Acharya Vissa Apparao Garu, Peddapuram

విస్సా అప్పారావు (1884 – 1966) ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు.

వీరు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 1884 ఏప్రిల్ 24 తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు. విస్సా అప్పారావు గారు ఏకసంతాగ్రాహి పెద్దాపురం లో ప్రాధమిక విద్యాభ్యాసం చదివే రోజుల్లోనే రామాయణ మహా భారతాలు బట్టీ పట్టేసారు, అతి చిన్న వయసులోనే సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, కళల్లో ప్రావీణ్యం సంపాదించారు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, తమిళం, కన్నడం వంటి ఇతర భాషలు మాట్లాడగల బహుభాషా కోవిదులు,

రాజమండ్రి లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసే కాలంలోనే ఆయన అనేక మైన చారిత్రక వ్యాసాలు వ్రాయడం జరిగింది… అందులో పాడవజ్ఞాతవాస వత్సర వ్యాప్తి నిర్ణయము, ఐన్ స్టీన్ సాపేక్ష వాద సిద్ధాంతములు ప్రశంసలు అందుకున్నాయి రాజమండ్రిలోనే స్కూలు అసిస్టెంటుగా కొంతకాలం పనిచేసిన తరువాత 1909లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్ర అసిస్టెంటు ప్రొఫెసర్ గా నియమితులై ఆనర్సు విద్యార్థులకు బోధించారు. 1914 నుండి రాజమండ్రి, అనంతపురం కళాశాలలో పనిచేసి; 1927లో తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. అక్కడ 1936 వరకు పనిచేసి ఉత్తమ ఆచార్యులుగా, పరిపాలకులుగా ప్రఖ్యాతిచెందారు. 1936-38 మధ్య రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి, తర్వాత కొంతకాలం ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కళాశాల ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి; 1941 పదవీ విరమణ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామము మార్కొండపాడులో ఉమా మార్కండేయస్వామవారి దేవస్థానమునకు 16 ఎకరాల భూమిని దానం చేసినట్లు తెలుస్తుంది. రాజమండ్రిలోని గానకళా పరిషత్తు, రామారావు ఆర్టు గేలరీ, చిత్రకళాశాల మొదలైన సంస్థలను స్థాపించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పాలన మండలిలోను, ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీలోను, రేడియో మొదలైన సంస్థల సలహాసంఘాల సభ్యులుగా పనిచేశారు. మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో వీరు ఒకరు. వీరు 1966 జూలై 30 తేదీన హైదరాబాదులో పరమపదించారు.

శ్రీ విస్సా అప్పారావు గారు అనేక పుస్తకాలు, కీర్తనలు కూడా రచించడం జరిగింది :
త్యాగరాజ కీర్తనలు – 1947
క్షేత్రయ్య పదాలు – 1950
పరమాణు శక్తి – 1952
వ్యాసావళి – 1956
ఆకాశం – 1960 (భారత ప్రభుత్వ అవార్డు లభించింది)
విజ్ఞానం విశేషాలు – 1964
నృత్య సంగీత వ్యాస రత్నావళి – 1966
ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు – 1962

రామదాసు కీర్తనలు … ఇంకా మరెన్నో రచియించిన శ్రీ విస్సా అప్పారావు గారు ప్రముఖ కవి, రచయిత, జాతీయ అవార్డు గ్రహీత, యక్షగాన వాజ్మయం, జానపద విజ్ఞానాలను యావత్ భారతదేశానికి పరిచయం చేసిన ఒకానొక మేటి ఘనాపాటీ, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు కళాశాల ప్రిన్సిపాల్, చెళ్ళపిళ్ళ వేంకటకవి గారి ప్రియ మిత్రులు – గాన కళా పరిషత్తు, రామారావు ఆర్టు గేలరీ, చిత్ర కళాశాల మొదలైన సంస్థలను స్థాపించారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు పాలన మండలిలోను, ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీలోను, రేడియో మొదలైన సంస్థల సలహా సంఘాల సభ్యులుగా పనిచేశారు. మద్రాసు సంగీత అకాడమి మూల స్తంభాలలో వీరు ఒకరు… అన్నింటికీ మించి ఆ కాలంలోనే ఆయన కుమారుడికి వర్ణాంతర వివాహం జరిపించిన ఒక గొప్ప సంఘ సంస్కర్త కూడా… అంత గొప్ప వ్యక్తి అయిన శ్రీ విస్సా అప్పారావు గారు ఆంధ్రులు కావడం అందునా మన పెద్దాపురం వాసులు కావడం మనందరి అదృష్టం

642total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *