Valmiki Puram – Valuthimmapuram History

వాల్మీకి పురం – వాలు తిమ్మాపురం

 

అవును అది వాల్మీకిపురమే – వాలు తిమ్మాపురం గా మారిన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

ఈ చిన్ని కధ చదవండి.

ప్రచస్థాముని పుత్రుడైన “రత్నాకరుడు” నైమికారణ్యములో దారితప్పిపోయి ఒక బోయవాడికి దొరుకుతాడు. సంతానం లేని ఆ బోయ వేటగాడు రత్నాకరున్ని తన వెంట తీసుకు పోయి, పెంచి పెద్దచేసి విలు విద్య, వేటలలో ప్రావీణ్యున్ని చేసి యుక్త వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాడు.దారిదోపిడి , దొంగతనము లను వృత్తిగా తీసుకొని బాటసారులను చంపి ధనాన్ని దోచుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రత్నాకరునికి ఒకరోజు అడవి దారిలో “నారద మహర్శి” కనిపిస్తాడు. రత్నాకరుడు నారద మహర్షి ని దోచుకునే ప్రయత్నము చేయగా …

“ధనం దోచుకు పోగలవు కానీ పాపపుణ్యాలు దోచుకు పోలేవు – నీ కుటుంబ సబ్యులు కూడా నీ పాపాన్ని పంచుకోవడానికి ముందుకు రారు” అని హితబోధ చేస్తాడు.

తన జీవన విదానం మీద విరక్తి చెందిన రత్నాకరుడు అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొంది వాల్మీకి మహర్షి గా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం సమీపించి మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, ఆంధ్ర దేశంలో ఉన్న”గోదావరి నదితీరం”లో విశ్రమించి విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని తన రామాయణ కావ్యంలొ పేర్కొన్నాడు.

ఆ సమయం లోనే ఉద్యానవనాన్ని తలపించే ఈ గ్రామం లో కొంత కాలం నివశించాడు ఆయన సంచరించి న ప్రాంతం కావడం చేత అది వాల్మీకి పురం గా ప్రశస్తి కెక్కింది. వాల్మీకి మహర్షి ఉన్న ప్రాంతమంతా నిత్యం రామ నామ స్మరణతో మారు మ్రోగుతూ వుండటం వల్ల సాక్షాత్ హనుమంతుల వారే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామీ వారిగా ఇక్కడ కొలువు తీరడం జరిగిందనేది పౌరాణిక కధనం.

ఆ తరువాత కాలంలో హనుమంతుని మహా భక్తులైనటువంటి జమ్మి వంశస్తులు – శ్రీ జమ్మి హనుమ్మద్దీక్షితులు గారిచే 1831 వ సంవత్సరంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించ బడటం – 1993 వ సంవత్సరం లో ఆలయ పునర్నిర్మాణం జరిగి నేటికీ జమ్మి వంశస్థులే వంశ పారంపర్యం గా నిర్వాకులుగా అర్చకులు గా సేవలందిస్తున్నారు.

వత్సవాయ వంశస్తుల పాలన వరకూ కూడా ఆ గ్రామం వాల్మీకి పుర అగ్రహారం గానే పిలువబడింది. వత్సవాయ వంశస్థులైన శ్రీ తిమ్మరాయ జగపతి గారి విస్తార మైన దానాల చేత అది వాలు ‘తిమ్మాపురం’ గ్రామం గా పరిణితి చెందివుండవచ్చు అనేది చరిత్రకారుల అబిప్రాయం.

ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ “ఏనుగు లక్ష్మణ కవి” రచించిన రామ విలాసము లోని ఒక వాక్యం ఈ వాదనలకు కొంత బలం తీసుకువస్తుంది చదవండి

“బొలుపుగా వాల్మీకిపురంబున ఫలభూజవాటికల్ పదిలపరచే”

తెలంగాణా లో పాలకుర్తి మండలం లోని “వల్మీడి”
రాయల సీమ లోని చిత్తూరు జిల్లాకి చెందిన “వాయల్పాడు”
మన తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురం మండలానికి చెందిన “వాలు తిమ్మాపురం” లు ఒకప్పుడు వాల్మీకి పురం గా వెలుగొందినవే అనడానికి చారిత్రిక పౌరాణిక కారణాలనేకం ఉన్నాయి.

చరిత్ర ఎప్పుడూ పునరావృత్త మవుతూనే ఉంటుంది పౌరాణిక కాలం దాటి, నాటి రెడ్డి రాజులు తదుపరి తిమ్మ రాయ జగపతి లు కాలం లో నిత్యరామ నామ స్మరణ సాగే వాల్మీకి పుర అగ్రహారం గా ఫల వృక్షాలతో నిండిపోయి ఉద్యానవనం గా విలసిల్లిన వాల్మీకి పురానికి దాదాపు 15 కోట్ల రూపాయల వ్యయంతో పదిన్నర ఎకరాల స్థలంలో ఇక్కడ నిర్మించబోయే నాచురల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అలాగే ఉద్యాన వన పంటల పరిరక్షణా కేంద్రాల నిర్మాణం తో మళ్ళీ పూర్వ వైభవం రానుంది. అది తొందరగా రావాలని ఆకాంక్షిస్తూ మీ వంగలపూడి శివకృష్ణ

1307total visits,3visits today

One Comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *