్తి లెక్కలు మొదలైన వాటిని సేకరించారు. కందుకూరి వీరేశ లింగం గారు తేకుమళ్ళ రాజగోపాలరావు గారు కళాశాలలో బి.ఏ చదువుకునే రోజులనుండీ మంచి మిత్రులు దాదాపు 36 సంవత్సరాలు మిత్రబంధం వారిది, అలానే సర్. ఆర్ వెంకటరత్నం నాయుడు గారు, డాక్టరు వేమూరి రామకృష్ణారావు గారు కూడా రాజగోపాలరావు గారికి మంచి మిత్రులు. 1902- 1905 వరకూ గుత్తిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు తరువాత విజయనగరం రిప్పన్ హిందూ థియలాజికల్ హై స్కూల్ లో కొంతకాలం పనిచేశారు, ఆ తరువాత మద్రాసు లోని ఒక క్రైస్తవ కళాశాలలో రాజగోపాలరావు గారు ఉపన్యాసకుడిగా పనిచేశారు, ఈయన గొప్ప చారిత్రక పరిశోధకుడు, ఉపజ్ఞావంతుడు, మేధావి, బహు భాషా జ్ఞాని క్రీ.శ 898 నాటి యుద్ధమల్లుని శాసనం లోని మధ్యాక్కర అని మొట్టమొదట కనుగొన్నారు, తమిళ భాష కంటే తెలుగు భాసే పురాతనమైంది ఆయన సిద్ధాంతీకరించేవారు,

1918 – 1923 వరకూ సౌత్ ఇండియన్ రీసెర్చ్ (దక్షిణ దేశ పరిశోధన) అనే ఆంగ్ల పత్రికను అచ్చు వేసేవారు

ఈయన పూర్వీకులు తల్లి తండ్రులు హిందువులే అయినప్పటికీ వీరేశలింగం గారి ప్రభావంతో బ్రహ్మమతంలోకి ప్రవేశించారు, తరువాత దానినుండి బయటకు వచ్చి 1916 లో హిందూమతాన్ని సంస్కరించుకోవడం అవసరం అని తలచి ఆర్ష సమాజము స్థాపించారు తనను ఆర్షయోగిగా ప్రకటించుకొన్నారు, అంతే కాదు 1936 లో ఆర్ష పత్రికను స్థాపించి కొంతకాలం నడిపారు… 1919 లో ఆయన మిత్రుడైన కందుకూరి వీరేశలింగం గారి మరణం ఆయనను ఎంతగానో కలచి వేసింది… వీరేశలింగం గారి జ్వర తీవ్రత 104.2 గా సూచించిన ధర్మా మీటరును… ఆయన వాడిన చెప్పులను జ్ఞాపకార్థముగా రావు గారు తనవద్దే ఉంచుకున్నారు

ఆంధ్ర సరస్వతీ గ్రంథమాలను స్థాపించి అనేక పుస్తకాలు అచ్చువేయించారు, తెలుగులోనే కాక ఈయన కన్నడ, ఇంగ్లీష్ బాషలలో కూడా పుస్తకాలు రచించారు

08-12-1938 నాడు మద్రాసు జనరల్ హాస్పిటలలో ఆయన తుదిశ్వాస విడిచారు

తేకుమళ్ళ రాజగోపాలరావుగారు అనేక రచనలు చేశారు అందులో నవలలు కథలు, పలు పత్రికలలో వ్యాసాలూ ఉన్నాయి
నవలలు
త్రివిక్రమ విలాసము (సాంఘిక నవల) – 1902
ఈ నవలకు 1902 లో రాజమహేంద్రవరం వాస్తవ్యులైన న్యాపతి సుబ్బారావు గారి చింతామణి పత్రిక నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందింది.
లలిత (నవల) 1914
కనకవల్లి (చారిత్రక నవల) 1916
శారదా పద్య వాచకములు (ఏడు భాగాలు)
విహంగ యానం (తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ నవల) 1934

కధలు
ఆంధ్ర దేశీయ కథావళి (మూడు భాగాలు)
రామలింగడు,
కాళిదాసు,
కృష్ణ దేవరాయలు,

స్త్రీ చరిత్ర కదంబం (ఇతిహాసం)
సారస్వత వ్యాసములు (రెండు భాగాలు)

ఛందశ్శాస్త్రము
పశు శాస్త్రము 1934
అర్ధశాస్త్రము
వ్యవసాయ శాస్రం ల పై అనేక పుస్తకాలు రచించారు

మణిభూషణము
సౌత్ ఇండియన్ రీసెర్చ్
వ్యవసాయము 1907 – 1911
ఆర్ష పత్రిక
ఆంధ్ర సరస్వతీ గ్రంథమాల వంటి పత్రికలను స్థాపించి వాటికి సంపాదకులు గా వ్యవహరించారు

ఇంగ్లీష్ లో వీరు వ్రాసిన గ్రంధాలు
దక్షిణ దేశ భాషలలోని ఛందస్సు
ఆంధ్ర వాజ్మయ చారిత్రిక చిత్రణం,
బుద్ధ చరిత్ర…. మొదలగునవి

By వంగలపూడి శివకృష్ణ
రిఫరెన్స్ : నా వాజ్మయ మిత్రులు : టేకుమళ్ళ కామేశ్వర రావు

1768total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *